Sunday, 17 November 2019

నేవీలో 400 సెయిలర్ పోస్టులు, బార్క్‌లో 93 సెక్యూరిటీ పోస్టులు, సీడీఎస్-2020 నోటిఫికేషన్‌, జెస్ట్-2020 నోటిఫికేషన్‌, సీఐపీ పీజీ ప్రవేశాలు, రైల్‌టెల్‌లో ఉద్యోగాలు, సెంట్రల్ యూనివర్సిటీ ఎంబీఏ కోర్సుల ప్రవేశాలు.

నేవీలో 400 సెయిలర్ పోస్టులు,

ఇండియన్ నేవీ సెయిలర్ మెట్రిక్ రిక్రూట్ అక్టోబర్-2020 నోటిఫికేషన్ విడుదలైంది.
Sailor
-సెయిలర్ ఫర్ మెట్రిక్ రిక్రూట్ (ఎంఆర్)- అక్టోబర్ 2020 బ్యాచ్
-పోస్టులు: చెఫ్, స్టీవార్డ్, హైజీనిస్ట్
-ఖాళీలు: 400 (సుమారుగా)
-అర్హతలు: మెట్రిక్యులేషన్/పదోతరగతి ఉత్తీర్ణత.
-వయస్సు: 2000, అక్టోబర్ 1 నుంచి 2003, సెప్టెంబర్ 30 మధ్య జన్మించి ఉండాలి.
-పేస్కేల్: నెలకు రూ.21,700-69,100+ గ్రేడ్ పే రూ.5,200+ డీఏ
-శిక్షణ సమయంలో నెలకు రూ.14,600/- ఇస్తారు.
-పదోన్నతులు: మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్-1 వరకు పదోన్నతి పొందవచ్చు.
-శారీరక ప్రమాణాలు: కనీసం 157 సెం.మీ ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ ఛాతీతోపాటు గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి.
-ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా


కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్:
-50 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.
-ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఇస్తారు.
-ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీల్లో ఇస్తారు.
-నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కుల కోతవిధిస్తారు.
-పరీక్ష కాలవ్యవధి 30 నిమిషాలు.
-పరీక్షలో సైన్స్, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్‌పై పదోతరగతి స్థాయిలో ప్రశ్నలు ఇస్తారు.

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ):
-పీఎఫ్‌టీలో తప్పనిసరిగా అర్హత సాధించాలి.
-7 నిమిషాల వ్యవధిలో 1.6 కి.మీ దూరాన్ని పరుగెత్తాలి. 20 ఉతక్‌బైఠక్, 10 పుష్‌అప్‌లను చేయాలి.
-సీబీటీ, పీఎఫ్‌టీలో అర్హత సాధించినవారికి మెడికల్ టెస్ట్‌లు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
-శిక్షణ: అక్టోబర్ 2020 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. 15 వారాల బేసిక్ ట్రెయినింగ్‌ను ఐఎన్‌ఎస్ చిల్కాలో ఇస్తారు. అనంతరం ప్రొఫెషనల్ ట్రెయినింగ్‌ను ఆయా ట్రేడులను బట్టి శిక్షణ ఇస్తారు.
నోట్: మొదట 15 ఏండ్ల కాలానికి ఈ పోస్టుల నియామకం చేస్తారు.

ముఖ్యతేదీలు:
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో నవంబర్ 23 నుంచి ప్రారంభం
-చివరితేదీ: నవంబర్ 28
-ఫీజు: రూ.215/-
-వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బార్క్‌లో 93 సెక్యూరిటీ పోస్టులు,

బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) సెక్యూరిటీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
BARK
-పోస్టు: అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (గ్రూప్ బీ నాన్ గెజిటెడ్)
-పేస్కేల్: నెలకు రూ.35,400+ ఇతర అలవెన్సులు (లెవల్-6)
-మొత్తం ఖాళీలు: 19 (ఎస్సీ-8, ఎస్టీ-2, ఓబీసీ-3, జనరల్-5, ఈడబ్ల్యూఎస్-1)
-వయస్సు: 18-27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 32, ఓబీసీలకు 30 ఏండ్లు వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-శారీరక ప్రమాణాలు: పురుషులు-167 సెం.మీ ఎత్తు, మహిళలు-157 సెం.మీ. ఎత్తు ఉండాలి. పురుషులకు ఛాతీ కనీసం 80 సెం.మీ, గాలిపీల్చినప్పుడు 85 సెం.మీ. ఉండాలి.
-అర్హతలు: కనీసం ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
-పోస్టు: సెక్యూరిటీ గార్డ్
-మొత్తం ఖాళీలు: 73 (ఎస్సీ-15, ఎస్టీ-6, ఓబీసీ-20, జనరల్-26, ఈడబ్ల్యూఎస్-6)
-పేస్కేల్: లెవల్-1 కింద నెలకు రూ.18,000+ ఇతర అలవెన్సులు ఇస్తారు.
-వయస్సు: 18- 27 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత.
-శారీరక ప్రమాణాలు: మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. పురుషులు కనీసం 167 సెం.మీ. ఎత్తుతోపాటు కనీసం 80 సె.మీ ఛాతీ ఉండాలి.
-ఎంపిక విధానం: ఫిజికల్ ఈవెంట్స్, రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 6
-వెబ్‌సైట్: http://www.barc.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీడీఎస్-2020 నోటిఫికేషన్‌,

డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వారికి సువర్ణావకాశం. త్రివిధ దళాలలో చేరి దేశసేవ చేయాలనుకునేవారికి అద్భుత అవకాశం. మంచి జీతభత్యాలు, భద్రమైన కొలువు మీ సొంతం కావాలంటే ఈ పరీక్షలో విజయం సాధిస్తే చాలు. పై అన్నింటికి సమాధానం సీడీఎస్. ఏటేటా విడుదలయ్యే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ . సీడీఎస్ -2020 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పరీక్ష విధానం, ప్రిపరేషన్ నిపుణ పాఠకుల కోసం...
IAS-Academ
-సీడీఎస్: ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ (త్రివిధ దళాలు)లలో లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగ అవకాశాన్ని కల్పించడానికి నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్) పరీక్ష ఇది. ఏటా దీన్ని రెండుసార్లు నిర్వహిస్తారు. 2020 సంవత్సరానికి 418 ఖాళీలతో తొలి నోటిఫికేషన్ విడుదలైంది.
-పేస్కేల్: లెఫ్టినెంట్ లెవల్-10 కింద రూ.56,100-1,77,500/- జీతం ఇస్తారు. వీటితోపాటు ఇతర అలవెన్సులు ఇస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ.56,100/- ఇస్తారు.
ఎవరు ఈ పరీక్ష రాయవచ్చు?
-ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ), ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ (ఓటీఏ) పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉండాలి. నేవల్ అకాడమీ ఉద్యోగాలకు ఇంజినీరింగ్ డిగ్రీ అవసరం. ఎయిర్ ఫోర్స్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. కానీ 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్ చదివి ఉండాలి. డిగ్రీ లేదా ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-వయస్సు: ఇండియన్ మిలిటరీ అకాడమీ, నేవల్ అకాడమీ పోస్టులకు 1997 జనవరి 2 నుంచి 2002 జనవరి 1 మధ్య లేదా ఆ తేదీల్లో జన్మించిన వారు అర్హులు. ఎయిర్ ఫోర్సు ఉద్యోగాలకు 1997 జనవరి 2 నుంచి 2001 జనవరి 1, మధ్య లేదా ఆ తేదీల్లో పుట్టిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ పోస్టులకు 1996, జనవరి 2 నుంచి 2002 జనవరి 1 మధ్య లేదా ఆ తేదీల్లో జన్మించి ఉండాలి. అవివాహితులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు నిర్ణీత శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి.
-ఎంపిక విధానం: రెండు దశల్లో ఉంటుంది.
-మొదటి దశ: రాతపరీక్ష ఉంటుంది. అందులో అర్హత సాధించిన వారికి ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు.
-ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల రాతపరీక్షలో ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు ఉంటాయి.
-మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది.

కాలవ్యవధి ఆరు గంటలు
-వంద మార్కులకు ఉండే ప్రతి సబ్జెక్టును రెండు గంటల వ్యవధిలో పూర్తిచేయాలి. ఆఫీసర్స్ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కోటి వంద చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రతి సబ్జెక్టుకు రెండు గంటల సమయం కేటాయించారు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.

