Friday, 10 July 2020

ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో 393 ఉద్యోగాలు, ఎయిమ్స్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు, ఐఐటీ మద్రాస్‌ఆన్‌లైన్‌ బీఎస్సీ ప్రవేశాలు, ఎస్టీ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు.

ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో 393 ఉద్యోగాలు,

మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, అసిస్టెంట్‌ ఆఫీసర్స్‌, ఇతర పోస్టుల భర్తీకి రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌) నోటిఫికేషన్‌ విడుద చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 15లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. వివిధ విభాగాల్లో మొత్తం 393 పోస్టులను భర్తీ చేయనుంది. 

పోస్టులు: 393. ఇందులో.. ఆపరేటర్‌ ట్రైనీ (కెమికల్‌)-125, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ కెమికల్‌-60,  మేనేజ్‌మెంట్‌ ట్రైనీ మెకానికల్‌-48, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఇన్‌స్ట్రుమెంటేషన్‌-35, బాయిలర్‌ ఆపరేటర్‌-25, జూనియర్‌ ఫైర్‌మెన్‌-23, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఎలక్ట్రికల్‌-22, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ బాయిలర్‌-21, అసిస్టెంట్‌ ఆఫీసర్‌ (మార్కెటింగ్‌)-14, కెమికల్‌ ఇంజినీర్‌-10, మార్కెటింగ్‌ ఆఫీసర్‌-10 చొప్పు ఖాళీలు ఉన్నాయి. 

అర్హతలు: మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో బీఈ లేదా బీటెక్‌ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. మార్కెటింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు అగ్రికల్చర్‌లో బీటెక్‌ లేదా నాలుగేండ్ల వ్యవసాయ కోర్సు చేసి ఉండాలి. ఆపరేటర్‌ ట్రైనీ పోస్టులకు బీఎస్సీ కెమికల్‌ చేసి ఉండాలి. జూనియర్‌ ఫైర్‌మెన్‌, బాయిర్‌ ఆపరేటర్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత, సంబంధిత విభాగంలో సర్టిఫికెట్‌ ఉండాలి. అభ్యర్థులకు అనుభవం తప్పనిసరి.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ఎంపిక విధానం: రాతపరీక్ష

దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 15

రాత పరీక్ష: ఆగస్టు 14

ఫలితాల విడుదల: ఆగస్టు 24

వెబ్‌సైట్‌: rcfltd.com 
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిమ్స్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు,

భోపాల్‌లోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌-భోపాల్‌)లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అడిషనల్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 17లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అధికారిక వెబ్‌సైట్‌ aiimsbhopal.edu.inలో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.

పోస్టులు: 155 (అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-64, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-39, ప్రొఫెసర్‌-33, అడిషనల్‌ ప్రొఫెసర్‌-19)

అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. అనుభవం తప్పనిసరి. ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 58 ఏండ్లు, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 50 ఏండ్ల లోపు వయస్సు కలిగినవారై ఉండాలి. 

ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా. అభ్యర్థులు దరఖాస్తులో పేర్కొన్న అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వారిని ఇంటర్వూలకు పిలుస్తారు.   

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: రూ.2000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500/-   

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 17 

వెబ్‌సైట్‌: www.aiimsbhopal.edu.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ మద్రాస్‌ఆన్‌లైన్‌ బీఎస్సీ ప్రవేశాలు,

ప్రోగ్రామింగ్‌ & డాటాసైన్స్‌
ప్రపంచంలోనే మొదటిసారిగా ఆన్‌లైన్‌లో బీఎస్సీ కోర్సు. ఐఐటీల్లో చదవాలని ఉన్నా ఆ కోరిక తీరనివారికి అపూర్వ అవకాశం. వయస్సు, ప్రదేశంతో సంబంధం లేకుండా కేవలం నిర్ణీత అర్హతలు ఉన్నవారు ఎవరైనా ఈ కోర్సు చేయవచ్చు. ప్రస్తుతం అతివేగంగా విస్తరిస్తున్న డాటాసైన్స్‌, ప్రోగ్రామింగ్‌లో ఈ డిగ్రీని ఐఐటీ మద్రాస్‌ అందిస్తుంది.  2026 నాటికి సుమారు కోటిన్నర ఉద్యోగాలను సృష్టించబోయే ఈ రంగంలో ఈ కోర్సు చేయడం కేవలం జ్ఞానతృష్ణ తీర్చుకోవడమే కాదు, ఆకర్షణీయమైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఐఐటీ మద్రాస్‌ దీనికి సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేసిన నేపథ్యంలో ఆ కోర్సు వివరాలు నిపుణ పాఠకుల కోసం..

