ఎన్డీఏ & ఎన్ఏ ఎగ్జామినేషన్ II నోటిఫికేషన్,
ఇంటర్ అభ్యర్థులకు అవకాశం
-ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం
-రాతపరీక్ష, ఇంటర్వూ ద్వారా ఎంపిక
-చివరితేదీ: సెప్టెంబర్ 3
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) & నేవల్ అకాడమీ (ఎన్ఏ) ఎగ్జామినేషన్ (II), 2019కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. .
UPSC
-ఎన్డీఏ & ఎన్ఏ ఎగ్జామినేషన్‌ను ప్రతియేటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఈ ఎగ్జామ్ ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్
విభాగాల్లోని ఖాళీలను భర్తీచేస్తారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 415
-నేషనల్ డిఫెన్స్ అకాడమీ: 370 పోస్టులు (ఇండియన్ ఆర్మీ-208, ఇండియన్ నేవీ-42, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్-120)
-ఇండియన్ నేవల్ అకాడమీ-45 పోస్టులు (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్)
అర్హతలు:
-ఆర్మీ వింగ్ (ఎన్డీఏ) : గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి ఇంటర్ లేదా 10+2 లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-ఎయిర్ ఫోర్స్/నేవల్ (ఎన్డీఏ)/ఇండియన్ నేవల్ అకాడమీ: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లతో ఇంటర్ లేదా 10+2లో ఉత్తీర్ణత. ఇంటర్ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చును.
-వయస్సు: 18 నుంచి 21 ఏండ్ల మధ్య ఉండాలి. (2 జనవరి 2001 నుంచి 1 జనవరి 2004 మధ్య జన్మించి ఉండాలి)
శారీరక ప్రమాణాలు:
-ఎత్తు: 157.5 సెంటీమీటర్లు, ( ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 162.5 సెంటీమీటర్లు)
-బరువు: ఎత్తుకు తగ్గ బరువును కలిగి ఉండాలి.
-కంటిచూపు: 6/6, 6/9
-ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్‌లో..
-15 నిమిషాల్లో 2.4 కి.మీ. దూరాన్ని పూర్తిచేయాలి
-స్కిప్పింగ్ చేయాలి
-3-4 మీటర్ల రోప్ ైక్లెంబింగ్ చేయాలి.
-20 ఫుష్ అప్లు, 8 చిన్ అప్లు చేయాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/- జనరల్/ఓబీసీ (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు)
-జీతభత్యాలు: రూ. 56,100/- శిక్షణ సమయంలో స్టయిఫండ్ చెల్లిస్తారు.
-పదోన్నతులు: ఆర్మీ/నేవీ/ఎయిర్‌ఫోర్స్‌ల్లో లెఫ్టినెంట్/సబ్ లెఫ్టినెంట్/ఫ్లయింగ్ ఆఫీసర్ నుంచి జనరల్/అడ్మిరల్/ఎయిర్ చీఫ్ మార్షల్ హోదా వరకు వెళ్లవచ్చు.
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, వైజాగ్, బెంగళూరుతోపాటు దేశవ్యాప్తంగా 41 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
-ఎంపిక: రాత పరీక్ష, సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూ ద్వారా.
-రాత పరీక్ష విధానం: రాతపరీక్ష మొత్తం 900 మార్కులకు ఉంటుంది. ఈ రాతపరీక్షలో రెండు విభాగాలు (పేపర్ 1, పేపర్ 2) ఉంటాయి. ప్రతి పేపర్‌కు 150 నిమిషాలు కేటాయించారు.
మ్యాథమెటిక్స్ (పేపర్ 1)-300 మార్కులు, జనరల్ ఎబిలిటీ టెస్ట్ (పేపర్ 2)- 600 మార్కులు.
-ఎస్ఎస్బీ టెస్ట్/ఇంటర్వ్యూకు 900 మార్కులు
-మొత్తం (రాతపరీక్ష+ఎస్ఎస్బీ టెస్ట్/ఇంటర్వ్యూ)-1800 మార్కులకుగాను అత్యధిక ప్రతిభ చూపిన అభ్యర్థులను ఎంపిక చేసి ట్రెయినింగ్ ఇస్తారు.
