Thursday, 17 October 2019

ఇస్రోలో 327 ఇంజినీర్ ఉద్యోగాలు, నిట్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు, ఐఐటీ రోపర్‌లో ప్రవేశాలు, నీట్-ఎండీఎస్ ప్రవేశాలు.

ఇస్రోలో 327 ఇంజినీర్ ఉద్యోగాలు,

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
isro-gslv-station
-పోస్టు: సైంటిస్ట్/ఇంజినీర్ ఎస్‌సీ
-మొత్తం ఖాళీల సంఖ్య: 327
-విభాగాలవారీగా ఖాళీలు: ఎలక్ట్రానిక్స్-131, మెకానికల్-135, కంప్యూటర్ సైన్స్-58, ఎలక్ట్రానిక్స్ (అటానమస్ బాడీ) -3 ఉన్నాయి. వీటిలో 31 పోస్టులు పీహెచ్‌సీ అభ్యర్థులకు కేటాయించారు.
-పేస్కేల్: లెవల్ 10 పేమ్యాట్రిక్స్ ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తారు. ప్రారంభ వేతనం రూ.56,100/- ఉంటుంది. దీనికి అదనంగా ఇతర అలవెన్సులు ఇస్తారు.
-అర్హతలు: కనీసం 65 శాతం మార్కులతో లేదా 6.84/10 సీజీపీఏతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-వయస్సు: 2019, నవంబర్ 4 నాటికి 35 ఏండ్లు మించరాదు.
-ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్నవారిని మొదట షార్ట్‌లిస్ట్ చేసి రాతపరీక్షకు ఎంపిక చేస్తారు.
-రాతపరీక్షను 2020, జనవరి 12న నిర్వహిస్తారు. రాష్ట్రంలో పరీక్ష కేంద్రం హైదరాబాద్‌లో ఉంది. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. రాతపరీక్షలో 80 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు.
-ఇంటర్వ్యూలో కనీసం 60 శాతం మార్కులు వచ్చిన వారిని పరిగణనలోకి తీసుకుని మెరిట్ ఆధారంగా తుది ఎంపికచేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 4
-ఫీజు: రూ.100/-
-వెబ్‌సైట్: www.isro.gov.in
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిట్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు,

రాయ్‌పూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) కింది టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


-మొత్తం ఖాళీలు : 63
-పోస్టులు: ప్రొఫెసర్-10, అసోసియేట్ ప్రొఫెసర్-16, అసిస్టెంట్ ప్రొఫెసర్-37 ఖాళీలు ఉన్నాయి.
-విభాగాలు: బయోమెడికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, మ్యాథ్స్, ఎంసీఏ, ఐటీ, ఫిజిక్స్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్, అప్లయిడ్ జియాలజీ, ఆర్కిటెక్చర్ తదితర డిపార్ట్‌మెంట్లలో ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, బోధనలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, ప్రజంటేషన్/ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 15
-వెబ్‌సైట్: www.nitrr.ac.in


--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ రోపర్‌లో ప్రవేశాలు,
రోపర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.


-ప్రోగ్రామ్: పీహెచ్‌డీ (జనవరి 2020)
-విభాగాలు: ఇంజినీరింగ్&సైన్సెస్, బయోమెడికల్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెటలర్జికల్&మెటీరియల్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, హ్యుమానిటీస్&సోషల్ సైన్సెస్.
-ఈ ప్రోగ్రామ్ ఫుల్‌టైం, ఎక్స్‌టర్నల్, పార్ట్‌టైం ఆఫర్ చేస్తున్నారు.
-అర్హతలు: బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్ లేదా ఎంఏ, ఎమ్మెస్సీ, బీఎస్-ఎంఎస్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: నవంబర్ 3
-వెబ్‌సైట్: www.iitrpr.ac.in

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నీట్-ఎండీఎస్ ప్రవేశాలు.

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (ఎండీఎస్)లో ప్రవేశాలకు నిర్వహించే నీట్-ఎండీఎస్ 2020 ప్రకటన విడుదల చేసింది.


-ఎంట్రెన్స్: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)- ఎండీఎస్ 2020
-అర్హతలు: బీడీఎస్ ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.3,750/-. ఇతరులకు రూ. 2750/-
-చివరితేదీ: అక్టోబర్ 31
-ప్రవేశపరీక్ష తేదీ: 2019, డిసెంబర్ 20
-వెబ్‌సైట్: www.nbe.edu.in

1 comment:

  1. i am looking for job Seo Executive
    I have 6 month experince.
    plz.. Let me know any recruitment of your company then you will contect me.

    ReplyDelete