Wednesday, 22 July 2020

ఇండియ‌న్ ఎక‌న‌మిక్ స‌ర్వీసెస్ (ఐఈఎస్‌)-2020, టీఎస్ పీజీఈసీ-2020 నోటిఫికేష‌న్ విడుద‌ల‌, సెప్టెంబ‌ర్ 28న నైప‌ర్ జేఈఈ, కేవీల్లో ప్రవేశాలు, కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు, Crpf ఉద్యోగాలు.

ఇండియ‌న్ ఎక‌న‌మిక్ స‌ర్వీసెస్ (ఐఈఎస్‌)-2020,

ఇండియ‌న్ ఎక‌న‌మిక్ స‌ర్వీసెస్ (ఐఈఎస్‌)-2020 ప‌రీక్ష‌ను అక్టోబ‌ర్‌లో నిర్వ‌హిస్తామ‌ని యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) ప్ర‌క‌టించింది. జూన్ 10న ఐఈఎస్, ఐఎస్ఎస్ (ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ స‌ర్వీస్‌) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అయితే ఐఈఎస్‌కు సంబంధించి పోస్టులు ఖాళీగా లేవ‌ని, ఈ ఏడాది ప‌రీక్ష‌ను ర‌ద్దు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించింది.

అయితే ఆర్థిక వ్య‌వ‌హారాల శాఖ కోరిక మేర‌కు జూన్ 10న విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌ను యూపీఎస్సీ ఉప‌సంహ‌రించుకుంది. ఐఈఎస్‌కు సంబంధించి ఆగ‌స్టు 11న నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తామ‌ని, ప‌రీక్ష‌ను అక్టోబ‌ర్ 16 నుంచి 18 వ‌ర‌కు నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించింది. దీంతో ఐఈఎస్, ఐఎస్ఎస్ ప‌రీక్ష‌ల‌ను ఎప్ప‌టిలాగే ఒకేసారి నిర్వ‌హించ‌నుంది. 

గ‌తంలో విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ ప్ర‌కారం ఐఎస్ఎస్ ప‌రీక్ష‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తుల తేదీ ఇప్ప‌టికే ముగిసింది.  ప‌రీక్ష‌ అక్టోబ‌ర్ 16 నుంచి 18 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది
---------------------------------------------------------------------------------------------------------------------
టీఎస్ పీజీఈసీ-2020 నోటిఫికేష‌న్ విడుద‌ల‌,
హైద‌రాబాద్‌: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మా, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్ లెవ‌ల్ ఫార్మా డీ (పీబీ) కోర్సులు చేయాల‌నుకునే గేట్ లేదా జీప్యాట్ విద్యార్థుల కోసం టీఎస్ పీజీఈసీ-2020 నోటిఫికేష‌న్‌ను ఉస్మానియా యూనివ‌ర్సిటీ విడుద‌ల చేసింది. అర్హ‌త క‌లిగిన విద్యార్థులు ఈరోజు నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్‌ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. కౌన్సెలింగ్ షెడ్యూల్‌కు సంబంధించి త్వ‌ర‌లో నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తామ‌ని వెల్ల‌డించింది. అర్హ‌త‌లు, కోర్సులు త‌దిత‌ర విష‌యాల కోసం అధికారిక వెబ్‌సైట్లు pgece.tsche.ac.in లేదా www.tsche.ac.in చూడ‌వ‌చ్చ‌ని తెలిపింది. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.600 (ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు రూ.300) 

---------------------------------------------------------------------------------------------------------------------
సెప్టెంబ‌ర్ 28న నైప‌ర్ జేఈఈ,

ఎంఫార్మా, ఎంఎస్ ఫార్మా, ఎంటెక్ ఫార్మా, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల‌లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష (జేఈఈ) తేదీని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్ (నైప‌ర్‌) ప్ర‌కటించింది. ఆన్‌లైన్‌లో జ‌రిగే ఈ ప‌రీక్ష‌ను సెప్టెంబ‌ర్ 28న నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించింది. షెడ్యూల్ ప్ర‌కారం ఈ ప‌రీక్ష జూన్ 14న జ‌ర‌గాల్సి ఉన్న‌ది. అయితే క‌రోనా నేప‌థ్యంలో జూలై 25కు వాయిదా వేసింది. అయితే దేశంలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో ప‌రీక్ష‌ మ‌రోమారు వాయిదాప‌డింది. తాజాగా ప‌రీక్ష‌ను సెప్టెంబ‌ర్ నెల‌లో నిర్వ‌హిస్తామ‌ని తెలిపింది. పూర్తి వివ‌రాల‌కోసం అధికార వెబ్‌సైట్ niperahm.ac.in చూడ‌వ‌చ్చ‌ని వెల్ల‌డించింది. ఈ ఏడాది జేఈఈని అహ్మ‌దాబాద్‌లోని నైప‌ర్ నిర్వ‌హిస్తున్న‌ది.  

