Sunday, 14 July 2019

ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ, ఎన్‌ఐఆర్‌డీలో ఉద్యోగాలు, ఎన్‌ఎఫ్‌ఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్‌లు ఉద్యోగాలు, సీఏయూలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు, ఎన్‌ఎంఐలో ప్రవేశాలు.

ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ,
ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 2020 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీం (47వ కోర్సు)లో చేరటానికి అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ (47వ కోర్సు)
- మొత్తం ఖాళీలు -55 (ఎన్‌సీసీ మెన్ - 50, ఎన్‌సీసీ ఉమెన్ - 5)
- అర్హతలు: ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్ హోల్డర్స్: ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌సీసీలో సీనియర్ డివిజన్‌లో కనీసం రెండు అకడమిక్ ఇయర్స్ సర్వీస్‌తోపాటు ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఎగ్జామ్‌లో కనీసం బీ లేదా సీ సర్టిఫికెట్స్‌ను పొంది ఉండాలి.
- నాన్ ఎన్‌సీసీ హోల్డర్స్: యుద్ధ క్షతగాత్రులు, మరణించినవారు, మిస్సింగ్ అయిన వారి కుటుంబాలకు చెందినవారు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. వీరికి ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్ అవసరం లేదు.
- వయస్సు: 2020 జనవరి 1 నాటికి 19 - 25 ఏండ్ల మధ్య ఉండాలి. 1995, జనవరి 2 - 2001, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
- పేస్కేల్: రూ. 56,100-1,77,500+నెలకు ఎంఎస్‌పీ రూ. 15,500/- చెల్లిస్తారు.
- ఎంపిక విధానం: ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ద్వారా
- ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూకు ఎంపికైన వారిని రెండు దశల్లో పరీక్షించి ఎంపిక చేస్తారు.
- చెన్నైలోని ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీలో 49 వారాల శిక్షణ ఇస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న వారికి లెఫ్టినెంట్ హోదాతో ఆర్మీలో ఉద్యోగావకాశం కల్పిస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 8
- వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఆర్‌డీలో ఉద్యోగాలు,

రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం ఖాళీలు: 5
- ప్రాజెక్టు మేనేజర్-2 
- ప్రాజెక్టు అసిస్టెంట్-2 
- అటెండెంట్-1 
- అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
- ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ 
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
- చివరితేదీ: జూలై 26
- వెబ్‌సైట్: www.nirdpr.org.in


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఎఫ్‌ఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్‌లు ఉద్యోగాలు,

నోయిడాలోని నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ (వర్కర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- మొత్తం పోస్టులు: 30
- పోస్టు పేరు: నాన్ ఎగ్జిక్యూటివ్ (వర్కర్)
- ట్రేడులు: టర్నర్, మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్, డీజిల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్, మెషిన్ టూల్ మెకానిక్, లోకో మెకానిక్.
- అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ ఉండాలి. 
- వయస్సు: 2019 జూన్ 30 నాటికి 18-30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
- అప్లికేషన్ ఫీజు: రూ. 200/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు ఫీజు లేదు)
- పేస్కేల్: రూ. 21,500-52,000/-
- ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష, స్కిల్ టెస్ట్
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఆగస్టు 8
- వెబ్‌సైట్: www.nationalfertilizers.com
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఏయూలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు,
మణిపూర్ (ఇంఫాల్)లోని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (సీఏయూ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- మొత్తం పోస్టుల సంఖ్య: 71
- పోస్టులు: సీనియర్ సైంటిస్ట్/అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, టెక్నికల్/హిందీ ఆఫీసర్, రిసెర్చ్ ఇంజినీర్, ఆఫీసర్ తదితర పోస్టులు
- విభాగాలు: ప్లాంట్ పాథాలాజీ, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, అగ్రానమీ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్, ఫిషరీస్, హార్టికల్చర్, హోంసైన్స్, ప్లాంట్ ప్రొటెక్షన్, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ తదితర విభాగాలు ఉన్నాయి.
- అర్హతలు: ప్రొఫెసర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఎంఈ/ఎంటెక్ లేదా పీహెచ్‌డీ, యూజీసీ/సీఎస్‌ఐఆర్ నెట్, ఏఎస్‌ఆర్‌బీ ఉత్తీర్ణత. 
- ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ. 1000/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 500/-
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా 
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చిరునామా: రిజిస్ట్రార్, సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఇంఫాల్
- దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 8
- వెబ్‌సైట్: www.cau.ac.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఎంఐలో ప్రవేశాలు.

న్యూఢిల్లీలోని భారత సాంస్కృతిక మంత్రిత్వశాఖలోని నేషనల్ మ్యూజియం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఆర్ట్, కన్జర్వేషన్ &మ్యూజియాలజీ 2019-20 ఏడాదికిగాను కింది కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 


పీజీ/పీహెచ్‌డీ ప్రవేశాలు
- ఎంఏ (హిస్టరీ అఫ్ ఆర్ట్)-25 సీట్లు
- ఎంఏ (కన్జర్వేషన్)-15 సీట్లు
- ఎంఏ (మ్యూజియాలజీ)-15 సీట్లు
- పీహెచ్‌డీ (హిస్టరీ ఆఫ్ ఆర్ట్)-5 సీట్లు
- పీహెచ్‌డీ (మ్యూజియాలజీ)-4 సీట్లు
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
- ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చిరునామా: Assistant Registrar, National Museum Institute, 1st floor, National Museum, Janpath, New Delhi - 110011
- చివరితేదీ: జూలై 16
- వెబ్‌సైట్: www.nmi.gov.in

No comments:

Post a Comment