Friday, 5 July 2019

ఈపీఎఫ్‌వోలో 2189 ఉద్యోగాలు,, కోల్ ఫీల్డ్స్‌లో స్టాఫ్ నర్సు ఉద్యోగాలు, సీఈఐఎల్‌లో ఇంజినీర్లు, సీఐసీఆర్ యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు, ఎన్‌జీఆర్‌ఐలో సైంటిస్టులు, తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖలో ఉద్యోగాలు.

ఈపీఎఫ్‌వోలో 2189 ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గపనైజేషన్ (ఈపీఎఫ్‌వో) వివిధ రీజియన్లలో ఖాళీగా ఉన్న సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- పోస్టు పేరు: సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్
- మొత్తం ఖాళీలు: 2189 (జనరల్-727, ఈడబ్ల్యూఎస్-317, ఓబీసీ-631, ఎస్సీ-293, ఎస్టీ-221)
- తెలుగు రాష్ర్టాలకు మొత్తం 211 పోస్టులు కేటాయించారు. దీనిలో తెలంగాణ-151 ఖాళీలు (జనరల్-54, ఈడబ్ల్యూఎస్-16, ఓబీసీ-53, ఎస్సీ-28), ఏపీ-60 ఖాళీలు (జనరల్-31, ఈడబ్ల్యూఎస్-5, ఓబీసీ-24) ఉన్నాయి.
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. కంప్యూటర్ ట్రెయినింగ్ సర్టిఫికెట్‌తోపాటు డేటా ఎంట్రీ వర్క్‌లో గంటకు 5000 కీ డిప్రెషన్స్ వేగం ఉండాలి.
- వయస్సు: 2019 జూలై 21 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- ఎగ్జామినేషన్ ఫీజు: రూ.500/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు రూ. 250/-

- పే స్కేల్: రూ. 25,500/- (పే మాట్రిక్స్ లెవల్ 7 ప్రకారం)
- ఎంపిక: ప్రిలిమినరీ (ఫేజ్-I) & మెయిన్ (ఫేజ్-II) రాత పరీక్ష , స్కిల్ టెస్ట్ ఆధారంగా
- ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. దీనిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్-30, రీజనింగ్ ఎబిలిటీ-35, న్యూమరికల్ ఆప్టిట్యూడ్-35 ప్రశ్నలు ఇస్తారు.
- మెయిన్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో రీజనింగ్/ఇంటెలిజెన్స్-40, జనరల్/ఎకానమీ/ఫైనాన్షియల్ అవేర్‌నెస్-40, ఇంగ్లిష్ లాంగ్వేజ్-30, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-40 ప్రశ్నలు ఇస్తారు. డిస్క్రిప్టివ్ పేపర్ 30 మార్కులకు ఉంటుంది.

- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూలై 21
- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: ఆగస్టు 31, సెప్టెంబర్ 1
- మెయిన్ ఎగ్జామ్/స్కిల్ టెస్ట్: ఫేజ్1 పరీక్ష తర్వాత
- వెబ్‌సైట్: www.epfindia.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కోల్ ఫీల్డ్స్‌లో స్టాఫ్ నర్సు ఉద్యోగాలు,
నాగ్‌పూర్‌లోని కోల్ ఇండియా లిమిటెడ్ పరిధిలోని వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్)లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం పోస్టులు: 99 
- పోస్టు పేరు: స్టాఫ్ నర్స్ ట్రెయినీ
- అర్హత: ఇంటర్/10+2తోపాటు ఏ గ్రేడ్ నర్సింగ్ డిప్లొమా/సర్టిఫికెట్‌లో ఉత్తీర్ణత. 
- పే స్కేల్: రూ. 31,852/-
- వయసు : 2019 జూన్ 27 నాటికి 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
- ఎంపిక: రాతపరీక్ష ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేది: జూలై 17
- వెబ్‌సైట్: www.westerncoal.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఈఐఎల్‌లో ఇంజినీర్లు,
సర్టిఫికేషన్ ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (సీఈఐఎల్) వివిధ విభాగాల్లో ఇంజినీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం ఖాళీల సంఖ్య 167
- ఇన్‌స్పెక్షన్ ఇంజినీర్ (గ్రేడ్1)-46 ఖాళీలు (సివిల్-12, మెకానికల్-22, ఎలక్ట్రికల్-12)
- ఇన్‌స్పెక్షన్ ఇంజినీర్ (గ్రేడ్2)-85 ఖాళీలు (సివిల్-26, మెకానికల్-41, ఎలక్ట్రికల్-18)
- ఇన్‌స్పెక్షన్ ఇంజినీర్ (గ్రేడ్3)-33 ఖాళీలు (సివిల్-11, మెకానికల్-21, ఎలక్ట్రికల్-1)
- సేఫ్టీ ఆఫీసర్/ఇంజినీర్ (గ్రేడ్2)-2 ఖాళీలు
- సేఫ్టీ ఆఫీసర్/ఇంజినీర్ (గ్రేడ్3)-1 ఖాళీ
- అర్హతలు: మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా/బ్యాచిలర్ డిగ్రీ కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 
- వయస్సు, పేస్కేల్స్ వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
- ఇంటర్వ్యూ తేదీ: జూలై 5-18 వరకు
- వెబ్‌సైట్: http://ceil.co.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఐసీఆర్ యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు,
ఐసీఏఆర్-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాటన్ రిసెర్చ్ (సీఐసీఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

- పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్స్-7 ఖాళీలు 
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్/లైఫ్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్, సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణత.
- పే స్కేల్: గ్రేడ్1 పోస్టులకు రూ. 15000/- , గ్రేడ్2 పోస్టులకు రూ. 25000/-కన్సాలిడేటెడ్ పే రూపంలో చెల్తిస్తారు.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- ఇంటర్వ్యూ తేదీ: జూలై 4
- వెబ్‌సైట్: www.cicr.org.in.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌జీఆర్‌ఐలో సైంటిస్టులు,
హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్ - నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

- ప్రాజెక్టు సైంటిస్ట్-5 ఖాళీలు
- అర్హత: జియోఫిజిక్స్/అప్లయిడ్ జియోఫిజిక్స్/జియాలజీ/అప్లయిడ్ జియాలజీలో పీహెచ్‌డీ. రిసెర్చ్ రంగంలో అనుభవం 
- పే స్కేల్: రూ. 48,200/- 
- వయస్సు: 40 ఏండ్లకు మించరాదు. 
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- ఇంటర్వ్యూ తేదీ: జూలై 5
- వెబ్‌సైట్: www.ngri.org.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖలో  ఉద్యోగాలు.

హైదరాబాద్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖకు చెందిన హెల్త్ కమాండ్ సెంటర్‌లో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

- మొత్తం ఖాళీలు-7
- పోస్టుల వివరాలు... మేనేజర్-1, పీడియాట్రీషియన్-1, డ్యూటీ డాక్టర్స్-2, టెలికాలర్స్-3
- అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో లేదా సెల్ నంబర్: 9490957032లో సంప్రదించవచ్చు.
- చివరితేదీ: జూలై 5
- చిరునామా: డీడీ (అడ్మినిస్ట్రేషన్), తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ, హైదరాబాద్, తెలంగాణ.

No comments:

Post a Comment