Friday, 26 June 2020

సీఏపీఎఫ్‌లో 1564 ఎస్‌ఐ ఉద్యోగాలు, ఎన్‌డీఏ&ఎన్‌ఏ (II)-2020 నోటిఫికేషన్‌, ఏఎఫ్‌ క్యాట్‌ 2020 నోటిఫికేషన్‌, యూపీఎస్సీ ఐఎస్‌ఎస్‌-2020 నోటిఫికేషన్‌.

సీఏపీఎఫ్‌లో 1564 ఎస్‌ఐ ఉద్యోగాలు,

ఢిల్లీ పోలీస్‌, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌)లలో ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ప్రకటనను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసింది.

పోస్టు: సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌

మొత్తం ఖాళీలు: 1564 

ఈ ఖాళీలు ఢిల్లీ పోలీస్‌, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ,  సీఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ)లో ఉన్నాయి.

వయస్సు: 20-25 ఏండ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. 

శారీరక ప్రమాణాలు: పురుషులు- 170 సెం.మీ ఎత్తు, 80 సెం.మీ ఛాతీ ఉండాలి. మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (పేపర్‌-1, 2), పీఈటీ, వైద్యపరీక్షల ద్వారా 

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: జూలై 16

వెబ్‌సైట్‌: https://ssc.nic.in
-----------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌డీఏ&ఎన్‌ఏ (II)-2020 నోటిఫికేషన్‌,
నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ), నేవల్‌ అకాడమీ (ఎన్‌ఏ)ల్లో ప్రవేశానికి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.

పరీక్ష పేరు: ఎన్‌డీఏ&ఎన్‌ఏ (II)- 2020

మొత్తం ఖాళీలు: 413

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ)- 370 ఖాళీలు

నేవల్‌ అకాడమీ (10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌)- 43 ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణత.

వయస్సు: 2002 జనవరి 2 - 2005 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ద్వారా

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు ఫీజు: రూ.100

చివరితేదీ: జూలై 6 

పరీక్షతేదీ: సెప్టెంబర్‌ 6

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in

-----------------------------------------------------------------------------------------------------------------------
ఏఎఫ్‌ క్యాట్‌ 2020 నోటిఫికేషన్‌,

ఎయిర్‌ఫోర్స్‌.. దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న మూడుదళాల్లో ఒకటి. దీనిలో ఏటా వందలాది ఉద్యోగాలను భర్తీ చేస్తుంటారు. డిగ్రీ పూర్తయిన వారికి భద్రమైన కొలువుతోపాటు ఆకర్షణీయమైన జీతభత్యాలు, సౌకర్యాలతో ఆఫీసర్‌ స్థాయి ఉద్యోగాల కోసం నిర్వహించే కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ దరఖాస్తు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఏఎఫ్‌క్యాట్‌ (జూలై 2021) వివరాలు నిపుణ పాఠకుల కోసం..

ఏఎఫ్‌ క్యాట్‌: ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌. ఏటా ఈ టెస్ట్‌ ద్వారా కమిషన్డ్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేస్తారు. ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌) విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. పర్మినెంట్‌, షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
మొత్తం ఖాళీలు- 256
బ్రాంచీలవారీగా ఖాళీలు
ఏఎఫ్‌ క్యాట్‌ ఎంట్రీ
బ్రాంచీ: ఫ్లయింగ్‌ 
ఖాళీలు: షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ)-74 
బ్రాంచీ: గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌)
ఖాళీలు: ఏఈ (ఎల్‌)-పర్మినెంట్‌ కమిషన్‌ (పీసీ)- 40, ఎస్‌ఎస్‌సీ- 26
ఏఈ (ఎం)-పీసీ- 23, ఎస్‌ఎస్‌సీ- 16
బ్రాంచీ: గ్రౌండ్‌ డ్యూటీ (నాన్‌ టెక్నికల్‌)
ఖాళీలు: అడ్మిన్‌- పీసీ-24, ఎస్‌ఎస్‌సీ-16
ఎడ్యుకేషన్‌-పీసీ-8, ఎస్‌ఎస్‌సీ-8
మెటీయోరాలజీ-పీసీ-10, ఎస్‌ఎస్‌సీ-12
ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ
బ్రాంచీ: ఫ్లయింగ్‌
ఖాళీలు: సీడీఎస్‌ఈ ఖాళీల్లో 10 శాతం పీసీ కింద, ఏఎఫ్‌ క్యాట్‌లో 10 శాతం ఖాళీలను ఎస్‌ఎస్‌సీ కింద భర్తీ చేస్తారు.