మూడు పేపర్లు
-ఇంగ్లిష్ పరీక్షలో సాధారణ పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. పదోతరగతి స్థాయిలో ప్రిపేర్ అయితే సరిపోతుంది. వొకాబులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్, స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్/కరెక్షన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
-నిత్యజీవిత అనుభవాలు, పరిశీలనల్లో ఎదురయ్యే శాస్త్ర, సాంకేతిక అంశాల్లో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఉంటాయి. కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. భారతదేశ చరిత్ర, భౌగోళిక విశేషాలపైనా ప్రశ్నలు వస్తాయి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఉంటాయి. ఇందులో అర్థమెటిక్, ఆల్జీబ్రా, ట్రిగనామెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
-రెండోదశ: దీనిలో ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు.
-దీనిలో మళ్లీ రెండు స్టేజ్‌లు ఉంటాయి. మొదటి స్టేజ్‌లో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ (ఓఐఆర్) పరీక్షలు నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించినవారిని రెండో స్టేజ్‌కి ఎంపిక చేస్తారు.
-రెండో స్టేజ్‌లో ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్క్‌లు, సైకాలజీ టెస్ట్, కాన్ఫరెన్స్ ఉంటాయి.
-ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల ఇంటర్వ్యూకు 300 మార్కులు, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ ఇంటర్వ్యూకి 200 మార్కులు కేటాయించారు. రెండోదశను నాలుగు రోజులపాటు నిర్వహిస్తారు. అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
IAS-Academ1

-మొత్తం ఖాళీలు- 418 విభాగాల వారీగా...
-ఐఎంఏ, డెహ్రాడూన్ - 100
-ఐఎన్‌ఏ, ఎజిమళ - 45
-ఏఎఫ్‌ఏ, హైదరాబాద్ - 32
-ఓటీఏ, చెన్నై - 225
-ఓటీఏ (ఉమెన్), చెన్నై - 16

ముఖ్యమైన తేదీలు
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 19 (సాయంత్రం 6 వరకు)
-పరీక్ష ఫీజు: రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది)
-పరీక్షతేదీ: 2020, ఫిబ్రవరి 2
-రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
-వెబ్‌సైట్: www.upsc.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జెస్ట్-2020 నోటిఫికేషన్‌,

పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ (ఎన్‌సీఆర్‌ఏ) జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (జెస్ట్)-2020 నోటిఫికేషన్ విడుదలైంది.


-ఎగ్జామ్: జెస్ట్-2020
-ఈ ఎగ్జామ్ ద్వారా పీహెచ్‌డీ/ ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.
-విభాగాలు: ఫిజిక్స్/ థియరిటికల్ కంప్యూటర్ సైన్స్/ న్యూరోసైన్స్
-అర్హతలు: బీఎస్సీ (ఫిజిక్స్/మ్యాథమెటిక్స్), ఎంమ్మెస్సీ (ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్), బీఈ/బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణత.
-ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు: జనరల్-రూ.400/-, ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు-రూ.200/-.
-చివరితేదీ: డిసెంబర్ 14, పరీక్షతేదీ: 2020, ఫిబ్రవరి 16
-వెబ్‌సైట్: https://www.jest.org.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఐపీ పీజీ ప్రవేశాలు,

రాంచీలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ (సీఐపీ) 2020 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

-కోర్సు: పీజీ ప్రోగ్రామ్స్
-కోర్సులు: డిప్లొమా, ఎంఫిల్, పీహెచ్‌డీ.
-విభాగాలు: క్లినికల్ సైకాలజీ, సైకియాట్రిక్ సోషల్ వర్క్, సైకియాట్రిక్ నర్సింగ్.
-అర్హతలు: కోర్సుని అనుసరించి డిప్లొమా (జనరల్ నర్సింగ్), పీజీ (సోషల్ వర్క్), ఎంఏ/ ఎమ్మెస్సీ (సైకాలజీ), ఎంఫిల్ (క్లినికల్ సైకాలజీ) ఉత్తీర్ణత.
-ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ద్వారా
-పరీక్షతేదీ: 2020 ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: డిసెంబర్ 23
-వెబ్‌సైట్: http://online.cipranchi.org.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రైల్‌టెల్‌లో ఉద్యోగాలు,
రైల్వే శాఖకు చెందిన రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. RAILTEL -మొత్తం ఖాళీలు: 03 -పోస్టులు: యాక్సెస్ స్పెషలిస్ట్, స్టోరేజ్ స్పెషలిస్ట్. -అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతోపాటు అనుభవం. -ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: నవంబర్ 24 -వెబ్‌సైట్: https://www.railtelindia.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సెంట్రల్ యూనివర్సిటీ ఎంబీఏ కోర్సుల ప్రవేశాలు.

యూనివర్సిటీలో ఎంబీఏ హైదరాబాద్ యూనివర్సిటీలో (సెంట్రల్ యూనివర్సిటీ) ఎంబీఏ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది
HCU
-కోర్సు: ఎంబీఏ
-అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, క్యాట్ స్కోరు సాధించి ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 500/-, ఓబీసీలకు రూ. 350/- వికలాంగులకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250/-.
-చివరితేదీ: 2019, డిసెంబర్ 15
-వెబ్‌సైట్: http://acad.uohyd.ac.in

No comments:

Post a comment