Wednesday, 10 July 2019

జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష, గురుకులాల్లో ఉచిత శిక్షణ, ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్లు, డీసీఐఎల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఎన్‌సీఆర్‌ఏలో ట్రెయినీలు.

జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష,

కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తిగల జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2020-21 విద్యాసంవత్సరానికి 6వ తరగతి (రెసిడెన్షియల్ ప్రోగ్రామ్)లో ప్రవేశం కోసం నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసింది.
JNV
-జవహర్ నవోదయ ప్రవేశపరీక్ష-2020
-అర్హత: ప్రస్తుత విద్యా సంవత్సరం (2019-20)లో ఏ జిల్లాలోనైతే నవోదయ విద్యాలయం పనిచేస్తుందో అదే జిల్లాకు చెందిన ప్రభుత్వ/ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వతరగతి చదువుతూ ఉండాలి.
-గమనిక: గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కనీసం 75 శాతం సీట్లు, బాలికలకు 1/3వ వంతు సీట్లు కేటాయించారు.
-వయస్సు: 2007 మే 1 నుంచి 2011 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి.
-ఎంపిక: జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఆధారంగా
-పరీక్ష మొత్తం 80 ప్రశ్నలకుగాను 100 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. రెండు గంటల్లో పూర్తిచేయాలి. పరీక్ష పత్రం ఇంగ్లిష్/హిందీతోపాటు ప్రాంతీయ (తెలుగు) భాషలో ముద్రిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చిరునామా: నవోదయ విద్యాలయ సమితి,
-ప్రాంతీయ కార్యాలయం,1-1-10/3, సర్దార్‌పటేల్ రోడ్, సికింద్రాబాద్ తెలంగాణ -500003
-చివరితేదీ: సెప్టెంబర్ 15
-ప్రవేశపరీక్ష: సమ్మర్ బౌండ్ ఎంపిక పరీక్ష-2020 జనవరి 11, వింటర్‌బౌండ్ ఎక్స్‌ట్రీమ్ ఎంపిక పరీక్ష-2020 ఏప్రిల్ 11
-వెబ్‌సైట్: http://navodayahyd.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
గురుకులాల్లో ఉచిత శిక్షణ,
హైదరాబాద్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఐఐటీ -జేఈఈ లాంగ్‌టర్మ్, క్లాట్ ఉచిత శిక్షణ ప్రవేశాల కోసం ఎస్సీ/ఎస్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

ఐఐటీ లాంగ్ టర్మ్, క్లాట్ ఉచిత శిక్షణ
-అర్హత: ఐఐటీ శిక్షణకు ఇంటర్‌తోపాటు 2019లో జేఈఈ మెయిన్లో 60-70 శాతం పర్సంటైల్ మార్కులు పొందిన తెలంగాణకు చెందిన ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు. క్లాట్ శిక్షణకు పదోతరగతి ఉత్తీర్ణత పొంది ఇంటర్ (ఆర్ట్స్/సైన్స్) మొదటి ఏడాది చదువుతున్న ఎస్సీ విద్యార్థులు మాత్రమే అర్హులు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-తరగతులు ప్రారంభం: జూలై 15 
-చిరునామా: ఐఐటీ లాంగ్ టర్మ్ కోసం ప్రిన్సిపాల్, టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ గౌలిదొడ్డి (ఫోన్-9398795047), క్లాట్ లాంగ్ టర్మ్ కోసం ప్రిన్సిపాల్ (ఫోన్-9704550234, 9949356339, 8374161149 సంప్రదించవచ్చు.

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్లు,

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) ఖాళీగా ఉన్న టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల (తాత్కాలిక ప్రాతిపదికన) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ECIL
-మొత్తం ఖాళీలు: 24
-టెక్నికల్ ఆఫీసర్-20 పోస్టులు (ఈసీఈ-8, మెకానికల్-3, సీఎస్‌ఈ-6, ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్-1, సీఎస్‌ఈ/ఈసీఈ-2)
-అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత.
-పే స్కేల్: 23,000/- (కన్సాలిడేటెడ్ పే)
-సైంటిఫిక్ అసిస్టెంట్-2 పోస్టులు
-అర్హత: ప్రథమ శ్రేణిలో డిప్లొమా (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 18,460/- (కన్సాలిడేటెడ్ పే)
-జూనియర్ ఆర్టిజియన్-2 పోస్టులు
-అర్హత: ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగంలో రెండేండ్ల ఐటీఐ ఉత్తీర్ణత.
గమనిక: ప్రతి పోస్టుకు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి. 
-పే స్కేల్: రూ. 16,770/- (కన్సాలిడేటెడ్ పే)
-వయస్సు: 2019 జూన్ 30 నాటికి టెక్నికల్ ఆఫీసర్‌కు 30 ఏండ్లు, మిగతా పోస్టులకు 25 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 11
-వెబ్‌సైట్:http://careers.ecil.co.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీసీఐఎల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు,
వైజాగ్‌లోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీసీఐఎల్) తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
DREDING
-పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్-5 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డ్రెడ్జింగ్ అండ్ హార్బర్ ఇంజినీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ (ఎంఈ/ఎంటెక్) ఉత్తీర్ణతతోపాటు ఏడాదిపాటు అనుభవం ఉండాలి. నెలకు రూ. 30,000/- చెల్లిస్తారు.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 23
-వెబ్‌సైట్: www.dredge-india.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీఆర్‌ఏలో ట్రెయినీలు.
పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ (ఎన్‌సీఆర్‌ఏ) ఖాళీగా ఉన్న ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.NCRA
-పోస్టు: అడ్మినిస్ట్రేటివ్ ట్రెయినీ-7 ఖాళీలు
-అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. టైపింగ్ స్కిల్‌తోపాటు కంప్యూటర్ అప్లికేషన్‌లో పరిజ్ఞానం ఉండాలి.
-వయస్సు: 2019 జూలై 1 నాటికి 28 ఏండ్లకు మించరాదు. 
-పే స్కేల్: రెండేండ్లపాటు స్టయిఫండ్ రూ.15,000/- చెల్లిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 20
-వెబ్‌సైట్: www.ncra.tifr.res.in


No comments:

Post a Comment