Friday, 5 July 2019

డీటీయూలో 167 ఉద్యోగాలు , ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ డిప్లొమా ప్రవేశాలు, టీఎఫ్‌ఆర్‌ఐలో ఉద్యోగాలు , ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్‌ ప్రొఫెసర్లు ఉద్యోగాలు , ఎన్‌ఐటీలలో ఉద్యోగాలు , టీఎంసీ సైంటిఫిక్‌ ఆఫీసర్లు ఉద్యోగాలు .

డీటీయూలో 167 ఉద్యోగాలు ,
ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(డీటీయూ)లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
University
-పోస్టు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
-మొత్తం ఖాళీలు: 167
-విభాగాల వారీగా ఖాళీలు: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌-7, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌-32, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ-15, మేనేజ్‌మెంట్‌ (డీఎస్‌ఎం)-15, మేనేజ్‌మెంట్‌ (యూఎస్‌ఎంఈ)-19, ఎకనామిక్స్‌ (యూఎస్‌ఎంఈ)-3, మ్యాథమెటిక్స్‌&కంప్యూటింగ్‌-5, అప్లయిడ్‌ ఫిజిక్స్‌-8, ఇంజినీరింగ్‌ ఫిజిక్స్‌-11, బయోటెక్నాలజీ-8, ఈసీఈ-26, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌-29 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్‌తోపాటు ఎంఈ/ఎంటెక్‌ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. ఏజీపీ స్కేల్‌ను బట్టి ఆయా పోస్టులకు నెట్‌/సెట్‌ లేదా తత్సమాన పరీక్షల్లో వ్యాలిడ్‌స్కోర్‌ లేదా పీహెచ్‌డీ ఉండాలి. మరికొన్ని పోస్టులకు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత ఉండాలి. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-వయస్సు: 2019, ఆగస్టు 1 నాటికి 35 ఏండ్లు మించరాదు.
-పేస్కేల్‌: ఏజీపీ రూ.6,000+ పేబ్యాండ్‌ 3 (15,600-39,100)
-ఎంపిక: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను అర్హత ప్రకారం షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. పీహెచ్‌డీ ఉన్నవారికి నేరుగా ఇంటర్వ్యూలు
నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు: జనరల్‌/ఓబీసీలకు రూ.1,000/- ఈడబ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.500/-
-చివరితేదీ: ఆగస్టు 21
-వెబ్‌సైట్‌: http://www.dtu.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ డిప్లొమా ప్రవేశాలు,

భివాడిలోని ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది.
Tool-Rooms
-కోర్సులు: అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ టూల్‌&డై మేకింగ్‌ (నాలుగేండ్ల కోర్సు), డిప్లొమా ఇన్‌ మెకట్రానిక్స్‌ (మూడేండ్లు).
-అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. పదోతరగతిలో సైన్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులుగా చదివి ఉండాలి.
-వయస్సు: 2019, ఆగస్టు 1 నాటికి 15-19 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 23
-వెబ్‌సైట్‌: www.msmebhiwadi.org
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీఎఫ్‌ఆర్‌ఐలో ఉద్యోగాలు ,
ట్రాపికల్‌ ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (టీఎఫ్‌ఆర్‌ఐ)లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.
-టెక్నికల్‌ అసిస్టెంట్‌ (కేటగిరీ-II)- 4 
-అర్హతలు: బీఎస్సీ (బాటనీ/బయాలజీ లేదా ఫారెస్ట్రీ) సబ్జెక్టులుగా ఉత్తీర్ణత.
-స్టెనోగ్రాఫర్‌ (గ్రేడ్‌-II)-2 పోస్టులు
-అర్హతలు: ఇంటర్‌తోపాటు స్టెనోగ్రఫీ ఇంగ్లిష్‌/హిందీలో నిమిషానికి 80 పదాల వేగం కలిగి ఉండాలి. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి. ప్రతి పదానికి 5 కీ డిప్రెషన్‌ టైపింగ్‌ స్పీడ్‌ కలిగి ఉండాలి.
-లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ - 10 పోస్టులు
-అర్హతలు: ఇంటర్‌, టైపింగ్‌ ఉండాలి.
-టెక్నీషియన్‌ (పే లెవల్‌-2)- 3 (ఎలక్ట్రికల్‌, ప్లంబర్‌, కార్పెంటర్‌)
-అర్హతలు: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
-డ్రైవర్‌- 2 
-అర్హతలు: పదోతరగతితోపాటు వ్యాలిడిటీ ఉన్న మోటార్‌ కారు డ్రైవింగ్‌ లైసెన్స్‌తోపాటు డ్రైవింగ్‌లో కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి.
-ఫారెస్ట్‌ గార్డు-2, మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌-13 ఖాళీలు ఉన్నాయి.
-వయస్సు: 18- 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఆయా పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. 
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: ఆగస్టు 9
-వెబ్‌సైట్‌: http://tfri.icfre.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్‌ ప్రొఫెసర్లు ఉద్యోగాలు ,
రాంచీలోని నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ స్టడీ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌ లా (ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్‌)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-పోస్టు: ప్రొఫెసర్‌ (లా)-2, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ (లా)-2, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (లా)-2 
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: జూలై 31
-వెబ్‌సైట్‌: www.nusriranchi.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐటీలలో ఉద్యోగాలు ,
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) పుదుచ్చేరి, తాడేపల్లిగూడెంలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌, ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-పుదుచ్చేరి నిట్‌లో: అసిస్టెంట్‌ లైబ్రేరీ-1, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (మెకానికల్‌, ఈసీఈ, ఈఈఈ, సీఎస్‌ఈ, సివిల్‌)-5, సూపరింటెండెంట్‌-2, స్టెనోగ్రాఫర్‌-1, జూనియర్‌ అసిస్టెంట్‌-7, టెక్నీషియన్‌-6, ఆఫీస్‌ అటెండెంట్‌-2 ఖాళీలు ఉన్నాయి.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: ఆగస్టు 1
-వెబ్‌సైట్‌: http://nitpy.ac.in
-తాడేపల్లిగూడెం నిట్‌లో: ఫ్యాకల్టీ పోస్టులు. (అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (గ్రేడ్‌-1,2)
-విభాగాలు: సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఈసీఈ, మెటలర్జీ అండ్‌ మెటీరియల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌, మ్యాథ్స్‌, బయోటెక్నాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ. 
-అర్హతలు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
-వెబ్‌సైట్‌: http://www.nitandhra.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీఎంసీ సైంటిఫిక్‌ ఆఫీసర్లు ఉద్యోగాలు .

ముంబైలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌ (టీఎంసీ)లో సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
TMC
-పోస్టులు: సైంటిఫిక్‌ ఆఫీసర్‌ డీ(కంప్యూటేషనల్‌ ఇమేజింగ్‌)-1, అసిస్టెంట్‌ మెడికల్‌ సూపరిండెంట్‌-1, సైంటిఫిక్‌ ఆఫీసర్‌ సీ-1, సైంటిఫిక్‌ ఆఫీసర్‌ (హెమటోపాథాలజీ ల్యాబొరేటరీ)-1, నర్స్‌ -1, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ సీ-1, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ బీ-1, టెక్నీషియన్‌ సీ-1 ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 31
-వెబ్‌సైట్‌: www.actres.gov.in

No comments:

Post a Comment