-పేపర్1 (మ్యాథ్స్)లో ఆల్జీబ్రా, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మెనెంట్స్, త్రికోణమితి, అనలిటికల్ జామెట్రీ (2 లేదా 3 డైమెన్షన్స్), డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ & డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్ & ప్రాబబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
-పేపర్-2 (జనరల్ ఎబిలిటీ టెస్ట్)లో పార్ట్-ఏలో ఇంగ్లిష్, పార్ట్-బీలో జనరల్ నాలెడ్జ్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, హిస్టరీ, ఫ్రీడమ్ మూవ్మెంట్, జాగ్రఫీ, కరెంట్ ఈవెంట్స్) నుంచి ప్రశ్నలు ఇస్తారు.
-రాతపరీక్షలో నెగెటివ్ మార్కిగ్ విధానం ఉంది.
-ఈ పరీక్షలో మెరిట్ పొందినవారికి (ఎన్డీఏకు 144వ కోర్సు, నేవల్ అకాడమీకి 106వ కోర్సు) 2020 జూలై 2 నుంచి శిక్షణ ప్రారంభిస్తారు.
-దరఖాస్తు: ఆన్లైన్లో
-రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: సెప్టెంబర్ 3 (సాయంత్రం 6 గంటల వరకు)
-రాతపరీక్ష: నవంబర్ 17
-ఫలితాలు విడుదల: డిసెంబర్లో
-వెబ్ సైట్: www.upsc.gov.in
-నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎంపికైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలకు చెందిన అభ్యర్థులకు మూడేండ్లపాటు అకాడమిక్, ఫిజికల్ ట్రెయినింగ్ ఉంటుంది. మొదటి రెండేన్నర ఏండ్లపాటు మూడు విబాగావారికి ఒకే విధమైన శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత మూడు సేవలకు ఎంపికైన అభ్యర్థులకు జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి కింది డిగ్రీ సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు.
-ఆర్మీ క్యాడెట్స్ - బీఎస్సీ/బీఎస్సీ/బీఏ (కంప్యూటర్)
-నేవల్ క్యాడెట్స్- బీటెక్
-ఎయిర్‌ఫోర్స్ క్యాడెట్స్- బీటెక్
-ఎజిమలలోని నేవల్ అకాడమీకి ఎంపికైనవారికి నాలుగేండ్లపాటు అకడమిక్, ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. శిక్షణ అనంతరం వీరికి బీటెక్ సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు.
-ఎన్డీఏలో విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత ఆర్మీ అభ్యర్థులకు డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ, నేవల్ అభ్యర్థులకు ఇండియన్ నేవల్ అకాడమీ (ఎజిమల)కి, ఎయిర్‌ఫోర్స్ అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకామీకి పంపిస్తారు. వీరికి ఆయా విభాగాల్లో ఏడాదిపాటు శిక్షణ ఇచ్చి అనంతరం లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం ఇస్తారు
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కరీంనగర్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ,
భారత సైన్యంలో సోల్జర్తోపాటు పలు రకాల ఉద్యోగాల భర్తీకి కరీంనగర్లో నిర్వహించే ఆర్మీ ర్యాలీకి నోటిఫికేషన్‌ను సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ విడుదల చేసింది.
flag
పోస్టులు-అర్హతలు:
-సోల్జర్ టెక్నికల్- ఎత్తు -166 సెం.మీ ఉండాలి. బరువు 50 కేజీలు. ఛాతీ 77 సెం.మీతోపాటు గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి.
-విద్యార్హతలు: కనీసం 45 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత.
-వయస్సు: 17 1/2 ఏండ్ల నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి.
-సోల్జర్ టెక్నికల్ (ఏవియేషన్/అమ్యునిషన్ ఎగ్జామినర్)- 165 సెం.మీ ఎత్తు, 50 కేజీల బరువు, 77 సెం.మీ. ఛాతీ ఉండాలి.
-విద్యార్హతలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్ కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 17 1/2 ఏండ్ల నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి.
-సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్/ ఏఎంసీ, ఆర్వీసీ- కనీసం 165 సెం.మీ ఎత్తు, 50 కేజీల బరువు, 77 సెం.మీల ఛాతీ ఉండాలి. గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి.
-విద్యార్హతలు: ఇంటర్ (బైపీసీ)లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
-వయస్సు: 17 1/2 ఏండ్ల నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి.
-సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్- కనీసం 162 సెం.మీ ఎత్తు, 50 కేజీల బరువు, 77 సెం.మీ ఛాతీతోపాటు గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచం కలిగి ఉండాలి.
-అర్హతలు: ఇంటర్ (ఆర్ట్స్/కామర్స్ లేదా సైన్స్) గ్రూప్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ప్రతి సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు. 12వ తరగతిలో ఇంగ్లిష్‌తోపాటు
మ్యాథ్స్/అకౌంట్స/బుక్ కీపింగ్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి.
-వయస్సు: 17 1/2 ఏండ్ల నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి.
-సోల్జర్ ఫార్మా (ఏఎంసీ)- కనీసం 165 సెం.మీ ఎత్తు ఉండాలి. ఛాతీ 77 సెం.మీలు, బరువు 50 కేజీలు ఉండాలి.
-విద్యార్హతలు: ఇంటర్ బైపీసీలో ఉత్తీర్ణత. డిఫార్మాలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి స్టేట్ ఫార్మసీ కౌన్సిల్/ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నమోదు చేసుకుని ఉండాలి.
-వయస్సు: 19-25 ఏండ్ల మధ్య ఉండాలి.
-సోల్జర్ ట్రేడ్స్‌మ్యాన్ (ఆల్ ఆర్మ్స్-పదోతరగతి)- కనీసం 166 సెం.మీ ఎత్తు ఉండాలి. బరువు 48 కేజీలు, కనీసం 76 సెంమీల ఛాతీతోపాటు గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి.
-అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత.
-సోల్జర్ ట్రేడ్స్‌మ్యాన్ (ఆల్ ఆర్మ్స్- ఎనిమిదో తరగతి)- కనీసం 166 సెం.మీ ఎత్తు ఉండాలి. బరువు 48 కేజీలు, కనీసం 76 సెంమీల ఛాతీతోపాటు గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ
వ్యాకోచించాలి.
-అర్హతలు : ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత.
-పై రెండు పోస్టులకు వయస్సు: 17 1/2 ఏండ్ల నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:
-ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ):
-ఐదునిమిషాల 30/45 సెకన్లలో 1.6 కి.మీ దూరాన్ని పరుగెత్తాలి.
-పుల్ అప్స్, 9 అడుగుల డిచ్, జిగ్‌జాగ్ బ్యాలెన్స్‌లలో అర్హత సాధించాలి.
-అనంతరం శారీరక ప్రమాణాలను పరీక్షిస్తారు. తర్వాత మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించినవారికి కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు. ఈ విషయాన్ని ర్యాలీ నిర్వహించిన
ప్రదేశంలోనే తెలియజేస్తారు. పరీక్ష నిర్వహించే ప్రదేశం, సమయం వివరాలను అడ్మిట్‌కార్డులో పొందుపరుస్తారు. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ఫలితాలను ఆర్మీ వెబ్సైట్లో
ప్రకటిస్తారు.
నోట్: క్రీడల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ తదితర సర్టిఫికెట్లు కలిగినవారికి అర్హతలు, ఎత్తు తదితర అంశాల్లో సడలింపు ఉంటుంది.
-ఈ ర్యాలీకి రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరుకావచ్చు.
-దరఖాస్తు: ఆన్లైన్లో ఆగస్టు 23 నుంచి ప్రారంభం
-చివరితేదీ: సెప్టెంబర్ 23
-వెబ్సైట్: www.joinindianarmy.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎస్ఎస్సీ 1350 సెలక్షన్ కొలువులు,
-పోస్టు: సెలక్షన్ (ఫేజ్ 7/2019)
-మొత్తం ఖాళీలు: 1350
పోస్టులవారీగా ఖాళీలు
-సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-2
-అర్హత: డిగ్రీ లేదా ఆపై అర్హత కలిగినవారు.
-సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్-9
-అర్హత: హయ్యర్‌సెకండరీ ఉత్తీర్ణత.
-సైంటిఫిక్ అసిస్టెంట్ (జెనెటిక్స్)-36
-అర్హత: డిగ్రీ లేదా ఆపై చదివినవారు.
-జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్)-1
-అర్హత: డిగ్రీ లేదా ఆపై చదివినవారు.
