Friday, 9 August 2019

కోస్ట్‌గార్డ్‌లో యాంత్రిక్‌ పోస్టులు, ఏఏఎస్‌ఎల్‌లో సూపర్‌వైజర్లు ఉద్యోగాలు, ఎన్‌ఐఆర్‌టీలో సైంటిస్టులు, ఎన్‌టీపీసీలో ఐటీఐ ట్రెయినీలు, ఎన్‌సీఈఆర్‌టీలో ఉద్యోగాలు.

కోస్ట్‌గార్డ్‌లో యాంత్రిక్‌ పోస్టులు,

భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ ఖాళీగా ఉన్న యాంత్రిక్‌-01/2020 బ్యాచ్‌ (డిప్లొమా హోల్డర్స్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
navik
-పోస్టు పేరు: యాంత్రిక్‌ (డిప్లొమా)
-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెకానికల్‌/ఎలక్ట్రానిక్స్‌ & టెలి కమ్యూనికేషన్‌ (రేడియో/పవర్‌), ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
గమనిక: ఇంటర్‌ స్టేట్‌ & జాతీయ స్థాయి క్రీడలలోని 1, 2 ,3వ స్థానం చాంపియన్‌షిప్‌ పొందిన ఎస్సీ/ఎస్టీలకు 5 శాతం ఉత్తీర్ణతలో సడలింపు ఉంటుంది.
-వయస్సు: 18 -22 ఏండ్ల మధ్య ఉండాలి. అనగా 1998, ఫిబ్రవరి 1 నుంచి 2002, జనవరి 31 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-జీతభత్యాలు: రూ. 29,200 + యాంత్రిక్‌ పే రూ.6,200/- వీటికి అదనంగా డీఏ, కిట్‌ మెయింటెనెన్స్‌ అలవెన్స్‌, ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.
-పదోన్నతులు: యాంత్రిక్‌ టెక్నికల్‌ నుంచి ప్రధాన్‌ సహాయక్‌ ఇంజినీర్‌ హోదా వరకు వెళ్లవచ్చు.
-శారీరక ప్రమాణాలు: ఎత్తు :157 సెం.మీ ఉండాలి. ఛాతీ గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, పీఎఫ్‌టీ ద్వారా
-రాతపరీక్ష: ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. దీనిలో సంబంధిత డిప్లొమా ఇంజినీరింగ్‌ సబ్జెక్టులైన ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ & టెలి కమ్యూనికేషన్‌ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌, రీజనింగ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌పై కూడా ప్రశ్నలు ఇస్తారు.
-రాతపరీక్షలో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ (పీఎఫ్‌టీ), ప్రిలిమినరీ మెడికల్‌ ఎగ్జామినేషన్‌లను నిర్వహిస్తారు.
-ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌: 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల్లో, 10 ఫుష్‌ అప్‌లు, 20 ఉతక్‌ బైటక్‌లు చేయాలి.
-పరీక్ష కేంద్రాలు: ముంబై, కోల్‌కతా, చెన్నై.
-శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో 2020 ఫిబ్రవరి నుంచి ట్రెయినింగ్‌ ప్రారంభమవుతుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఆగస్టు 11 నుంచి ప్రారంభం
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 17
-వెబ్‌సైట్‌: www.joinindiancoastguard.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఏఎస్‌ఎల్‌లో సూపర్‌వైజర్లు ఉద్యోగాలు,
ఎయిర్‌ ఇండియా పరిధిలో పని చేస్తున్న ఎయిర్‌లైన్‌ ఐల్లెడ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఏఎస్‌ఎల్‌) ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి అర్హులైన 
అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
AASL
-పోస్టు పేరు: సూపర్‌వైజర్‌
-మొత్తం పోస్టులు: 52 (సూపర్‌వైజర్‌ (క్యాటరింగ్‌)-3, సీనియర్‌ సూపర్‌వైజర్‌-49)
-అర్హత: ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. సూపర్‌వైజర్‌ పోస్టులకు ఇంటర్‌తోపాటు డిప్లొమా (హోటల్‌ మేనేజ్‌మెంట్‌) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. 
-వయస్సు: సీనియర్‌ సూపర్‌వైజర్‌కు 40 ఏండ్లు, సూపర్‌వైజర్‌కు 35 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్‌ ఫీజు: రూ. 1000/-ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు ఎలాంటీ ఫీజు లేదు.
-ఎంపిక: టెక్నికల్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 9
-వెబ్‌సైట్‌: http://www.airindia.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఆర్‌టీలో సైంటిస్టులు,

