Friday, 9 August 2019

ఎన్‌ఎల్‌సీలో 875 జాబ్స్, డీఆర్‌డీవోలో 290 సైంటిస్టులు జాబ్స్, బీవోఎంలో ఆఫీసర్లు జాబ్స్, ఎన్‌ఎఫ్‌సీఎల్‌లో అసిస్టెంట్లు జాబ్స్, ఎయిర్‌ఇండియాలోజాబ్స్.

ఎన్‌ఎల్‌సీలో 875 జాబ్స్,

తమిళనాడులోని ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌ వివిధ ట్రేడ్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
nlc
-మొత్తం అప్రెంటిస్‌షిప్‌ల సంఖ్య: 875
విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్‌-120, టర్నర్‌-50, మెకానిక్‌ (మోటార్‌ వెహికిల్‌)-130, ఎలక్ట్రీషియన్‌-130, వైర్‌మ్యాన్‌-120, మెకానిక్‌ డీజిల్‌-15, మెకానిక్‌ ట్రాక్టర్‌-15, కార్పెంటర్‌-5, ప్లంబర్‌-10, స్టెనోగ్రాఫర్‌-20, వెల్డర్‌-100, ప్రోగ్రామింగ్‌ అండ్‌ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌ (పాసా)-40, అకౌంటెంట్‌-40, డాటా ఎంట్రీ ఆపరేటర్‌-40, అసిస్టెంట్‌ (హెచ్‌ఆర్‌)-40
-అర్హతలు: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. అకౌంటెంట్‌/డాటా ఎంట్రీ ఆపరేటర్‌, అసిస్టెంట్‌లకు బీకాం, బీఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌), బీబీఏలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 అక్టోబర్‌ 1 నాటికి 14 ఏండ్లు నిండి ఉండాలి. 
-స్టయిఫండ్‌: నెలకు రూ. 10,019/- 
-ఎంపిక: అకడమిక్‌ మార్కులు+ఇంటర్వ్యూ 
-దరఖాస్తు : ఆన్‌లైన్‌లో ఆగస్టు 12 నుంచి
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 21

-వెబ్‌సైట్‌: www.nlcindia.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్‌డీవోలో 290 సైంటిస్టులు జాబ్స్,

న్యూఢిల్లీలోని డీఆర్‌డీవో పర్సనల్‌ డిపార్ట్‌మెంటైన రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌ (ఆర్‌ఏసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
drdo
-మొత్తం ఖాళీలు: 290
పోస్టులు-ఖాళీల వివరాలు: 
-సైంటిస్ట్‌ బీ (డీఆర్‌డీవో)-270 ఖాళీలు (జనరల్‌-99, ఈడబ్ల్యూఎస్‌-23, ఓబీసీ-80, ఎస్సీ-44, ఎస్టీ-24)
-సైంటిస్ట్‌ బీ (డీఎస్‌టీ)-6 ఖాళీలు (జనరల్‌-4, ఓబీసీ-2)
-సైంటిస్ట్‌/ఇంజినీర్‌ బీ (ఏడీఏ బెంగళూరు)-10 ఖాళీలు (జనరల్‌-4, ఈడబ్ల్యూఎస్‌-1, ఓబీసీ-2, ఎస్సీ-2, ఎస్టీ-1)
-ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ GAETEC (హైదరాబాద్‌)-4 ఖాళీలు (జనరల్‌-1, ఈడబ్ల్యూఎస్‌-1, ఓబీసీ-2)
-విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, కెమికల్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, ఎలక్ట్రికల్‌, ఏరోనాటికల్‌, మ్యాథమెటిక్స్‌, మెటలర్జీ, మెటీరియల్స్‌ సైన్స్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, జియాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఫుడ్‌ సైన్స్‌, టెక్స్‌టైల్‌, ప్రొడక్షన్‌ /ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత ఇంజినీరింగ్‌ బ్రాంచీలో బీఈ/బీటెక్‌ లేదా మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత బ్రాంచీ/విభాగంలో వినియోగంలో ఉన్న గేట్‌ (2017/2018/2019) స్కోరు కలిగి ఉండాలి. 
-వయస్సు: ఆగస్టు 30 నాటికి డీఆర్‌డీవో/ GAETEC లకు 28 ఏండ్లు, ఏడీఏలకు 30 ఏండ్లు, డీఎస్‌టీలకు 35 ఏండ్లకు మించరాదు. 
-పేస్కేల్‌: సైంటిస్ట్‌ రూ. 56,100/- (7వ వేతన పేస్కేల్‌ అనుసరించి), హెచ్‌ఆర్‌ఏ+ ఇతర అలవెన్సులతో జీతం నెలకు రూ. 80,000/- చెల్లిస్తారు. 
-అప్లికేషన్‌ ఫీజు: రూ. 100/- ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
-ఎంపిక: గేట్‌ స్కోర్‌కు 80 శాతం, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ఫైనల్‌ సెలక్షన్‌ చేస్తారు.
-ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాలకు గేట్‌ స్కోర్‌, డిస్క్రిప్టివ్‌ ఎగ్జామ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా మిగతా విభాగాలకు గేట్‌ స్కోర్‌, పర్సనల్‌ ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం: ఆగస్టు 10 నుంచి 
-చివరితేదీ: ఆగస్టు 30
-వెబ్‌సైట్‌: https://rac.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీవోఎంలో ఆఫీసర్లు జాబ్స్,