ఎవరు అర్హులు?
డిగ్రీ, బీఈ/బీటెక్‌, బీకాంతోపాటు సంబంధిత 
సబ్జెక్టుల్లో పీజీ, ఎన్‌సీసీ సర్టిఫికెట్‌ ఉండాలి.
ఫ్లయింగ్‌ బ్రాంచీకి 20-24 ఏండ్ల మధ్య, గ్రౌండ్‌ డ్యూటీ బ్రాంచీకి 20-26 ఏండ్ల మధ్య ఉండాలి. 
నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అవివాహిత పురుష/మహిళా అభ్యర్థులు అయి ఉండాలి.
శారీరక ప్రమాణాలు: కనీసం 167.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఫ్లయింగ్‌ బ్రాంచీకి కనీసం 162.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ ఛాతీ, బరువు ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌) అభ్యర్థులు తప్పనిసరిగా ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌కు హాజరు కావాలి. 
పరీక్ష విధానం
మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి.
రెండు గంటల కాలవ్యవధి.
మొత్తం 300 మార్కులు
దీనిలో జనరల్‌ అవేర్‌నెస్‌, వెర్బల్‌ ఎబిలిటీ ఇన్‌ ఇంగ్లిష్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌, మిలిటరీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌.
ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌: దీనిలో మెకానికల్‌, కంప్యూటర్‌సైన్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ సబ్జెక్టులు ఉంటాయి.
మొత్తం ప్రశ్నలు 50. మొత్తం మార్కులు 150
నోట్‌: ఏఎఫ్‌ క్యాట్‌, ఈకేటీ పరీక్షలు ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు కోత విధిస్తారు.
పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్‌, వరంగల్‌.
ఆన్‌లైన్‌ పరీక్షలో అర్హత సాధించినవారికి ఎయిర్‌ఫోర్స్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఏఎఫ్‌ఎస్‌బీ) రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహిస్తుంది. తర్వాత ఇంటర్వ్యూ, వైద్యపరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తుంది.
పరీక్ష తేదీలు: 2020, సెప్టెంబర్‌ 19, 20
శిక్షణ: 2021 జూలై నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ, దుండిగల్‌ (హైదరాబాద్‌)లో శిక్షణ ఇస్తారు. గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ బ్రాంచీకి 74 వారాలు, నాన్‌ టెక్నికల్‌ బ్రాంచీకి 52 వారాల శిక్షణ ఇస్తారు. 
పే అలవెన్స్‌లు: ఫ్లయింగ్‌ ఆఫీసర్‌- లెవల్‌ 10 నెలకు రూ.56,100-1,77,500/-, ఎంఎస్‌పీ రూ.15,500/-
శిక్షణ సమయంలో నెలకు రూ.56,500/ - స్టయిఫండ్‌ ఇస్తారు.
ముఖ్యతేదీలు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 

చివరితేదీ: జూలై 14

వెబ్‌సైట్‌: https: //afcat.cdac.in

-----------------------------------------------------------------------------------------------------------------------
యూపీఎస్సీ ఐఎస్‌ఎస్‌-2020 నోటిఫికేషన్‌.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ప్రతిఏటా భర్తీ చేస్తుంది. దీనికోసం ముందుగానే క్యాలెండర్‌ను విడుదల చేస్తుంది. దీనిప్రకారం నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది. ఇందులోభాగంగా కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీసెస్‌ (ఐఎస్‌ఎస్‌)లో ఖాళీగా ఉన్న 47 ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 30 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంతోపాటు, దరఖాస్తులు సమర్పించవచ్చు. సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తిచేసి, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసినవారిలో అర్హతలేదని భావించినవారు, పరీక్ష రాయదల్చుకోలేనివారు జూలై 7 నుంచి 13 వరకు తమ దరఖాస్తులను రద్దు చేసుకోవచ్చు. 

ఐఎస్‌ఎస్‌ వివరాలు..
మొత్తం పోస్టులు: 47

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌

అర్హత: ఎకనామిక్స్‌లో పీజీ లేదా అప్లయిడ్‌ ఎకనామిక్స్‌ లేదా బిజినెస్‌ ఎకనామిక్స్‌ పీజీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు 21 ఏండ్ల నుంచి 30 ఏండ్ల వయస్సులోపువారై ఉండాలి.  

అప్లికేషన్‌ ఫీజు: రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

పరీక్ష తేదీ: అక్టోబర్‌ 16 నుంచి 18 

వెబ్‌సైట్‌: upsconline.nic.in 

ఐఈఎస్‌-2020 రద్దు
కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఖాళీలకు సంబంధించిన వివరాలను సమర్పించకపోవడంతో ఇండియన్‌ ఎకనమిక్‌ సర్వీసెస్‌-2020 పరీక్షను యూపీఎస్సీ రద్దు చేసింది.

No comments:

Post a comment