చెన్నైలోని ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ (ఎన్‌ఐఆర్‌టీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-మొత్తం పోస్టులు: 14
విభాగాలవారీగా ఖాళీలు: సైంటిస్ట్‌ సీ (మెడికల్‌)
-7, సైంటిస్ట్‌ సీ (కన్సల్టెంట్‌)-7
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌ లేదా పీజీ/ఎండీ లేదా సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
-వయస్సు, ఎంపిక వివరాల కోసం ఎన్‌ఐఆర్‌టీ వెబ్‌సైట్‌ చూడవచ్చు.
-చివరితేదీ: ఆగస్టు 6
-వెబ్‌సైట్‌: www.nirt.res.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌టీపీసీలో ఐటీఐ ట్రెయినీలు,
చత్తీస్‌గఢ్‌ (రాయ్‌పూర్‌)లోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) ఖాళీగా ఉన్న ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన ఐటీఐ ట్రేడ్‌, బీఎస్సీ (కెమిస్ట్రీ) అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NTPC
-మొత్తం ఖాళీలు: 79
-ఐటీఐ ట్రెయినీ (ఫిట్టర్‌)-30 , ఐటీఐ ట్రెయినీ (ఎలక్ట్రీషియన్‌)-16, ఐటీఐ ట్రెయినీ (ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌)-12, అసిస్టెంట్‌ (జనరల్‌) ట్రెయినీ-5,
-ల్యాబ్‌ అసిస్టెంట్‌ (కెమిస్ట్రీ) ట్రెయినీ-6, డిప్లొమా ట్రెయినీ (ఎలక్ట్రికల్‌)-5, డిప్లొమా ట్రెయినీ ( మెకానికల్‌)-5,
-అర్హతలు: ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ బోర్డుచే గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ఐటీఐ (ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌) ట్రేడ్‌లో ఉత్తీర్ణత. 
-అసిస్టెంట్‌ (జనరల్‌)కు ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు ఇంగ్లిష్‌ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగం ఉండాలి. డిప్లొమా ట్రెయినీలకు సంబంధిత బ్రాంచీలో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత. 
-ఐటీఐ ట్రెయనీలకు రూ. 21,500/-, డిప్లొమా ట్రెయినీలకు రూ. 24,000/-
-ఎంపిక: ఆబ్జెక్టివ్‌ రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 31
-వెబ్‌సైట్‌: www.ntpccareers.net

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీఈఆర్‌టీలో ఉద్యోగాలు.

న్యూఢిల్లీలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైయినింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-మొత్తం పోస్టులు: 19
-విభాగాల వారీగా ఖాళీలు: సీనియర్‌ కన్సల్టెంట్‌-2, కన్సల్టెంట్‌-2, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో-10, అసిస్టెంట్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌/అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్‌-2, ఆఫీస్‌ మేనేజర్‌/ఏవో-2, గ్రాఫిక్‌ డిజైనర్‌-1
-అర్హత: ఎంఏ (ఎడ్యుకేషన్‌), ఎంఈడీ, సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ, ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ, బీకాం/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో నెట్‌/స్లెట్‌ లేదా సెట్‌లో ఉత్తీర్ణత 
-దరఖాస్తు: ఈ మెయిల్‌ (ppmedncert@gmail.com) ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 20, 21,22, 26.27
-వెబ్‌సైట్‌: www.ncert.nic.in

No comments:

Post a Comment