Sunday, 3 May 2020

ఇంటర్‌తో నేవీ ఉద్యోగాలు, ఎన్‌ఐడీలో ఉద్యోగాలు, జిప్‌మర్‌లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ, ఐటీఐలో 33 ఉద్యోగాలు, ఐఐటీలో ఫ్యాకల్టీ పోస్టులు, డీఆర్‌డీవోలో సైంటిస్టులు, ఐఐఐటీడీఎంలో పీజీ కోర్సులు, ఐఐటీలో సైబర్‌ సెక్యూరిటీ కోర్సు, బయోమెడికల్‌, లైఫ్‌ సైన్సెస్‌లో ఐసీఎంఆర్‌ జేఆర్‌ఎఫ్‌లు, ఐఐటీహెచ్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు.


ఎన్‌ఐడీలో ఉద్యోగాలు,

భోపాల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 16

పోస్టులవారీగా ఖాళీలు: సీనియర్‌ డిజైనర్‌-2, అసోసియేట్‌ సీనియర్‌ డిజైనర్‌-2, ప్రిన్సిపల్‌ టెక్నికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌-1, సీనియర్‌ టెక్నికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌-1, డిజైనర్‌/ఫ్యాకల్టీ-4, సీనియర్‌ డిజైన్‌ ఇన్‌స్ట్రక్టర్‌-1, అసోసియేట్‌ టెక్నికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌-1, అసోసియేట్‌ డిజైన్‌ ఇన్‌స్ట్రక్టర్‌-1, డిజైన్‌ ఇన్‌స్ట్రక్టర్‌-1, డిప్యూటీ ఇంజినీర్‌-1, అసిస్టెంట్‌ ఇంజినీర్‌-1 ఖాళీ ఉన్నాయి.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: మే 17

వెబ్‌సైట్‌: https://nidmp.ac.in
--------------------------------------------------------------------------------------------------------------------------
జిప్‌మర్‌లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ,

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 138

పోస్టులు: ప్రొఫెసర్‌-20, అడిషనల్‌ ప్రొఫెసర్‌-22, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-33, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-63 ఖాళీలు ఉన్నాయి.

విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, పాథాలజీ అండ్‌ ల్యాబ్‌ మెడిసిన్‌, ఫార్మకాలజీ, సైకియాట్రీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, ఆప్తాల్మాలజీ, జనరల్‌ సర్జరీ, రేడియో డయాగ్నసిస్‌, ఆర్థోపెడిక్స్‌, పిడియాట్రిక్స్‌ తదితరాలు ఉన్నాయి.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: జూన్‌ 12

వెబ్‌సైట్‌: www.jipmer.edu.in
--------------------------------------------------------------------------------------------------------------------------
ఐటీఐలో 33 ఉద్యోగాలు,

భారత ప్రభుత్వ సంస్థ ఐటీఐ లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 33

పోస్టులు: ఫైనాన్స్‌ ఎగ్జిక్యూటివ్‌-9,  ఫైనాన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ-8, హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ-16 ఉన్నాయి.

ఈ పోస్టులను మొదట ఐదేండ్ల కాలపరిమితికి భర్తీ చేస్తారు. తర్వాత కంపెనీ అవసరాలను బట్టి మరికొంత కాలం పొడిగిస్తారు.

అర్హతలు, ఎంపిక తదితరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: మే 5

వెబ్‌సైట్‌: http://www.itiltd.in

--------------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్‌డీవోలో సైంటిస్టులు,

డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)లో సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌ (ఆర్‌ఏసీ) ప్రకటన విడుదల చేసింది.

పోస్టులు: సైంటిస్ట్‌ ఎఫ్‌-2, సైంటిస్ట్‌ ఈ-4, సైంటిస్ట్‌ డీ-13, సైంటిస్ట్‌ సీ-21  

అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత.  అనుభవం ఉండాలి.

