బీబీనగర్ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు,
బీబీనగర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన గడువు పొడిగించింది.
పోస్టులు: ప్రొఫెసర్-20, అసోసియేట్ ప్రొఫెసర్-22, అడిషనల్ ప్రొఫెసర్-33, అసిస్టెంట్ ప్రొఫెసర్-63 ఖాళీలు ఉన్నాయి.
(Advt. No. JIP/AIIMS(Bibinagar)/2020/01) గతంలో చివరితేదీ జూన్‌లో ఉండగా ప్రస్తుతం దీన్ని జూలై 24 వరకు పొడిగించారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూలై 24
వెబ్సైట్: https://main.jipmer.edu.in
-----------------------------------------------------------------------------------------------------------------------
నార్త్ సెంట్రల్ రైల్వేలో 196 అప్రెంటిస్‌లు,
న్యూఢిల్లీ: ఉత్తర మధ్య రైల్వేలో అప్రెంటిస్‌ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 196 సీట్ల కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎన్సీఆర్ ప్రకటించింది. అభ్యర్థులకు ఝాన్సీలోని వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్‌లో శిక్షణ అందిస్తామని వెల్లడించింది. జూలై 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అప్రెంటిస్‌ల కోసం ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదని, పదో తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తామని వెల్లడించింది.
వివరాలు..
మొత్తం అప్రెంటిస్‌లు: 196
అర్హతలు: పదో తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.
వయస్సు: 15 నుంచి 24 ఏండ్ల లోపువారై ఉండాలి
ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా
దరఖాస్తులు: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 15
-----------------------------------------------------------------------------------------------------------------------
ఐఐపీఈలో టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులు,
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
ఫ్యాకల్టీ పోస్టులు
1. పెట్రోలియం ఇంజినీరింగ్ (ప్రొఫెసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్/అసోసియేట్ ప్రొఫెసర్)
2. కెమికల్ ఇంజినీరింగ్ (ప్రొఫెసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్/అసోసియేట్ ప్రొఫెసర్)
3. మెకానికల్ ఇంజినీరింగ్ (ప్రొఫెసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్/అసోసియేట్ ప్రొఫెసర్)
4. మ్యాథమెటిక్స్ (అసోసియేట్ ప్రొఫెసర్)
5. కెమిస్ట్రీ (అసోసియేట్ ప్రొఫెసర్)
6. ఇంగ్లిష్ (అసోసియేట్ ప్రొఫెసర్)
7. కౌన్సెలర్ (అసిస్టెంట్ ప్రొఫెసర్)
అర్హతలు:
అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు.. సంబంధిత సబ్జెక్టులో పీహెచ్డీ ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. పీహెచ్డీ ముగిసిన తర్వాత మూడేండ్ల అనుభవం ఉండాలి. 45 ఏండ్ల వయస్సులోపు వారై ఉండాలి.
అసిస్టెంట్ ప్రొఫెసర్.. సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీతోపాటు ఆరేండ్ల ఇండస్ట్రియల్ లేదా రిసెర్చ్ లేదా టీచింగ్ అనుభవం ఉండాలి. 45 ఏండ్ల వయస్సులోపు వారై ఉండాలి.
ప్రొఫెసర్.. సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీతోపాటు పదేండ్ల టీచింగ్ లేదా రిసెర్చ్ అనుభవం ఉండాలి. 55 ఏండ్ల లోపువారై ఉండాలి.
నాన్‌టీచింగ్ పోస్టులు
మొత్తం 30 పోస్టులు ఉన్నాయి. అందులో లైబ్రేరియన్-1, డిప్యూటీ లైబ్రేరియన్-1 (ఎస్సీ), ఆఫీసర్ ఐటీ- 3, సీనియర్ సూపరింటెండెంట్-1, సెక్రెటరీ టూ రిజిస్ట్రార్-1, గెస్ట్‌హౌస్ మేనేజర్- 1, టెక్నీషియన్- 5 (ఎస్సీ-1, ఓబీసీ-1, జనరల్-3), టెక్నికల్ అసిస్టెంట్- 13 (జనరల్-5, ఎస్సీ-1, ఎస్టీ-1, ఓబీసీ-4, ఈడబ్ల్యూఎస్-2), ల్యాబ్ అసిస్టెంట్-4 (జనరల్-4, ఎస్సీ-1, ఓబీసీ-1)
అర్హతలు: సంబంధిత రంగంలో డగ్రీతోపాటు, అనుభవం తప్పనిసరి.
ఎంపిక విధానం: ఇంటర్వూ (టీచింగ్ పోస్టులకు), రాతపరీక్ష, ట్రేడ్‌టెస్ట్, కంప్యూర్ టెస్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్, ఇంటర్వ్యూ (నాన్‌టీచింగ్ పోస్టులకు)
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 24
వెబ్సైట్: www.iipe.ac.in
-----------------------------------------------------------------------------------------------------------------------
ఎన్టీపీసీలో 100 ఇంజినీరింగ్ పోస్టులు,
హైదరాబాద్: దేశంలో ప్రముఖ విద్యుత్ ఉత్పత్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగినవారు అధికారిక వెబ్సైట్ ntpccareers.net ద్వారా జూలై 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. గేట్-2020లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూకి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో మెకానికల్ ఇంజినీర్స్ విభాగంలో 45 పోస్టులు, ఎలక్ట్రికల్ విభాగంలో 30, ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీర్స్ విభాగంలో 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.150లు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఎలాంటి ఫీజు లేదు
-----------------------------------------------------------------------------------------------------------------------
పవర్‌గ్రిడ్‌లో అప్రెంటిస్‌లు,
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్- సదరన్ రీజియన్‌లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 67
అప్రెంటిస్‌ల వారీగా ఖాళీలు: గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రికల్, సివిల్)-8, డిప్లొమా(ఎలక్ట్రికల్, సివిల్)-31, హ్యూమన్ రిసోర్స్(హెచ్ఆర్)-7, ఐటీఐ(ఎలక్ట్రికల్)-16.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ (బీఏ/ బీబీఏ), ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూలై 5
వెబ్సైట్: http://powergridindia.com
-----------------------------------------------------------------------------------------------------------------------
పార్లమెంట్లో ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాలు.
పార్లమెంట్ ఆఫ్ ఇండియాలోని లోక్‌సభ సెక్రటేరియట్లో ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం పోస్టులు: 47
పోస్టు: ట్రాన్స్‌లేటర్
పేస్కేల్: రూ.47,600-1,51,100/-
అర్హతలు, వయస్సు తదితరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
ఎంపిక: రాతపరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్) ద్వారా
దరఖాస్తు: ఈ-మెయిల్ ద్వారా
చివరితేదీ: జూలై 27
వెబ్సైట్: http://loksabhaph.nic.in