ప్రపంచంలోనే మొట్టమొదటి ఆన్‌లైన్‌ రెగ్యులర్‌ డిగ్రీకోర్సు
మూడు లెవల్స్‌లో కోర్సు
ఫౌండేషన్‌, డిప్లొమా, డిగ్రీ
ఐఐటీ మద్రాస్‌ సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తుంది
వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌, స్టూడెంట్స్‌ ఎవరైనా చేరవచ్చు


పోగ్రామింగ్‌ & డాటా సైన్స్‌:
ప్రస్తుతం వాణిజ్య రంగం, ప్రభుత్వంలో డాటా అనేది కీలకమవుతుంది. విస్తారమైన డాటా సిద్ధంగా ఉంది. రకరకాల ఇంటర్నెట్‌ అవుట్‌పుట్‌ల ద్వారా వచ్చిన డాటా, ఆయా వ్యక్తులు సృష్టించిన డాటానే కాకుండా వారు పలురకాల సర్వీసెస్‌తో అనుసంధానించిన సమయంలో ఏర్పడ్డ డాటాను విశ్లేషించి ఊహాజనిత మోడల్స్‌ను తయారుచేయాలి. దీనికి కంప్యూటింగ్‌, స్టాటిస్టిక్స్‌, మ్యాథ్స్‌లో నైపుణ్యం ఉండాలి. వీటన్నింటి సమాహారమే డాటాసైన్స్‌. 

ప్రస్తుతం డాటా సైంటిస్ట్‌ల కొరత ఉంది. మార్కెట్‌ అవసరాలకు తగ్గస్థాయిలో నిపుణులు లేరు. అయితే ప్రస్తుత క్లాస్‌రూమ్స్‌లో భవిష్యత్‌కు అవసరమైన నిపుణులను తయారుచేయడానికి చాలా సమయం పడుతుంది. ఈ కొరతను తీర్చడానికి ఆన్‌లైన టీచింగ్‌ ద్వారా అవసరమైన నిపుణులను తక్కువ సమయంలో ఎక్కువమందిని అందించడం ప్రధాన ఉద్దేశంగా ఈ కోర్సును ఐఐటీ మద్రాస్‌ రూపొందించినది. ఇదే సమయంలో డాటా సైంటిస్ట్‌ల స్కిల్స్‌ విషయంలో ఎటువంటి రాజీ లేకుండా నిపుణులను తయారుచేయడం ప్రధానమైన సవాల్‌. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా సుశిక్షుతులైన ప్రోగ్రామర్లను, అప్లికేషన్స్‌ అభివృద్ధిలో నిపుణులను, డాటా సైన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ నిపుణులను తయారుచేయడమే లక్ష్యం.
కోర్సు: బీఎస్సీ ఇన్‌ ప్రోగ్రామింగ్‌ అండ్‌ డాటా సైన్సెస్‌

ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌లో
ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌లో ఐఐటీ మద్రాస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దేశంలో ఇంజినీరింగ్‌ విభాగంలో ఐదేండ్లుగా మొదటిస్థానంలో ఉంది ఈ సంస్థ. అదేవిధంగా దేశంలో మొట్టమొదటిసారి 2001లో ఎన్‌పీటీఈఎల్‌ ఆన్‌లైన్‌ కంటెంట్‌ పోర్టల్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఈ పోర్టల్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ కోర్సు పోర్టల్‌. 2014లో ఎన్‌పీటీఈఎల్‌ ఆన్‌లైన్‌ కోర్సులను ప్రారంభించింది. దేశంలోని మొట్టమొదటి మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సు (మూక్‌)ను ఐఐటీఎం ప్రారంభించింది. 2017లో స్వయం మూక్‌, ప్రస్తుతం 2020లో ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించి వినూత్న విధానంలో నాణ్యమైన విద్యను దేశంలోని మారుమూల ప్రాంత విద్యార్థులకు సైతం అందిస్తుంది. 
టర్మ్‌ స్ట్రక్చర్‌
ప్రతి ఏడాదిని మూడు టర్మ్‌లుగా విభిజించి పాఠాలు బోధిస్తారు.
మొదటి టర్మ్‌ జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు
రెండో టర్మ్‌ మే నుంచి ఆగస్టు వరకు
మూడో టర్మ్‌ సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు ఉంటుంది.
ప్రతి టర్మ్‌లో నాలుగు కోర్సులను రిజిస్టర్‌ చేసుకోవచ్చు. అయితే ఎన్ని కోర్సులకు అనుమతించేది విద్యార్థి గతంలో చూపించిన ప్రతిభ ఆధారంగా నిర్ణయిస్తారు.
ఫౌండేషన్‌ పూర్తిచేస్తేనే డిప్లొమాకు అనుమతిస్తారు. డిప్లొమా పూర్తిచేసిన వారిని మాత్రమే డిగ్రీస్థాయికి అనుమతిస్తారు.
రికార్డెడ్‌ వీడియో కంటెంట్‌ను ప్రతి వారం విడుదల చేస్తారు. దీనిలో ఆయా కోర్సులకు సంబంధించిన వరుస పాఠాలను స్టెప్‌ బై స్టెప్‌ పద్ధతిలో అందిస్తారు.
ప్రతి వీడియో 15-30 నిడివి ఉంటుంది. ప్రతి వారానికి ఒక్కో కోర్సుకు 2-3 గంటల వీడియో కంటెంట్‌ ఉంటుంది.
అదేవిధంగా వారం వారం అసైన్‌మెంట్లను కూడా వీడియోలతోపాటే ఇస్తారు. వాటిని నిర్ణీత కాలవ్యవధిలో సబ్‌మిట్‌ చేయాలి.
మూడు క్విజ్‌లను నాలుగు, ఏడు, పదోవారంలో నిర్వహిస్తారు. 
అసెస్‌మెంట్స్‌
కోర్సులో జాయిన్‌ అయిన ప్రతి విద్యార్థిని మూడు రకాలుగా అసెస్‌ చేస్తారు. ఒకటి వారాంతం అసెస్‌మెంట్‌, రెండోది క్విజ్‌, మూడోది టర్మ్‌ ఎగ్జామ్స్‌ ద్వారా.
అర్హతలు 
రెగ్యులర్‌ ఎంట్రీ: పదోతరగతిస్థాయిలో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ చదివి ఉండాలి. ఇంటర్‌/తత్సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి.
ప్రస్తుతం డిగ్రీలో ప్రవేశం పొందినవారు లేదా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు లేదా డిగ్రీ చదువుతూ మానేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోట్‌: ఈసారి 2020లో ఇంటర్‌ ఉత్తీర్ణులైనవారు క్వాలిఫైర్‌ ఎగ్జామ్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. కానీ వారు కాలేజీలో డిగ్రీ ప్రవేశం పొంది ఉండాలి. విద్యార్థులు క్వాలిఫైర్‌ ప్రాసెస్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలి. 

కోర్సు స్ట్రక్చర్‌
ఫౌండేషన్‌ లెవల్‌

దీనిలో 8 కోర్సులు ఉంటాయి. ఎనిమిది నెలల నుంచి మూడేండ్లలోపు పూర్తిచేసుకోవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసినవారు తర్వాత స్థాయి అయిన డిప్లొమా చదవచ్చు. 
దీనిలో మ్యాథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, బేసిక్స్‌ ఆఫ్‌ ప్రోగ్రామింగ్‌ అండ్‌ పైథాన్‌, ఇంగ్లిష్‌ ఉంటాయి.
డిప్లొమా లెవల్‌