-స్టాఫ్ కార్ డ్రైవర్-2
-అర్హత: మెట్రిక్యులేషన్‌తోపాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
-సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ)-20
-అర్హతలు: డిగ్రీ లేదా ఆపై చదివినవారు. నోట్: పై పోస్టులకు 18-30 ఏండ్లు.
-బ్లాక్‌స్మిత్- 7
-అర్హతలు: మెట్రిక్యులేషన్.
-ఎంటీఎస్ - 47
-అర్హతలు: మెట్రిక్యులేషన్. 18-27 ఏండ్ల మధ్య ఉండాలి.
-ప్రూఫ్ రీడర్-1
-అర్హత: డిగ్రీ లేదా ఆపై ఉన్నత చదువు కలిగి 18-25 ఏండ్ల మధ్య ఉన్నవారు.
-ల్యాబొరేటరీ అటెండెంట్-2
-అర్హత: మెట్రిక్యులేషన్/పదోతరగతి ఉత్తీర్ణత.
-టెక్స్టైల్ డిజైనర్-1
-అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత.
-జూనియర్ టెక్నికల్ అటెండెంట్-3
-అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత.
-జనరేటర్ ఆపరేటర్-1
-అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత.
-రిసెర్చ్ అసిస్టెంట్-2
-అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత.
-గర్ల్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్-11
-అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత.
-వీటితోపాటు జూనియర్ జాగ్రఫికల్ అసిస్టెంట్-1, జూనియర్ ఇంజినీర్-6, జూనియర్ జులాజికల్ అసిస్టెంట్-1, ల్యాబొరేటరీ అసిస్టెంట్-6, ప్రైమరీ టీచర్-2, ల్యాబొరేటరీ టెక్నీషియన్-2, లైబ్రేరీ
ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్-1, సీనియర్ రిసర్చ్ అసిస్టెంట్-1, ఇన్స్పెక్టర్ (నాన్ టెక్నికల్)-1, జూనియర్సైంటిఫిక్ అసిస్టెంట్-5, సీనియర్ ఇన్స్ట్రక్టర్-2, ప్రిజర్వేషన్ అసిస్టెంట్-6, గార్డెన్ ఓవర్సీర్-7,
సీనియర్ ప్రిజర్వేషన్ అసిస్టెంట్-24, ఫీల్డ్ అటెండెంట్-18, ఆఫీస్ అటెండెంట్-13, రిసెర్చ్ అసిస్టెంట్-1, అకౌంటెంట్-1, టెక్నికల్ ఆపరేటర్-7, మెకానిక్-28, సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్-9,
డాటా ఎంట్రీ ఆపరేటర్-2, జూనియర్ ఇంజినీర్-2, మెడికల్ అటెండెంట్-12 తదితర పోస్టులు ఉన్నాయి.
-ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా. ఈ పరీక్షను పదోతరగతి, ఇంటర్, డిగ్రీ స్థాయి అర్హతలను బట్టి మూడు రకాలుగా నిర్వహిస్తారు. పరీక్షలో కింది అంశాలు ఉంటాయి.
-జనరల్ ఇంటెలిజెన్స్-25 ప్రశ్నలు-50 మార్కులు
-జనరల్ అవేర్నెస్-25 ప్రశ్నలు- 50 మార్కులు
-క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్)- 25 ప్రశ్నలు- 50 మార్కులు
-ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్)-25 ప్రశ్నలు- 50 మార్కులు.
-పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.50 మార్కులు కోతవిధిస్తారు.
-అవసరమైన పోస్టులకు స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్/డాటా ఎంట్రీ/కంప్యూటర్ ప్రొఫిషియన్సీ వంటివి నిర్వహిస్తారు. ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే.
-దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: ఆగస్టు 31
-ఫీజు చెల్లించడానికి (ఆన్లైన్ విధానంలో): సెప్టెంబర్ 2
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా
-వెబ్సైట్: https://ssc.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మజ్గావ్ డాక్లో నాన్ ఎగ్జిక్యూటివ్‌లు,
భారత ప్రభుత్వ సంస్థ మజ్‌గావ్‌డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
Mazagon
-పోస్టు: నాన్ ఎగ్జిక్యూటివ్
-మొత్తం ఖాళీలు: 1980
-ట్రేడులవారీగా ఖాళీలు: ఏసీ రిఫ్రిజిరేటర్ మెకానిక్-21, కంప్రెసర్ అటెండెంట్-17, బ్రాస్ ఫినిషర్-26, కార్పెంటర్-78, చిప్పర్ గ్రైండర్-19, కాంపోజిట్ వెల్డర్-175, డీజిల్ క్రేన్ ఆపరేటర్-12,
డీజిల్ కమ్ మోటార్ మెకానిక్-10, జూనియర్ డ్రాఫ్ట్స్‌మెన్-31, ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్-12, ఎలక్ట్రానిక్ మెకానిక్-98, ఫిట్టర్-254, జూనియర్ ప్లాంట్ ఎస్టిమేటర్-33, గ్యాస్ కట్టర్-100,
మెషినిస్ట్-20, మిల్ రైట్ మెకానిక్-40, పెయింటర్-58, పైప్ ఫిట్టర్-231, స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్-374, స్టోర్ కీపర్-40, యుటిలిటీ హ్యాండ్-53, యుటిలిటీ హ్యాండ్ సెమీస్కిల్డ్-145, ఫైర్
ఫైటర్-33, లాంచ్ డెక్ క్య్రూ-34 తదితర ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: పదోతరగతి/ఇంటర్/డిగ్రీతోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణత. వేర్వేరు పోస్టుల అర్హతలు వేర్వేరుగా ఉన్నాయి. వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
-పేస్కేల్: స్కిల్డ్ పోస్టులకు రూ.22,000-83180/-, అన్‌స్కిల్డ్ పోస్టులకు రూ. 16,000-60,520/-
-వయస్సు: 2019, ఆగస్టు 1 నాటికి 18-38 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
నోట్: ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన రెండేండ్ల కాలపరిమితికి భర్తీ చేయనున్నారు.
-ఎంపిక: రాతపరీక్ష, అనుభవం, ట్రేడ్ టెస్ట్ ద్వారా చేస్తారు.
-రాతపరీక్షకు 30 శాతం, అనుభవానికి 20 శాతం, ట్రేడ్ టెస్ట్‌కు 50 శాతం వెయిటేజీగా నిర్ణయించారు.
-దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: సెప్టెంబర్ 5
-వెబ్సైట్: https://mazagondock.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కోస్ట్‌గార్డ్‌లో నావిక్ పోస్టులు,
ఇండియన్ కోస్ట్‌గార్డ్.. ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ యూనియన్‌లో ఖాళీగా ఉన్న నావిక్ (జనరల్ డ్యూటీ) 10+2 ఎంట్రీ (01/2020 బ్యాచ్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
guard-navik
-పోస్టు: నావిక్ (జనరల్ డ్యూటీ)10+2 ఎంట్రీ
-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ (మ్యాథ్స్, ఫిజిక్స్) లేదా 10+2 లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-వయస్సు: 18 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి. 1998, ఫిబ్రవరి 1 నుంచి 2002, జనవరి 31 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వరకు వయోపరిమితిలో
సడలింపు ఉంటుంది.
శారీరక ప్రమాణాలు:
-ఎత్తు - 157 సెం.మీ.
-ఛాతీ - శరీరానికి తగ్గ అనుపాతంలో ఉండాలి. గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచం తప్పనిసరి.
-బరువు - ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను ప్రతి జోన్ పరిధిలోని సెంటర్ ప్రకారం షార్ట్‌లిస్ట్ చేసి రాతపరీక్ష నిర్వహిస్తారు.
-రాతపరీక్షలో క్వాలిఫయింగ్ మార్కులు ఒక్కొక్క జోన్సెంటర్ బట్టి ఎక్కువ/తక్కువగా ఉంటాయి.
-రాతపరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీని లో మ్యాథ్స్, ఫిజిక్స్, బేసిక్ కెమిస్ట్రీ, ఇంగ్లిష్ నాలెడ్జ్ (ఇంటర్ స్థాయిలో) జనరల్నాలెడ్జ్, కరెంట్అఫైర్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ తదితర
అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
-రాతపరీక్షలో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ప్రిలిమినరీ మెడికల్ ఎగ్జామినేషన్లను నిర్వహిస్తారు.
-ఈ పరీక్షల నిర్వహణకు 2 నుంచి 3 రోజులు పడుతుంది.
-అన్ని పరీక్షలు పూర్తిచేసిన మెరిట్ అభ్యర్థుల వివరాలను జోన్‌పరిధిలోని ఖాళీల సంఖ్య ఆధారంగా ఇండియన్ కోస్ట్‌గార్డ్ వెబ్సైట్లో ప్రకటిస్తారు.