నైప‌ర్ జేఈఈ ద్వారా అహ్మ‌దాబాద్‌, హైద‌రాబాద్‌, హాజీప‌ట్‌, కోల్‌క‌తా, రాయ్‌బ‌రేలి, ఎస్ఏఎస్ న‌గ‌ర్‌లోని నైప‌ర్ క్యాంప‌స్‌ల‌లో ప్ర‌‌వేశాలు క‌ల్పిస్తారు. ఈ కాలేజీల్లో మాస్ట‌ర్ ఇన్ ఫార్మ‌సీ (ఎంఫార్మా), మాస్ట‌ర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్ ఫార్మా), మాస్ట‌ర్ ఆఫ్ టెక్నాల‌జీ (ఎంటెక్ ఫార్మా), పీహెచ్‌డీ ప్రోగామ్‌ల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.  ఈ కాలేజీల్లో 820 సీట్లు అందుబాటులో ఉన్నాయి.     

---------------------------------------------------------------------------------------------------------------------
కేవీల్లో ప్రవేశాలు,

కేంద్రీయ విద్యాల‌యాల్లో 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి సంబంధించి ఒక‌టో త‌ర‌గతిలో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆగ‌స్టు 7వ తేదీవ‌ర‌కు ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్లు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ద‌ర‌ఖాస్తులు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయ‌ని వెల్ల‌డించింది. ఎంపికైన విద్యార్థుల పేర్ల‌ను ఆగ‌స్టు 11న ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపింది. రెండో విడ‌త జాబితాను ఆగ‌స్టు 19న, సీట్లు మిగిలితే ఆగ‌స్టు 23న మూడో జాబితాను విడుద‌ల చేస్తామ‌ని వెల్ల‌డించింది. రెండో త‌ర‌గ‌తి నుంచి 10వ త‌ర‌గ‌తి వ‌రకు ఖాళీగా ఉన్న సీట్ల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తులు ప్రారంభమ‌య్యాయ‌ని, జూలై 25తో అప్లికేష‌న్ గ‌డువు ముగుస్తుంద‌ని తెలిపింది. ఆగ‌స్టు 24 నుంచి 26 వ‌ర‌కు సీట్లు కేటాయిస్తామ‌ని వెల్ల‌డించింది. 
---------------------------------------------------------------------------------------------------------------------
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు,
కేంద్రీయ విద్యాలయాలు.. ప్రామాణిక విద్యకు నిలయాలు. వీటిలో ప్రవేశం పొందితే చాలు ఇంటర్ వరకు అతితక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా..

కేవీఎస్: కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్). ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉద్యోగ బాధ్యతలను నిర్వహించే కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, రక్షణశాఖ, పారామిలిటరీ ఉద్యోగుల పిల్లల కోసం ఒకే సిలబస్ అన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ ఓవరాల్ డెవలప్ కరికులంతో విద్యను అందిస్తారు ఇక్కడ. ఈ స్కూల్స్ సీబీఎస్ అఫిలియేటెడ్. కోఎడ్యుకేషన్, విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తిని పాటిస్తారు. ఎనిమిదోతరగతి వరకు ఎటువంటి ట్యూషన్ ఫీజు ఉండదు. ఎస్సీ, ఎస్టీ, బాలికలకు ఇంటర్ వరకు ఫీజు ఉండదు.
ప్రవేశాలు: ఒకటో తరగతి. రెండోతరగతి నుంచి పదోతరగతి వరకు ఆయా తరగతుల్లో ఖాళీలు ఉంటే వాటిలో ప్రవేశాలు కల్పిస్తారు. వీటికోసం సంబంధిత పాఠశాల వెబ్ చూడాలి. ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం వెబ్ చూడవచ్చు. 
దరఖాస్తు: ఆన్
చివరితేదీ: ఆగస్టు 8
వెబ్ https://kvsonlineadmission.kvs.gov.in లేదా https://kvsonlineadmission.kvs.gov.in/apps ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ నుంచి కూడా అడ్మిషన్  వివరాలను తెలుసుకోవచ్చు. 
ప్రొవిజనల్ లిస్ట్: ఒకటో తరగతికి సంబంధించి ఆగస్టు 11న ప్రకటిస్తారు. 
దీంతోపాటు వెయిటింగ్ లిస్ట్ ప్రకటిస్తారు.
రెండోజాబితా: ఆగస్టు 24 
ఫైనల్ ప్రొవిజనల్ లిస్ట్: ఆగస్టు 27, 28
రెండు ఆపై తరగతులు: ఆయా పాఠశాలల్లోని ఖాళీలను అనుసరించి జూలై 25 లోపు దరఖాస్తు చేసుకోవాలి. 
పూర్తి వివరాల కోసం https://kvsangathan.nic.in చూడవచ్చు

