Friday, 19 July 2019

ఎస్‌ఎస్‌బీలో 150 ఉద్యోగాలు, గేట్-2020 నోటిఫికేషన్, నిమ్స్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగాలు, ఆర్మీలో జాగ్ ఎంట్రీ స్కీమ్.

ఎస్‌ఎస్‌బీలో 150 ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ) దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్పోర్ట్స్ కోటా విభాగంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
SSB- పోస్ట్ పేరు: కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)
- మొత్తం ఖాళీల సంఖ్య: 150
- విభాగాలు: ఫుట్‌బాల్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, హాకీ, షూటింగ్, ఆర్చరీ, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, రెజ్లింగ్, బాక్సింగ్, జూడో, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్, సైక్లింగ్, తైక్వాండో, ఈక్వెస్ట్రియన్
- అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. సంబంధిత క్రీడలో దేశం తరఫున ఆడటం లేదా గతంలో ఒలింపిక్స్, ప్రపంచ కప్, ఏషియన్ గేమ్స్‌లలో ఏదైనా పతకం సాధించి ఉండాలి.
- వయస్సు: 18 నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి. సంస్థ నియమాల ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- పేస్కేల్: రూ.21,700-69,100/- వీటికితోడు ఎస్‌ఎస్‌బీ రూల్స్ ప్రకారం డీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితర సదుపాయాలు ఉంటాయి.
- ఫీజు: జనరల్, ఓబీసీలకు- రూ.100/- ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
- ఎంపిక: బయోమెట్రిక్ ఎగ్జామ్, స్పోర్ట్స్ ట్రయల్స్, పీఎస్‌టీ ద్వారా
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్: పురుషులు- 170 సెం.మీ. ఎత్తు, ఛాతీ 80 సెం.మీ, గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ. వ్యాకోచించాలి.
- మహిళలు - 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (జూలై13-19) వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి.
- వెబ్‌సైట్: www.ssbrectt.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
గేట్-2020 నోటిఫికేషన్,
దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థల్లో లేదా ఐఐటీల్లో ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్ విభాగాల్లో పీజీ, పీహెడీ ప్రవేశాల కోసం నిర్వహించే గేట్ -2020 ్ర పకటన విడుదలైంది.
GATE-2020
-గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)ను ఈసారి రొటేషన్ పద్ధతిలో ఐఐటీ ఢిల్లీ నిర్వహిస్తుంది. ఈ పరీక్ష స్కోర్ ఉన్నత విద్యకు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగపడుతుంది. 
- గేట్-2020 ఫలితాలు విడుదలైన తేదీ నుంచి పీజీ ప్రవేశాలకు మూడేండ్లు, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (పీఎస్‌యూ)లకు ఒకటి లేదా రెండేండ్లవరకు వ్యాలిడిటీ ఉంటుంది.
- ఐఐటీలతోపాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాల్లో ప్రవేశానికి గేట్ స్కోర్ తప్పనిసరి. 
- అర్హతలు: సంబంధిత ఇంజినీరింగ్/టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ, ఎమ్మెస్సీ (సైన్స్/మ్యాథ్స్/స్టాటిస్టిక్స్, కంప్యూటర్ అప్లికేషన్), ఎంసీఏ, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.1,500/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళలకు రూ.750/-
- ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా
- పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి. జనరల్ ఆప్టిట్యూడ్ (విభాగం I)-10 ప్రశ్నలు. సంబంధిత సబ్జెక్టు (విభాగం II) నుంచి 55 ప్రశ్నలు ఇస్తారు. పరీక్షను మూడు గంటల్లో పూర్తిచేయాలి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 3
- దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 24
- పరీక్ష తేదీలు: 2020 ఫిబ్రవరి 1, 2, 8, 9
- వెబ్‌సైట్: http://gate.iitd.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిమ్స్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు,

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) 2019-20 ఇయర్‌కుగాను వివిధ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం నిర్వహించే నిమ్‌సెట్ పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.nims-logo
-నిమ్‌సెట్- పీహెచ్‌డీ 2019 
-విభాగాలవారీగా సీట్ల వివరాలు: ఎమర్జెన్సీ మెడిసిన్-1, జనరల్ మెడిసిన్-2, మెడికల్ జెనెటిక్స్-4, మైక్రోబయాలజీ-2, నెఫ్రాలజీ-3, న్యూరోసర్జరీ-4, రుమటాలజీ-2, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ-5, సర్జికల్ ఆంకాలజీ-2, ఆర్థోపెడిక్స్-2
- అర్హతలు: లైఫ్ సైన్సెస్‌లో మాస్టర్స్ డిగ్రీ, ఎండీ (ఆయుర్వేదిక్ మెడిసిన్), ఎంపీటీ, ఎంబీబీఎస్‌తోపాటు పీజీ (ఎంఎస్/ఎండీ/డీఎన్‌బీ) ఉత్తీర్ణత.
- అప్లికేషన్ ఫీజు: రూ.1500/-
- ఎంపిక: పరీక్ష, ఆప్టిట్యూడ్ టెస్ట్/ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూలై 31
- ప్రవేశ పరీక్ష: సెప్టెంబర్ 4
- వెబ్‌సైట్: www.nims.edu.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగాలు,

భిలాయ్‌లోని మినీరత్న కంపెనీ ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ (ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎల్) కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-మొత్తం పోస్టులు: 19(జూనియర్ మేనేజర్-18, మేనేజర్-1)
-విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్
-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, ఇంజినీరింగ్, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. 
-వయస్సు: జూనియర్ మేనేజర్‌కు 30 ఏండ్లు, మేనేజర్‌కు 42 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: రూ.500/-
-ఎంపిక: రాత పరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 8
-వెబ్‌సైట్: www.fsnl.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్మీలో జాగ్ ఎంట్రీ స్కీమ్.
ఇండియన్ ఆర్మీ (ఐఏ) జడ్జ్ అడ్వకేట్ జనరల్ డిపార్ట్‌మెంట్‌లోని షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా జాగ్ ఎంట్రీ స్కీమ్ (24వ కోర్సు)లో ప్రవేశాల కోసం లా గ్రాడ్యుయేట్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-జాగ్ ఎంట్రీ స్కీమ్ -ఏప్రిల్ 2020
-ఖాళీలు: 8 (పురుషులు-5, మహిళలు-3)
-అర్హత: కనీసం 55 శాతం మార్కులతో మూడేండ్ల లేదా ఐదేండ్ల ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణత. సంస్థ నిబంధనల ప్రకారం శారీరక ప్రమాణాలు ఉండాలి.
-వయస్సు: 2020 జనవరి 1 నాటికి 21 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, పీఎఫ్‌టీ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 14
-వెబ్‌సైట్: www.indanarmy.nic.in


No comments:

Post a Comment