12 కోర్సులు ఉంటాయి. 12 నెలలు. మూడేండ్లలోపు పూర్తిచేసుకోవచ్చు. 
డిప్లొమా ఇన్‌ ప్రోగ్రామింగ్‌కు డాటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌, ప్రోగ్రామింగ్‌, డాటా స్ట్రక్చర్స్‌ అండ్‌ అల్గారిథమ్స్‌ను పైథాన్‌ ఉపయోగించి చేయాలి. మోడరన్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌, స్కిల్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ ఉంటాయి.
డిప్లొమా ఇన్‌ డాటాసైన్స్‌కు మెషిన్‌ లెర్నింగ్‌, లెర్నింగ్‌ థియరీ, లెర్నింగ్‌ ప్రాక్టీస్‌, బిజినెస్‌ డాటా మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌, స్కిల్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ ఉంటాయి.
డిగ్రీ లెవల్‌

దీనిలో 11 కోర్సులు ఉంటాయి. 12 నెలలు- మూడేండ్లలోపు కోర్సు పూర్తిచేసుకోవచ్చు. 
బీఎస్సీ (ప్రోగ్రామింగ్‌ అండ్‌ డాటా సైన్స్‌)

మొత్తం 31 కోర్సులు (ఫౌండేషన్‌, డిప్లొమా, డిగ్రీ లెవల్స్‌ అన్ని కలుపుకొని). 
116 క్రెడిట్స్‌ ఉంటాయి.
డిగ్రీని 3-6 ఏండ్లలోపు వారివారి సామర్థ్యాలను బట్టి పూర్తిచేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌ కోర్సెస్‌ &అసెస్‌మెంట్స్‌ 12 వారాలకు ఒక కోర్సు చొప్పున కోర్సు వర్క్‌ ఉంటుంది.
డిగ్రీస్థాయిలో కంప్యూటర్‌ సిస్టమ్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, ఏఐ,ఎంఎల్‌ తోపాటు స్ట్రాటజీస్‌ ఫర్‌ ప్రొఫెషనల్‌ గ్రోత్‌, స్కిల్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌, కంప్యూటర్‌ ఆర్కిటెక్చర్‌, డీప్‌లెర్నింగ్‌ ఉంటాయి. 
ఈ కోర్సు ప్రత్యేకత.. ఎవరు ఏ స్థాయి వరకు చాలనుకుంటే అక్కడ ఈ కోర్సును ఆపవచ్చు. వారికి ఆ స్థాయి సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తారు.  ఐటీ పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు రూపొందిన ఈ కోర్సు విద్యార్థులకు మాత్రమే కాక, వృత్తి నైపుణ్యాలను పెంచు కోవాలనుకునే ఐటీ ఉద్యోగులకూ ఉపయోగపడుతుంది. ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ భాస్కర్‌ రామమూర్తి 
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో (తేదీని ఇంకా ప్రకటించలేదు)

చివరితేదీ: సెప్టెంబర్‌ 15

కోర్సు ప్రారంభం: 2021, జనవరి 4 నుంచి

పూర్తి వివరాల కోసం

www.onlinedegree.iitm.ac.in

-----------------------------------------------------------------------------------------------------------------------------
ఎస్టీ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు.

గిరిజన గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకోసం సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమైందని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఇంటర్‌ ఫస్టియర్‌ ఆర్ట్స్‌, సైన్స్‌తోపాటు ఒకేషనల్‌ కోర్సుల్లో 7,040 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. టీటీడబ్ల్యుఆర్‌జేసీసెట్‌ ఫలితాల ఆధారంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు స్థానికతను బట్టి కేటాయించిన కళాశాలల్లో ప్రిన్సిపాళ్లు సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారని వివరించారు. ఈ ప్రక్రియ ఈ నెల 18 వరకు కొనసాగుతుందని చెప్పారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాలు, కంటైన్మెంట్‌ జోన్లలో నివసించే విద్యార్థులు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తర్వాత స్వయంగా హాజరు కావాలని, ముందుగా ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లను సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం tgtwgurukulam.telangana.gov.in ను సంప్రదించాలన్నారు.

No comments:

Post a comment