Friday, 13 September 2019

నాబార్డ్‌లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్లు, మేనేజ్‌లో పీజీ డిప్లొమా ప్రవేశాలు, నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటవ్ పోస్టులు.

నాబార్డ్‌లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్లు,

ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) ఖాళీగా ఉన్న డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NABARD
-పోస్టు పేరు: డెవలప్‌మెంట్ అసిస్టెంట్
-విభాగాలవారీగా.. డెవలప్‌మెంట్ అసిస్టెంట్ - 82, డెవలప్‌మెంట్ అసిస్టెంట్ (హిందీ)-9
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులకు..ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ . డెవలప్‌మెంట్ అసిస్టెంట్ (హిందీ) పోస్టులకు ..హిందీ ఆప్షనల్ సబ్జెక్టుతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-వయస్సు: 2019, సెప్టెంబర్ 1 నాటికి 18 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-పే స్కేల్: నెలకు సుమారుగా రూ. 31,000/-
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.450/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 50/-
-ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష ద్వారా
-ప్రిలిమినరీ రాతపరీక్షలో టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అంశాల నుంచి 100 మార్కులకు ఇస్తారు. 60 నిమిషాల్లో పూర్తిచేయాలి.
-మెయిన్ రాతపరీక్షలో టెస్ట్ ఆఫ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ అంశాల నుంచి 200 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 2
-వెబ్‌సైట్: www.nabard.org.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మేనేజ్‌లో పీజీ డిప్లొమా ప్రవేశాలు,
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్)లో 2020-22విద్యాసంవత్సరా నికిగాను పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
manage-hyd
-కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్)- పీజీడీఎం- ఏబీఎం.
-కాలవ్యవధి: రెండేండ్లు
-అర్హత: కనీసం 50 శాతం మార్కులతో అగ్రికల్చరల్ అండ్ అల్లయిడ్ సైన్సెస్ లేదా సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు క్యాట్-2019లో వ్యాలిడ్ స్కోర్ కలిగి ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: 2019, డిసెంబర్ 31
-వెబ్‌సైట్: www.manage.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటవ్ పోస్టులు.


నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ రామగుండం ఫర్టిలైజర్స్ & కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

-పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్/నాన్ ఎగ్జిక్యూటివ్
-మొత్తం పోస్టులు: 84 (ఎగ్జిక్యూటివ్-79, నాన్ ఎగ్జిక్యూటివ్-5)
-విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్ ల్యాబ్, సేఫ్టీ, ఐటీ, హెచ్‌ఆర్, పీఆర్, వెల్ఫేర్, ఎఫ్ అండ్ ఏ, మెటీరియల్స్, సెక్రటేరియల్, లీగల్, మెడికల్, పారామెడికల్ తదితర విభాగాలు ఉన్నాయి.
-అర్హత: సంబంధిత బ్రాంచీ/ఇంజినీరింగ్ విభాగంలో బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్, మూడేండ్ల డిప్లొమా, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీ, ఎల్‌ఎల్‌బీ, ఏదైనా డిగ్రీ, సీఏ, సీఎంఏ, సీఎస్, ఎంబీబీఎస్, జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్,లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 ఏప్రిల్ 30 నాటికి 18-30 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ట్రేడ్ టెస్ట్
-చివరితేదీ: అక్టోబర్ 6
-వెబ్‌సైట్: www.nationalfertilizers.com

No comments:

Post a Comment