ఎంపిక: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: ప్రకటన ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో విడుదలైన 21 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://rac.gov.in
--------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఐటీడీఎంలో పీజీ కోర్సులు,

జబల్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ (ఐఐఐటీడీఎం)లో పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

ప్రోగ్రామ్స్‌: ఎంటెక్‌ (సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, మెకట్రానిక్స్‌), ఎం.డిజైన్‌, పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ. 

అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత. వ్యాలిడ్‌ గేట్‌ స్కోర్‌.

ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: మే 8

వెబ్‌సైట్‌: https://www.iiitdmj.ac.in
--------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీలో సైబర్‌ సెక్యూరిటీ కోర్సు,

ఖరగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లో సైబర్‌ సెక్యూరిటీ కోర్సు ప్రోగ్రామ్‌ ప్రవేశ ప్రకటన విడుదలైంది.

కోర్సు: సైబర్‌ సెక్యూరిటీ

అర్హతలు: టీఈక్యూఐపీ-3 ఉపాధ్యాయులు, ఇంజినీరింగ్‌ కాలేజీలో పనిచేసే ఫ్యాకల్టీలు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: జూన్‌ 1

వెబ్‌సైట్‌: https://erp.iitkgp.ac.in/CEP

--------------------------------------------------------------------------------------------------------------------------
బయోమెడికల్‌, లైఫ్‌ సైన్సెస్‌లో ఐసీఎంఆర్‌ జేఆర్‌ఎఫ్‌లు,

 ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌)కు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 150 ఫెలోషిప్‌లను అందిస్తున్నది. ఇందులో 120 ఫెలోషిప్‌లు బయోమెడికల్‌ సైన్సెస్‌లో, 30 ఫెలోషిప్‌లు సోషల్‌ సైన్సెస్‌కు సంబంధించినవి ఉన్నాయి. వీటికి సంబంధించిన దరఖాస్తులు ఏప్రిల్‌ 27న ప్రారంభమవుతాయి. మే 27తో ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. అధికారిక వెబ్‌సైట్‌ అయిన icmr.nic.in., pgimer.edu.in ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షను కంప్యూటర్‌ ఆధారిత పద్ధతిలో జూలై 17న నిర్వహిస్తారు. ఈ పరీక్షను చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) నిర్వహిస్తున్నది.
--------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీహెచ్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు.


హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లో పీహెచ్‌డీ ప్రవేశాల ప్రకటన విడుదలైంది.

ప్రోగ్రామ్‌: పీహెచ్‌డీ

విభాగాలు: ఏఐ, బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌, బయోటెక్నాలజీ, సివిల్‌, కెమికల్‌, కెమిస్ట్రీ, సీఎస్‌ఈ, డిజైన్‌, ఈఈ, లిబరల్‌ ఆర్ట్స్‌, మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ మెటలర్జికల్‌, మ్యాథ్స్‌, మెకానికల్‌ అండ్‌ ఏరోస్పేస్‌, ఫిజిక్స్‌.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: మే 15

వెబ్‌సైట్‌: https://www. iith.ac.in/phdadmissions
------------------------------------------------------------------------------------------------------------------------
ఇంటర్‌తో నేవీ ఉద్యోగాలు,

నావికాదళం.. అపార అవకాశాలకు నిలయం. దేశరక్షణలో కీలకంగా పనిచేస్తున్న నేవీలో ఎప్పుడూ ఏదో ఒక ఉద్యోగ ప్రకటన వస్తూనే ఉంటుంది. వాటిని అందిపుచ్చుకుంటే చాలు భద్రమైన కొలువుతోపాటు దేశసేవ చేసే భాగ్యం కలుగుతుంది. ఎటువంటి విపత్తులు వచ్చినా భయం లేని కొలువులు రక్షణ కొలువులు. ఇంటర్‌తో నేవీలో సెయిలర్‌ పోస్టులకు ఏటా ప్రకటన వస్తుంది. సెయిలర్‌ పోస్టుకు అర్హతలు, ఎంపిక విధానం, జీతభత్యాల గురించి తెలుసుకుందాం..

