Wednesday, 1 July 2020

టాటా ఫండమెంటల్‌ రిసెర్చ్‌లో ఉద్యోగాలు

రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరాఖాస్తు చేసుకోవాలని కోరింది. జూలై 29వ తేదీవరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు సమర్పించవచ్చని వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌ www.tifrh.res.inలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. 

పోస్టులు..
సైటింఫిక్‌ ఆఫీసర్‌-1, ఇజింనీర్‌-2 (ఓబీసీ, ఎస్సీ), సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-1 (ఎస్సీ), ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌-2, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌-3 (జనరల్‌-2, ఓబీసీ-1), క్లర్క్‌-1 (ఓబీసీ)

అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధమైన అర్హతలు ఉన్నాయి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిపరి. పూర్తి వివరాలకు టిఫర్‌ వెబ్‌సైట్‌ చూడవచ్చు. 

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో. అప్లికేషన్లను ప్రింట్‌ తీసి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి పోస్టు ద్వారా పంపించాలి. అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌, 36/పీ, గోపన్‌పల్లి, శేరిలింగంపల్లి, రంగారెడ్డి జిల్లా, హైదరబాద్‌-500046 అడ్రస్‌కు జూలై 29లోపు చేరేలా పోస్టులో పంపించాలి.  

దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 29 

వెబ్‌సైట్‌: www.tifrh.res.in 

No comments:

Post a comment