Thursday, 17 October 2019

బీఆర్‌వోలో 540 ఉద్యోగాలు, ‘యూపీఎస్సీ’ 88 ఉద్యోగాలు, వరంగల్‌ నిట్‌లో ప్రవేశాలు.

బీఆర్‌వోలో 540 ఉద్యోగాలు,

బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌వో)లో ఎంఎస్‌డబ్ల్యూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.


- పోస్టు: మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌ (డ్రైవర్‌ ఇంజిన్‌ స్టాటిక్‌)
- మొత్తం ఖాళీలు: 540. వీటిలో జనరల్‌-221, ఎస్సీ-81, ఎస్టీ-40, ఓబీసీ-145, ఈడబ్ల్యూఎస్‌-53 ఉన్నాయి.
- జీతం: రూ.18,000/- (లెవల్‌-1)
- ఈ పోస్టులకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
- శారీరక ప్రమాణాలు: సదరన్‌ రీజియన్‌ అభ్యర్థులు కనీసం 157 సెం.మీ. ఎత్తుతోపాటు బరువు 50 కేజీలు ఉండాలి.
- వయస్సు: 18-25 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
- ఎంపిక విధానం: ఫిజికల్‌, ప్రాక్టికల్‌ టెస్ట్‌, రాతపరీక్ష, మెడికల్‌ టెస్టుల ద్వారా చేస్తారు.
- ఫిజికల్‌ టెస్ట్‌లో భాగంగా మైలు దూరాన్ని 10 నిమిషాల్లో పరుగెత్తాలి.
- ప్రాక్టికల్‌ టెస్ట్‌లో స్టాటిక్‌ ఇంజిన్‌ పార్ట్‌ల గురించి, ఆయిల్‌/లూబ్రికెంట్స్‌, టూల్స్‌, ఎక్విప్‌మెంట్ల గురించి ఇస్తారు. దీనికి 25 మార్కులు కేటాయిస్తారు.
- రాతపరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో (వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి)
- చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 45 రోజుల్లోగా పంపాలి. ప్రకటన అక్టోబర్‌ 11న విడుదలైంది.
- ఫీజు: జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు రూ.50. ఇతరులకు ఫీజు లేదు.
- వెబ్‌సైట్‌: www.bro.gov.in.


-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
‘యూపీఎస్సీ’ 88 ఉద్యోగాలు,

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు విభాగాల్లో 88 ఖాళీల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.


పోస్టులు-ఖాళీలు-అర్హతలు:
- బాటనిస్ట్‌-13
- అర్హతలు: పీజీ (బాటనీ/హార్టికల్చర్‌/లైఫ్‌ సైన్సెస్‌/అగ్రికల్చర్‌)తోపాటు మూడేండ్ల అనుభవం ఉండాలి.
- గ్రేడ్‌-2 లీగల్‌ ఆఫీసర్‌-6
- అర్హతలు: పీజీ (లా)లో ఇంటర్నేషనల్‌ లా స్పెషలైజేషన్‌గా కలిగి ఉండాలి.
- జాయింట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌-13
- అర్హతలు: బీటెక్‌/బీఈ
- పోస్టు: గ్రేడ్‌-3 స్పెషలిస్ట్‌.
- విభాగాల వారీగా ఖాళీలు: బయోకెమిస్ట్రీ-2, కార్డియాలజీ-1, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌-3, జనరల్‌ మెడిసిన్‌-15, జనరల్‌ సర్జరీ-9, న్యూరో సర్జరీ-5, పీడియాట్రిక్‌ సర్జరీ-1 ఉన్నాయి.
- అర్హతలు: ఎంబీబీఎస్‌/పీజీ/ఎండీ, ఎంఎస్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. అనుభవం ఉండాలి.
- వయస్సు: 30- 45 ఏండ్లు మధ్య ఉండాలి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: అక్టోబర్‌ 31
- వెబ్‌సైట్‌: http://www.upsconline.nic.in
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వరంగల్‌ నిట్‌లో ప్రవేశాలు.




వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో పీహెచ్‌డీలో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.


- ప్రోగ్రామ్‌: పీహెచ్‌డీ (డిసెంబర్‌ సెషన్‌)
- విభాగాలు: ఇంజినీరింగ్‌, సైన్సెస్‌, ఇంగ్లిష్‌, మేనేజ్‌మెంట్‌
- ఈ ప్రోగ్రామ్‌ రెండు రకాలుగా ఉంది. ఫుల్‌టైం, పార్ట్‌టైం.
- ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో అక్టోబర్‌ 16 నుంచి ప్రారంభం
- వెబ్‌సైట్‌: www.admisssions.nitw.ac.in
 

1 comment:

  1. i am looking for job Seo Executive
    I have 6 month experince.
    plz.. Let me know any recruitment of your company then you will contect me.

    ReplyDelete