Wednesday, 18 September 2019

ఆర్మీలో ఫైర్‌మ్యాన్ పోస్టులు, ఐఐఎఫ్‌లో ఎంబీఎఫ్ ప్రవేశాలు, డీటీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్.

ఆర్మీలో ఫైర్‌మ్యాన్ పోస్టులు,

ఇండియన్ ఆర్మీలో కంపెనీ ఆర్మీ సర్వీస్ కార్ప్స్ లో ఫైర్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
armyy
-పోస్టు: ఫైర్‌మ్యాన్ (గ్రూప్ సీ)
-మొత్తం ఖాళీలు: 15
-అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
-వయస్సు: 18-25 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపికవిధానం: ఫిజికల్/ ప్రాక్టికల్/ రాతపరీక్ష ద్వారా చేస్తారు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఈ ప్రకటన ఎంప్లాయిమెంట్ న్యూస్ (14-20 సెప్టెంబర్ 2019)లో వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
-దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 45 COMPANY ARMY SERVICE CORPS (SUPPLY) TYPE B, AGRA CANTT, (UP) PI-- 282 001.

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎఫ్‌లో ఎంబీఎఫ్ ప్రవేశాలు,
న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ (ఐఐఎఫ్) ఎంబీఎఫ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

-కోర్సు: మేనేజ్‌మెంట్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్ (ఎంబీఎఫ్)
-కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు
-అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, క్యాట్/ జీమ్యాట్/ సీమ్యాట్ ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో
-వెబ్‌సైట్: http://www.iif.edu

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీటీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు,
ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (డీటీయూ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
DTU-Recruitment
-పోస్టు: అసిస్టెంట్ ప్రొఫెసర్
-మొత్తం ఖాళీలు: 167
-విభాగాలు: సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, అప్లయిడ్ ఫిజిక్స్, బయోటెక్నాలజీ మొదలైనవి ఉన్నాయి.
-అర్హత: సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత.
-వయస్సు: 35 ఏళ్లు మించరాదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 15
-వెబ్‌సైట్: www.dtu.ac.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్.

దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను 2020, మే 17న నిర్వహించనున్నారు. ఈసారి పరీక్షను ఐఐటీ-ఢిల్లీ నిర్వహించనున్నది.

-విదేశాల్లోనూ... దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థలుగా పేరుగాంచిన ఐఐటీల్లో ప్రవేశాలకు రాసేవారి సంఖ్య ఏటేటా పెరుగుతుంది. ఐఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ని వచ్చే ఏడాది నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఐఐటీ జేఈఈ (అడ్వాన్స్‌డ్) పరీక్షను యూఏఈలోని దుబాయ్, నేపాల్ రాజధాని ఖాట్మాండూ, ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా, శ్రీలంక రాజధాని కొలంబో, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, సింగపూర్‌లలో నిర్వహించారు. తొలిసారిగా వచ్చే ఏడాది అమెరికాలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

No comments:

Post a comment