సెయిలర్‌ ఉద్యోగాలు
సెయిలర్‌ పోస్టులో ఐదు రకాలు ఉంటాయి. అవి...ఆర్టిఫైజర్‌ అప్రెంటిస్‌, ఎస్‌ఎస్‌ఆర్‌, మెట్రిక్‌ రిక్రూట్‌, మ్యూజీషియన్‌, స్పోర్ట్స్‌. 
విద్యార్హత: ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌లలో ఏదో ఒక సబ్జెక్టు చదివి ఉండాలి. ఆర్టిఫైజర్‌ అప్రెంటిస్‌ పోస్టులకు ఈ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. ఈ రెండు పోస్టులకూ కేవలం పురుష అభ్యర్థులే అర్హులు.
వయస్సు:  17- 20 ఏండ్ల మధ్య ఉండాలి. (నోటిఫికేషన్‌ సమయంలో ఇచ్చిన ప్రకారం). 
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టు (పీఎఫ్‌టీ), మెడికల్‌ టెస్టుల ద్వారా.
పరీక్ష విధానం
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు ఇస్తారు. 
పరీక్ష వ్యవధి గంట.
నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. 
ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది.
ప్రశ్నపత్రంలో 4 సెక్షన్లు ఉంటాయి. అవి.. ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, సైన్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌. 
ప్రశ్నలు ఇంటర్‌ స్థాయిలోనే ఉంటాయి. సిలబస్‌ వివరాలు నేవీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
అన్ని సెక్షన్లలోనూ కనీస అర్హత మార్కులు సాధించాలి. నిర్ణీత సగటు కంటే ఎక్కువ స్కోర్‌ ఉన్నవారిని తర్వాత దశకు ఎంపిక చేస్తారు.
ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ (పీఎఫ్‌టీ) 
రాత పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తారు. 
దీనిలో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల్లో పరుగెత్తాలి. 20 సిట్‌ అప్స్‌, 10 పుష్‌ అప్స్‌ తీయాలి.
క్రీడలు, ఈతలో ప్రావీణ్యం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. 
ఫిజికల్‌ టెస్టులో అర్హత సాధించినవారికి మెడికల్‌ టెస్టులు నిర్వహిస్తారు. 
నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి. అభ్యర్థులు కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.

శిక్షణ
ఆర్టిఫైజర్‌ అప్రెంటిస్‌కు ఎంపికైనవారికి 9 వారాలు, ఎస్‌ఎస్‌ఆర్‌ పోస్టుకైతే 22 వారాలు చిల్కా సరస్సులో శిక్షణ కొనసాగుతుంది. అనంతరం అభ్యర్థులకు కేటాయించిన బ్రాంచ్‌/ ట్రేడుల్లో ఏదైనా నేవీ శిక్షణ కేంద్రంలో తర్వాత దశ శిక్షణ ఉంటుంది. 
స్టయిఫండ్‌