---------------------------------------------------------------------------------------------------------------------
Crpf  ఉద్యోగాలు.

పారామెడికల్  (ఎస్ ఏఎస్ హెడ్ కానిస్టేబుల్) పోస్టులు

కేంద్ర బలగాల్లో అత్యంత కీలకమైన దళం. దేశ అంతర్గత భద్రతతోపాటు అవసరమైనప్పుడు దేశ సరిహద్దుల్లో సైతం తనవంతు పాత్రను పోషించే పోలీస్ ఫోర్స్ సీఆర్ దీనిలో ఉద్యోగం అంటే అటు దేశరక్షణలో పాల్గొనడం, ఇటు భద్రమైన కొలువు. ఆకర్షణీయమైన జీతభత్యాలు. వసతి సౌకర్యాలు. ప్రస్తుతం సీఆర్ గ్రూప్ బీ, సీ పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా..

సీఆర్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ దేశంలో అంతర్గత భద్రత కోసం ఏర్పాటుచేసిన రక్షణ దళం ఇది. దీన్ని 1939లో ప్రారంభించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని 1949 పార్లమెంట్ చట్టం ప్రకారం సీఆర్ స్వతంత్ర సంస్థగా ఏర్పాటుచేశారు. తర్వాత కాలంలో అనేక మార్పులు జరిగాయి. అవసరమైన సందర్భంలో దేశరక్షణ కోసం సరిహద్దుల్లో త్రివిధ దళాలకు సహాయం చేస్తుంది సీఆర్
మొత్తం ఉద్యోగాలు: 789

పోస్టులవారీగా ఖాళీలు: సబ్ ఇన్ (స్టాఫ్ ఎస్ (రేడియోగ్రాఫర్)-8, అసిస్టెంట్ సబ్ ఇన్ (ఫార్మసిస్ట్)-84, హెడ్ (ఫిజియోథెరపీ అసిస్టెంట్/నర్సింగ్ అసిస్టెంట్)-88, హెడ్ (జూనియర్ ఎక్స్ అసిస్టెంట్)-84, కానిస్టేబుల్ (కుక్)-116, కానిస్టేబుల్ (సఫాయి కర్మచారి)-121 తదితరాలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, ఇంటర్, జీఎన్ ఫార్మసీ, పదోతరగతి, బీపీటీ, ఏఎన్ తదితరాలు. పోస్టును బట్టి వేర్వేరు అర్హతలు ఉన్నాయి. వివరాలు వెబ్ చూడవచ్చు.
 వయస్సు: ఎస్ పోస్టుకు 30 ఏండ్ల లోపు, ఏఎస్ పోస్టులకు 20-25 ఏండ్లలోపు, మిగిలిన పోస్టులకు 18-25 ఏండ్ల మధ్య ఉండాలి.
శారీరక ప్రమాణాలు

పురుషులు: ఎత్తు 170 సెం.మీ. ఛాతీ 80 సెం.మీ గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ. వ్యాకోచించాలి. 
మహిళలు: ఎత్తు 157 సెం.మీ. ఉండాలి. 
ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
ఎంపిక విధానం

స్టేజ్-1: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ). వీటిలో అర్హత సాధించినవారికి రాతపరీక్ష నిర్వహిస్తారు.
స్టేజ్-2: రాతపరీక్ష. దీన్ని 100 మార్కులకు నిర్వహిస్తారు. 
పార్ట్- ఏలో ఇది 50 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్, హిందీ/ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. 
పార్ట్-బీలో సంబంధిత ప్రొఫెషన్ ట్రేడ్ నుంచి ఇస్తారు. ఇది 50 మార్కులు. 
పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు.
ముఖ్యతేదీలు

దరఖాస్తు: ఆన్

చివరితేదీ: ఆగస్టు 31

రాతపరీక్ష తేదీ: 2020, డిసెంబర్ 20

వెబ్ http://crpf.gov.in


No comments:

Post a comment