-శిక్షణ: ఐఎన్ఎస్ చిల్కాలో కేటాయించిన ట్రేడ్‌కు సంబంధించి సమద్రంలో ప్రొఫెషనల్ ట్రెయినింగ్ ఇస్తారు.
ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్‌లో..
-7 నిమిషాల్లో 1.6 కి.మీ. దూరాన్ని పూర్తిచేయాలి
-20 ఉతక్ బైటక్‌లు చేయాలి
-10 ఫుష్ అప్లుపై అన్ని పరీక్షల్లో క్వాలిఫై అయినవారికి వైద్యపరీక్షలను నిర్వహించి జూలైలో ఫలితాలను వెల్లడిస్తారు.
-జీతభత్యాలు: 7వ వేతన సంఘం సిఫార్సులను అనుసరించి నెలకు జీతం రూ. 21,700/- వీటికి తోడు డీఏ, కిట్ మెయింటెనెన్స్, ఇతర అలవెన్సులు ఇస్తారు.
-పదోన్నతులు: నావిక్ నుంచి ప్రధాన అధికారి హోదా వరకు వెళ్లవచ్చు. ప్రధాన అధికారి పేస్కేల్ 7వ వేతన సంఘం సిఫార్సు అనుసరించి 47,600/- జీతం ఉంటుంది.
-పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా వివిధ జోన్లలోని మొత్తం 19 ఎగ్జామినేషన్ సెంటర్లలో పరీక్షనిర్వహిస్తారు.
-తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంత అభ్యర్థులు ఈస్ట్‌జోన్ పరిధిలోకి వస్తారు.
-ఈస్ట్‌జోన్ పరిధిలోని పరీక్ష కేంద్రాలు - సికింద్రాబాద్, మండపం, చెన్నై, విశాఖపట్నం ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: సెప్టెంబర్ 1(సాయంత్రం 5 గంటలవరకు)
-వెబ్సైట్: www.joinindiancoastguard.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీసీఆర్‌హెచ్‌లో ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ హోమియోపతి (సీసీఆర్‌హెచ్)లో ఖాళీగా ఉన్న యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది
LPSC
-పోస్టు పేరు: యోగా ఇన్స్ట్రక్టర్
-మొత్తం ఖాళీలు- 5 (జనరల్-3, ఓబీసీ-1, ఎస్సీ-1)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి యోగాలో బ్యాచిలర్ డిగ్రీ/ఎంఏ లేదా ఎమ్మెస్సీ (యోగా) ఉత్తీర్ణత. హాస్పిటల్ /నర్సింగ్ హోంలో పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు యోగాలో డిప్లొమా కోర్సు సర్టిఫికెట్, సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ.27,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 22
-వెబ్సైట్: www.ccrhindia.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్ఎంఆర్సీలో ఎంపీహెచ్ ప్రవేశాలు.
భువనేశ్వర్‌లోని ఐసీఎంఆర్- రీజినల్ మెడికల్ రిసెర్చ్ సెంటర్ (ఆర్ఎంఆర్సీ) 2019-20 విద్యా సంవత్సరానికి ఎంపీహెచ్ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
iit-khargpur
-కోర్సు పేరు: మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్)
-కోర్సు వ్యవధి: రెండేండ్లు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ (మెడిసిన్, ఆయుష్, డెంటల్, ఐల్లెడ్ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్, వెటర్నరీ సైన్సెస్, నర్సింగ్, ఎపిడిమాలజీ, ఆక్యుపేషనల్ థెరఫీ, ఫిజియోథెరపీ, లైఫ్ సైన్సెస్, పాపులేషన్ సైన్స్/స్టడీస్, స్టాటిస్టిక్స్, బయోస్టాటిస్టిక్స్, డెమోగ్రఫీ, సోషల్ సైన్సెస్, సోషల్ వర్క్, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్, ఫిజీషియన్ అసిస్టెంట్, న్యూట్రిషన్, హోంసైన్స్, కమ్యూనిటీ సైన్సెస్, సైకాలజీ, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-అప్లికేషన్ ఫీజు: రూ.600/-
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్లైన్లో
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 10
-వెబ్సైట్: www.rmrcbbsr.gov.in