Wednesday, 18 September 2019

నిమ్‌సెట్- ఎంపీటీ 2019, సీఎస్‌ఐఆర్-నెట్ (డిసెంబర్-2019), పీజీఆర్‌ఆర్‌సీడీఈ పీజీ డిప్లొమా కోర్సులు, బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.

నిమ్‌సెట్- ఎంపీటీ 2019,

హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఎంపీటీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
nims
-కోర్సు: నిమ్‌సెట్- మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ (ఎంపీటీ)-2019
-మొత్తం సీట్ల సంఖ్య: 15
-విభాగాల వారీగా... ఎంపీటీ-మస్క్యులోస్కెలిటల్ సైన్సెస్-5, ఎంపీటీ-కార్డియోవాస్క్యులర్ & పల్మనరీ సైన్సెస్-5, ఎంపీటీ-న్యూరో సైన్సెస్-5 సీట్లు ఉన్నాయి.
-కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు
-అర్హత: డిగ్రీ (ఫిజియోథెరపీ) ఉత్తీర్ణతతోపాటు ఆరునెలలు ఇంటర్న్‌షిప్ చేసి ఉండాలి.
-వయస్సు: 2019, డిసెంబర్ 31 నాటికి 22-35 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
-పరీక్షతేదీ: అక్టోబర్ 14
-దరఖాస్తు: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో
-ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 19
-హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: సెప్టెంబర్ 21
-తరగతులు ప్రారంభం: నవంబర్ 1
-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: www.nims.edu.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎస్‌ఐఆర్-నెట్ (డిసెంబర్-2019),

సైన్స్ సబ్జెక్టుల్లో జేఆర్‌ఎఫ్, లెక్చర్‌షిప్/అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం నిర్వహించే సీఎస్‌ఐఆర్-యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది.
csir-net
-నెట్: సీఎస్‌ఐఆర్-యూజీసీలు జేఆర్‌ఎఫ్, లెక్చరర్‌షిప్/అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్ కోసం ఏటా రెండుసార్లు జాతీయస్థాయిలో పరీక్షను నిర్వహిస్తారు. అయితే కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహించే బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కు అప్పగించింది.
-జేఆర్‌ఎఫ్: ప్రతి ఏటా ఎక్కువ సంఖ్యలో జేఆర్‌ఎఫ్‌లను సీఎస్‌ఐఆర్ అందిస్తుంది. బీఎస్ (నాలుగేండ్లు), బీఈ/బీటెక్, బీఫార్మ, ఎంబీబీఎస్, ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్, ఎమ్మెస్సీ లేదా తత్సమాన కోర్సు లేదా బీఎస్సీ (ఆనర్స్)లో లేదా ఎంఎస్-పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్ అయిన అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు పైన పేర్కొన్న ప్రోగ్రామ్‌ల్లో దేనిలోనైనా కనీసం 55 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలు అయితే 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
-ఈ పరీక్షను ప్రతి ఏటా జూన్, డిసెంబర్‌లలో నిర్వహిస్తారు.
-జేఆర్‌ఎఫ్ అర్హత సాధించినవారు లెక్చరర్‌షిప్‌కు కూడా అర్హులే.
-వయస్సు: జేఆర్‌ఎఫ్‌కు గరిష్ఠ వయోపరిమితి 2019, జూలై 1 నాటికి 28 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళలకు ఐదేండ్లు సడలింపు ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-లెక్చరర్‌షిప్/అసిస్టెంట్ ప్రొఫెషర్‌షిప్ కోసం ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.


జేఆర్‌ఎఫ్ స్టయిఫండ్:
-జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైనవారికి మొదటి రెండేండ్లు ప్రతినెల రూ.31,000/- స్టయిఫండ్‌ను ఇస్తారు. దీనికి అదనంగా ఏడాది కంటిన్‌జెంట్ గ్రాంట్‌గా రూ. 20 వేలు ఇస్తారు.
-రెండేండ్ల అనంతరం జేఆర్‌ఎఫ్ అభ్యర్థులు పీహెచ్‌డీలో రిజిస్టర్ అయిన తర్వాత వారిని ఎస్‌ఆర్‌ఎఫ్ (నెట్) కింద పరిగణించి వారికి తర్వాతి సంవత్సరాలలో నెలకు రూ.35,000/- స్టయిఫండ్‌గా ఇస్తారు.

పరీక్ష విధానం:
-పరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు.
-ప్రతి సబ్జెక్టులో మూడు సెక్షన్లు (పార్ట్ ఏ, పార్ట్ బీ, పార్ట్ సీ) ఉంటాయి.
-మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
-ప్రశ్నల సంఖ్య, ప్రతి ప్రశ్నకు ఇచ్చే మార్కులు, నెగెటివ్ మార్కింగ్ విధానం సబ్జెక్టులను బట్టి మారుతుంది.
-పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్/సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్.

ముఖ్యతేదీలు:
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబర్ 9
-ఫీజు: జనరల్/జనరల్-ఈడబ్ల్యూఎస్- 1000/-
-ఓబీసీ-ఎన్‌సీఎల్: రూ.500/-
-ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ- రూ.250/-
-అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: 2019, నవంబర్ 9
-పరీక్ష తేదీ: 2019, డిసెంబర్ 15
-పరీక్ష కాలవ్యవధి: మూడుగంటలు
-పరీక్ష సమయం: మొదటి షిప్ట్- ఉదయం 9.30 నుంచి 12.30 వరకు,
-రెండో షిప్టు - 2.30 నుంచి 5.30 వరకు
-ఫలితాల వెల్లడి: 2019, డిసెంబర్ 31
-వెబ్‌సైట్: www.nta.ac.in, csirnet.nta.nic.in

సీఎస్‌ఐఆర్-నెట్‌లో సబ్జెక్టులు:
-కెమికల్ సైన్సెస్
-ఎర్త్ సైన్సెస్ (ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్)
-లైఫ్ సైన్సెస్
-మ్యాథమెటిక్స్ సైన్సెస్
-ఫిజికల్ సైన్సెస్


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పీజీఆర్‌ఆర్‌సీడీఈ పీజీ డిప్లొమా కోర్సులు,

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్‌ఆర్‌సీడీఈ) 2019-20 విద్యాసంవత్సరానికి పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

-కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్
-కోర్సు కాలవ్యవధి: ఏడాది
-అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగాల్లో బీఎస్సీ, బీఫార్మసీ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఈ/ బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంసీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
-ఎంపిక: అకడమిక్ ప్రతిభ ఆధారంగా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 30
-వెబ్‌సైట్: www.oucde.net

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.


బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


సీనియర్ జీఐఎస్ అనలిస్ట్
-ఖాళీలు: 20
-అర్హతలు: ఎమ్మెస్సీ (జీఐఎస్) లేదా బీఈలో సివిల్/జియో-ఇన్ఫర్మాటిక్స్‌తోపాటు సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 18- 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-జీతం: నెలకు రూ.56,800/-
జీఐఎస్ అనలిస్ట్
-ఖాళీలు: 13
-అర్హతలు: ఎమ్మెస్సీ (జిఐఎస్) లేదా బీఈ (సివిల్/జియో ఇన్ఫర్మాటిక్స్) లేదా సివిల్ ఇంజినీరింగ్‌తోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 35 ఏండ్లు మించరాదు.
-జీతం: రూ.47,000/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: సెప్టెంబర్ 18
-వెబ్‌సైట్: https://www.becil.com

No comments:

Post a comment