శిక్షణ సమయంలో రూ.14600/- స్టయిఫండ్‌గా చెల్లిస్తారు. 
విజయవంతంగా ప్రొఫెషనల్‌ శిక్షణను పూర్తిచేసుకున్నవారిని సెయిలర్‌-ఏఏ/ఎస్‌ఎస్‌ఆర్‌ తదితర హోదాతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. విధుల్లో చేరినవారికి రూ.21,700-69,100 వేతనం లభిస్తుంది. దీంతోపాటు మిలిటరీ సర్వీస్‌ పే రూ.5200, గ్రూప్‌-ఎక్స్‌ పే రూ.6200 (ఏఏ పోస్టులకు), డీఏ ప్రతినెలా లభిస్తాయి. అన్ని ప్రోత్సాహకాలతో కలిపి ఎస్‌ఎస్‌ఆర్‌లు ప్రారంభంలోనే రూ.35 వేలు, ఏఏలు రూ.42 వేల వరకు వేతనం పొందవచ్చు. 
పదోన్నతులు- సర్వీస్‌ 
సెయిలర్‌ నుంచి మాస్టర్‌ చీఫ్‌ పెట్టీ ఆఫీసర్‌-1 హోదా వరకు పదోన్నతి లభిస్తుంది. 
ఏఏకు ఎంపికైనవారు 20 సంవత్సరాలు, ఎస్‌ఎస్‌ఆర్‌లో చేరినవారు 15 ఏళ్లు ఉద్యోగంలో కొనసాగవచ్చు. ఆ తర్వాత అభ్యర్థుల ఆసక్తి, నేవీ అవసరాలకు అనుగుణంగా సర్వీస్‌ పొడిగిస్తారు. పదవీ విరమణ చేసినవారికి పూర్తిస్థాయి పెన్షన్‌ జీవితాంతం లభిస్తుంది. 
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో (ఏటా జూన్‌/జూలైలో నోటిఫికేషన్‌ వెలువడుతుంది)
పరీక్షలు: సెప్టెంబర్‌/ అక్టోబర్‌లో నిర్వహిస్తారు.
వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in
10+2 (బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌
ఇంటర్‌తో నేవీలో బీటెక్‌ చదివించి, ఉద్యోగావకాశం కల్పించే మరో ఎంట్రీ బీటెక్‌ క్యాడెట్‌ 10+2 స్కీమ్‌. 

ఎవరు అర్హులు?
అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
ఇంటర్‌ ఎంపీసీ చదివినవారు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లలో 70 శాతం మార్కులు వచ్చి ఉండాలి. దీంతోపాటు పదోతరగతి లేదా ఇంటర్‌ ఇంగ్లిష్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. జేఈఈ మెయిన్‌లో అర్హత పొంది ఉండాలి. 
వయస్సు: 17 - 19 1/2 ఏండ్లు ఉండాలి. 
ఎంపిక ఎలా? 
ఈ స్కీమ్‌ కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను జేఈఈ- మెయిన్‌లో సాధించిన ర్యాంకు ద్వారా షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. 
అనంతరం వీరికి సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు రెండుదశల్లో ఐదురోజుల పాటు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. 
స్టేజ్‌-1: తొలిరోజు ఈ పరీక్షను నిర్వహిస్తారు. 
దీనిలో భాగంగా ఇంటెలిజెన్స్‌ టెస్ట్‌, పిక్చర్‌ పర్‌సెప్షన్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌ ఉంటాయి. 
దీనిలో అర్హత సాధించినవారికి మిగిలిన నాలుగురోజుల పాటు స్టేజ్‌-2 ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
స్టేజ్‌-2: ఇందులో భాగంగా సైకలాజికల్‌ టెస్ట్‌, గ్రూప్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత సాధిస్తే ఫిజికల్‌ టెస్ట్‌, వైద్యపరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలకు ఎంపికైనవారికి ఏసీ 3 టైర్‌ రైల్‌ చార్జీలను నేవీ చెల్లిస్తుంది.
శిక్షణ
ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్‌ నేవల్‌ అకాడమీ-ఎజిమల (కేరళ)లో బీటెక్‌ అప్లయిడ్‌ ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ లేదా మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు చదివిస్తారు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత డిగ్రీ పట్టాను జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రదానం చేస్తుంది.
శిక్షణ సమయంలో పుస్తకాలు, దుస్తులు, వసతి, భోజనం తదితర సౌకర్యాలను నేవీ ఉచితంగా కల్పిస్తుంది.
ప్రకటనలు: ప్రతి సంవత్సరం జూన్‌, డిసెంబర్‌లలో వెలువడుతాయి.
పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/



No comments:

Post a comment