Friday, 5 July 2019

‘నవోదయ’లో 2370 ఉద్యోగాలు, మజ్‌గావ్‌డాక్‌లో ఉద్యోగాలు, కేవీఐసీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, సీఎస్‌ఎంసీఆర్‌ఐలో ఉద్యోగాలు.

‘నవోదయ’లో 2370 ఉద్యోగాలు,

నవోదయ విద్యాలయ సమితిలో పీజీటీ, టీజీటీ, లీగల్ అసిస్టెంట్, స్టాఫ్ నర్స్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
Navodaya-Vidyalaya
-అసిస్టెంట్ కమిషనర్ (గ్రూప్-ఏ)
-ఖాళీలు: 5
-అర్హతలు: పీజీలో హ్యుమానిటీస్/సైన్స్ లేదా కామర్స్ ఉత్తీర్ణతతోపాటు లెవల్-10 పేస్కేల్ పోస్టులో కనీసం ఐదేండ్లు ప్రభుత్వ లేదా సెమీగవర్నమెంట్ లేదా అటానమస్ ఆర్గనైజేషన్‌లో పనిచేసి ఉండాలి.
-పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (గ్రూప్-బీ)
-ఖాళీలు: 439
-అర్హతలు: 40 ఏండ్లు మించకూడదు. కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత. బీఈడీ, ఇంగ్లిష్, హిందీ మీడియంలలో బోధించగలిగే ప్రావీణ్యం ఉండాలి. పీజీటీ కంప్యూటర్ సైన్స్ పోస్టులకు టీజీటీగా పనిచేసిన అనుభవం, కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్‌తోపాటు కనీసం 50 శాతం మార్కులతో కింది వాటిలో ఏదైనా ఒక అర్హత ఉండాలి.
-బీఈ/బీటెక్ (కంప్యూటర్‌సైన్స్/ఐటీ) లేదా బీఈ/బీటెక్ ఏ స్ట్రీమ్‌లోనైనా ఉత్తీర్ణతతోపాటు పీజీడీసీఏ లేదా ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్/ఎంసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్‌తోపాటు పీజీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
-ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్
-ఖాళీలు: 1154
-అర్హతలు : కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతోపాటు బీఈడీ, సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి. హిందీ, ఇంగ్లిష్ /స్థానిక భాషలో బోధించగలిగే సామర్థ్యం ఉండాలి.
-మ్యూజిక్-111, ఆర్ట్-130, పీఈటీ మేల్-148, పీఈటీ ఫిమేల్-105, లైబ్రేరియన్-70, స్టాఫ్ నర్స్-55, లీగల్ అసిస్టెంట్-1 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: పై పోస్టుల అర్హతలు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-ఎంపిక విధానం: రాతపరీక్ష/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ/పర్సనల్ ఇంటరాక్షన్ ద్వారా చేస్తారు.
-పరీక్ష కేంద్రం: రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉంది.
-పీజీటీ పోస్టులకు: రీజనింగ్ ఎబిలిటీ-15, జనరల్ అవేర్‌నెస్-15, టీచింగ్ ఆప్టిట్యూడ్-20, సంబంధిత సబ్జెక్టు-100 మార్కులతోపాటు లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్‌లో ఇంగ్లిష్, హిందీపై 30 ప్రశ్నలు ఇస్తారు. ఈ లాంగ్వేజ్ టెస్ట్ కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. దీనిలో క్వాలిఫై అయితేనే మిగిలిన విభాగాలను పరిగణనలోకి తీసుకుంటారు. పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు.
-టీజీటీ పరీక్ష విధానం: రీజనింగ్ ఎబిలిటీ-10, జనరల్ అవేర్‌నెస్-10, టీచింగ్ ఆప్టిట్యూడ్-15, సంబంధిత సబ్జెక్టు-100, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ -45 మార్కులు. పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు.
-మిగిలిన పోస్టుల ఎంపికకు నిర్వహించే పరీక్ష విధానాన్ని వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జూలై 10 నుంచి
-చివరితేదీ: ఆగస్టు 9
-ఫీజు చెల్లించడానికి చివరితేదీ: ఆగస్టు 12
-పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 5-10
-వెబ్‌సైట్: www.navodaya.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మజ్‌గావ్‌డాక్‌లో ఉద్యోగాలు,
భారత రక్షణ శాఖ పరిధిలోని మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్ లిమిటెడ్ (ఎండీఎల్) తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న రిగ్గర్ & ఎలక్ట్రీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
MAZAGONDOCK--SHIP
-మొత్తం ఖాళీల సంఖ్య: 366 
-విభాగాలవారీగా ఖాళీలు..
-ఎలక్ట్రీషియన్-149 ఖాళీలు (జనరల్-101, ఈడబ్ల్యూఎస్-20, ఓబీసీ-57, ఎస్సీ-20, ఎస్టీ-19)
-రిగ్గర్-217 ఖాళీలు (జనరల్-66, ఈడబ్ల్యూఎస్-14, ఓబీసీ-39, ఎస్సీ-14, ఎస్టీ-12)
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్/సంస్థ నుంచి ఎనిమిదో తరగతి, పదోతరగతితోపాటు ఎన్‌సీవీటీ లేదా ఎస్‌సీవీటీ సంస్థ నుంచి రిగ్గర్/ఎలక్ట్రీషియన్ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 జూలై 1 నాటికి 18 నుంచి 38 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ట్రెయినింగ్ పీరియడ్: రెండేండ్లు 
-స్టయిఫండ్: స్కిల్డ్ (గ్రేడ్-I) పోస్టులకు రూ. 17,000-64,360/-, సెమీ స్కిల్డ్ (గ్రేడ్-I) పోస్టులకు రూ.13,200-49,910/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 26
-ఆన్‌లైన్ ఎగ్జామ్: ఆగస్టు 31
-వెబ్‌సైట్: www.mazagondock.gov.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కేవీఐసీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు,
ముంబైలోని భారత ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన ఖాదీ & విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ (ఎస్సీ/ఎస్టీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
khadi
-గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టులు
-మొత్తం పోస్టులు: 119
-విభాగాలవారీగా ఖాళీలు: అసిస్టెంట్ డైరెక్టర్-7, సీనియర్ ఎగ్జిక్యూటివ్-9, ఎగ్జిక్యూటివ్-53, జూనియర్ ఎగ్జిక్యూటివ్-37, అసిస్టెంట్-13
-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, సీఏ, డిప్లొమా లేదా సంబంధిత సర్టిఫికెట్ కోర్సుల్లో ఉత్తీర్ణత.
-ఎంపిక: కంప్యూటర్‌బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 31
-ఆన్‌లైన్ ఎగ్జామ్: ఆగస్టులో
-వెబ్‌సైట్: www.kvic.org.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎస్‌ఎంసీఆర్‌ఐలో ఉద్యోగాలు.

భావ్‌నగర్‌లోని సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్‌ఎంసీఆర్‌ఐ) ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
csmcri
-మొత్తం ఖాళీలు: 9 (సైంటిస్ట్-7, సీనియర్ సైంటిస్ట్-2)
-సైంటిస్ట్: 32 ఏండ్లకు మించ రాదు. పే స్కేల్: రూ.90,688/-
-సీనియర్ సైంటిస్ట్: 37 ఏండ్లకు మించరాదు. పే స్కేల్: రూ. 1,04,896/-
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టు/బ్రాంచీలో ఎంఈ/ఎంటెక్ లేదా పీహెచ్‌డీ ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ.100/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 9
-వెబ్‌సైట్: www.csmcri.org

No comments:

Post a Comment