జాతీయ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీవోఎం) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
bom
-మొత్తం పోస్టులు: 46
-విభాగాలవారీగా.. లా ఆఫీసర్‌-25, సెక్యూరిటీ ఆఫీసర్‌-12, ఫైర్‌ ఆఫీసర్‌-1, మేనేజర్‌ కాస్టింగ్‌-1, ఎకనమిస్ట్‌-1, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (ఐఎస్‌) ఆడిటర్స్‌-5 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ (లా), సంబంధిత బ్రాంచీలో డిగ్రీ, ఐసీడబ్ల్యూఏ/ఎంఏ ఎకానమి, ఎంపీఏ, ఎంసీఎస్‌, ఎమ్మెస్సీ (ఎలక్ట్రానిక్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌), బీఈ (ఫైర్‌) ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. పీహెచ్‌డీ (ఎకనామిక్స్‌) ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు
-వయస్సు: 25-35 ఏండ్ల మధ్య ఉండాలి. 
-పేస్కేల్‌: రూ. 31,705-45,950/-
-ఎంపిక: పర్సనల్‌ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
-చివరితేదీ: ఆగస్టు 19
-వెబ్‌సైట్‌: www.bankofmaharashtra.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఎఫ్‌సీఎల్‌లో అసిస్టెంట్లు జాబ్స్,
జైతాపూర్‌ న్యూక్లియర్‌ పవర్‌ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ఎన్‌ఎఫ్‌సీఎల్‌ ప్రకటన విడుదల చేసింది.
nfc
-మొత్తం ఖాళీలు: 18 (క్లరికల్‌ అసిస్టెంట్‌-6, ఆఫీస్‌ అసిస్టెంట్‌-12)
-అర్హత: క్లరికల్‌ అసిస్టెంట్‌కు ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ, ఆఫీస్‌ అసిస్టెంట్‌కు పదోతరగతి ఉత్తీర్ణత. 
-వయస్సు: 2019 ఆగస్టు 12 నాటికి 18 ఏండ్లు నిండి ఉండాలి. 
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 12
-వెబ్‌సైట్‌: https://npcilcareers.co.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిర్‌ఇండియాలోజాబ్స్.

ఎయిర్‌ ఇండియా లిమిటెడ్‌కి చెందిన సెంట్రల్‌ ట్రెయినింగ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (హైదరాబాద్‌) కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
-మొత్తం ఖాళీలు: 26 (జనరల్‌-13, ఈడబ్ల్యూఎస్‌-2, ఓబీసీ-7, ఎస్సీ-3, ఎస్టీ-1)
-పోస్టు పేరు: ట్రెయినీ సిమ్యులేటర్‌ ఫ్లయిట్‌మెయింటెనెన్స్‌ ఇంజినీర్‌
-అర్హత: ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, టెలికమ్యూనికేషన్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంఇజనీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 20
-వెబ్‌సైట్‌: www.airindia.in

No comments:

Post a Comment