Friday, 5 July 2019

రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 205 ఉద్యోగాలు, ఎన్‌హెచ్ టెట్ జూలై 2019, బ్యాంక్ నోట్‌ప్రెస్‌లో ఉద్యోగాలు, డీఆర్‌డీవోలో సైంటిస్టులు.

రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 205 ఉద్యోగాలు,

ఒడిశాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్న రూర్కెలా స్టీల్ ప్లాంట్ (ఆర్‌ఎస్‌పీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రెయినీ మేనేజ్‌మెంట్, జూనియర్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
STEEL-PLANT
మొత్తం పోస్టులు: 205
-విభాగాల వారీగా ఖాళీలు..ఎగ్జిక్యూటివ్ పోస్టులు-26. దీనిలో.. డిప్యూటీ మేనేజర్ (బాయిలర్ అండ్ టర్బైన్ ఆపరేషన్)-11, మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఫైర్)-6, జూనియర్ మేనేజర్ (సేఫ్టీ)-6, జూనియర్ మేనేజర్ (క్వాలిటీ టెస్టింగ్ అల్ట్రాసోనిక్)-3 ఖాళీలు ఉన్నాయి.
-నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు-106. దీనిలో ఫైర్ ఆపరేటర్ ట్రెయినీ-25, ఫైర్‌మ్యాన్ కమ్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ట్రెయినీ-81 ఖాళీలు ఉన్నాయి.
-బాయిలర్ ఆపరేటర్-7 ఖాళీలు
-ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రెయినీ-47 ఖాళీలు (మెకానికల్-13, మెటలర్జీ-14, ఎలక్ట్రికల్-10, ఎలక్ట్రానిక్స్-5, ఇన్‌స్ట్రుమెంటేషన్-5
-అటెండెంట్ కమ్ టెక్నీషియన్-19 ఖాళీలు ఉన్నాయి.
పోస్టులవారీగా అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి నేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులకు ఫైర్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్, జూనియర్ మేనేజర్‌కు మెకానికల్/మెటలర్జీ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్‌తోపాటు ఇండస్ట్రియల్ సేఫ్టీలో డిప్లొమా/పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత. ఫైర్ ఆపరేటర్‌కు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు నేషనల్ ఫైర్ సర్వీసెస్ కాలేజ్ (నాగ్‌పూర్)చే సబ్ ఆఫీసర్ కోర్సు చేసి ఉండాలి. మిగతా పోస్టులకు మెట్రిక్యులేషన్/పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయస్సు: 2019 జూలై 31 నాటికి 18 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పేస్కేల్: మేనేజర్ పోస్టులకు రూ. 32,900-58,000/-, మేనేజ్‌మెంట్ ట్రెయినీలకు రూ. 20,600-46,500/- ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ రూ. 16,800-24,110/-
అప్లికేషన్ ఫీజు: రూ. 500/-, (ఆపరేటర్ కమ్ టెక్నీషియన్‌కు రూ. 250/-, అటెండెంట్ కమ్ టెక్నీషియన్‌కు రూ. 150/-)
ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్/ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూలై 31
వెబ్‌సైట్: www.sailcareers.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌హెచ్ టెట్ జూలై 2019,

నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (ఎన్‌సీ హెచ్‌ఎంసీటీ) నేషనల్ హాస్పిటాలిటీ టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (ఎన్‌హెచ్ టెట్)- జూలై 2019 ప్రకటన విడుదల చేసింది.
NHTET-BUILDING
-కౌన్సిల్ అనుబంధ హాస్పిటాలిటీ విద్యా సంస్థల్లో అసిస్టెంట్ లెక్చరర్, టీచింగ్ అసోసియేట్ నియామకాలకు ఎన్‌హెచ్‌టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి.
-ఎన్‌హెచ్ టెట్ -జూలై 2019
-అర్హత: ఇంటర్ తర్వాత హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్/హోటల్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు రెండేండ్ల అనుభవం లేదా హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్/హోటల్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ డిగ్రీతోపాటు మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-ఫీజు: రూ. 800/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళలకు రూ. 400/-)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 9
-పరీక్ష తేదీ: జూలై 20
-వెబ్‌సైట్: http://nchm.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బ్యాంక్ నోట్‌ప్రెస్‌లో ఉద్యోగాలు,
దేవాస్ (మధ్యప్రదేశ్)లోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటేడ్‌లోని బ్యాంక్ నోట్ ప్రెస్ టెక్నికల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
bnp
-మొత్తం పోస్టులు-58
-సూపర్‌వైజర్ (ప్రింటింగ్ అండ్ ప్లేట్‌మేకింగ్/ఎయిర్ కండిషనింగ్/ఇంక్‌ఫ్యాక్టరీ)-20
-జూనియర్ టెక్నీషియన్ (ఇంక్ ఫ్యాక్టరీ/ప్రింటింగ్ అండ్ ప్లేట్ మేకింగ్)-38
-అర్హత: సంబంధిత ట్రేడులు/బ్రాంచీల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 జూలై 25 నాటికి జూనియర్ టెక్నీషియన్లకు 25 ఏండ్లు, సూపర్‌వైజర్లకు 30 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: సూపర్‌వైజర్ పోస్టులకు రూ. 26,000-1,00,000, జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు రూ. 7,750-19,040/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 25
-వెబ్‌సైట్: http://spmcil.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్‌డీవోలో సైంటిస్టులు.
డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)కు చెందిన రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (ఆర్‌ఏసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
scientists-posts
-మొత్తం ఖాళీలు: 40
-పోస్టులు-ఖాళీలు: సైంటిస్ట్ (ఎఫ్)-2, సైంటిస్ట్ (ఈ)-4, సైంటిస్ట్ (సీ)-21, సైంటిస్ట్ (డీ)-13.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్/ప్రొడక్షన్, ఏరోనాటికల్/ఏరోస్పేస్, ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లేదా తత్సమాన విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవంతోపాటు ఎంఈ/ఎంటెక్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
-గమనిక: జర్మన్, ఫ్రెంచ్, రష్యన్, జపనీస్, చైనీస్ భాషల్లో పరిజ్ఞానం/ప్రావీణ్యం ఉండాలి.
-పే స్కేల్: సైంటిస్ట్ (ఎఫ్) పోస్టులకు రూ. 1,31,100/- సైంటిస్ట్ (ఈ)- రూ. 1,23,100/-, సైంటిస్ట్ (సీ)-రూ. 67,700/,సైంటిస్ట్ (డీ)- రూ. 78,800/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/- ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 12
-వెబ్‌సైట్: http://rac.gov.in


1 comment: