బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) స్పోర్ట్స్ కోటాలో 28 ఉద్యోగాలు,
బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) స్పోర్ట్స్ కోటాలో 28 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఆఫీసర్ పోస్టులు 14, క్లర్క్ పోస్టులు 14 ఉన్నాయి. జాతీయ స్థాయిలో క్రీడలు, చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న క్రీడాకారులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. ఆగస్టు 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
మొత్తం పోస్టులు: 28
ఆర్చరీ- ఆఫీసర్-2 పోస్టులు, క్లర్క్- 2 పోస్టులు
అథ్లెటిక్స్- ఆఫీసర్- 2, క్లర్క్-2
బాక్సింగ్- ఆఫీసర్-2, క్లర్క్-2
జిమ్నాస్టిక్స్- ఆఫీసర్-2
స్విమ్మింగ్- ఆఫీసర్-2, క్లర్క్-2
టేబుల్ టెన్నిస్- ఆఫీసర్-2
వెయిట్‌లిఫ్టింగ్- ఆఫీసర్-2, క్లర్క్-2
రెజ్లింగ్- ఆఫీసర్-2, క్లర్క్-2
అర్హతలు: ఆఫీసర్ పోస్టులకు డిగ్రీ పూర్తిచేయాలి. జాతీయ స్థాయి క్రీడల్లో ఏ, బీ, సీ విభాగాల్లో పాల్గొని ఉండాలి. అదేవిధంగా 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి.
క్లర్క్ పోస్టులకు పదో తరగతి పాసై, జాతీయ స్థాయి క్రీడల్లో డీ విభాగంలో పాల్గొని ఉండాలి. అదేవిధంగా 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం: ఆగస్టు 1
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 16
వెబ్సైట్: ibpsonline.ibps.in/boirospjul20
------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ)-132 నోటిఫికేషన్,
ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ)-132 నోటిఫికేషన్ విడుదలైంది.
టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ-132, జనవరి 2021లో ప్రారంభం)
-మొత్తం ఖాళీలు: 40
-విభాగాల వారీగా.. సివిల్-10, ఆర్కిటెక్చర్-1, మెకానికల్-3, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్&ఎలక్ట్రానిక్స్-4, సీఎస్ ఈసీఈ-6, ఏరోనాటికల్/ఏవియానిక్స్-2, ఏరోస్పేస్-1, న్యూక్లియర్ టెక్నాలజీ-1, ఆటోమొబైల్-1, లేజర్ టెక్నాలజీ-1, ఇండస్ట్రియల్/మ్యానుఫ్యాక్చరింగ్-1 ఖాళీ ఉన్నాయి.
-పేస్కేల్: రూ.56.100-1,77,500/- వీటికి అదనంగా ఇతర అలవెన్సులు, సౌకర్యాలు కల్పిస్తారు.
-అర్హతలు: అవివాహిత పురుష అభ్యర్థులు. సంబంధిత బ్రాంచీల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు లేదా ఫైనల్ ఇయర్ చదువుతూ 2020, జూలై 1 నాటికి కోర్సు పూర్తిచేసేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-వయస్సు: 2021, జనవరి 1 నాటికి 20- 27 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1994, జనవరి 2 నుంచి 2001, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
-ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్నవారిని షార్ట్ చేస్తారు. తర్వాత రెండు దశల్లో ఎంపిక ఉంటుంది. ఎస్ స్టేజ్-1, 2లను ఐదురోజులపాటు నిర్వహిస్తారు. స్టేజ్-1లో అర్హత సాధించినవారికి స్టేజ్-2 నిర్వహిస్తారు. దీనిలో ఎంపికైన వారికి వైద్యపరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
-శిక్షణ: డెహ్రడూన్ ఇండియన్ మిలిటరీ అకాడమీలో 49 వారాల శిక్షణనిస్తారు. శిక్షణ విజయవంతం అయిన వారికి లెఫ్టింనెట్ హోదాలో ఆర్మీలో ఉద్యోగాన్ని ఇస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ.56,100/- స్టయిఫండ్ ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్
-చివరితేదీ: ఆగస్టు 26
-వెబ్ www.joinindianarmy.nic.in
------------------------------------------------------------------------------------------------------------------
సీడీఎస్-2 నోటిఫికేషన్,
త్రివిధ దళాల్లోని వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి సంబంధిచిన కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ (సీడీఎస్) ఎగ్జామ్-2 నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 344 పోస్టులను భర్తీ చేయనుంచి. ఆన్లైన్ దరఖాస్తులు ప్రక్రియ ఈరోజు (ఆగస్టు 5) సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 25న ముగుస్తుందని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని యూపీఎస్సీ ప్రకటించింది. సీడీఎస్ పరీక్షను యూపీఎస్సీ ప్రతి ఏడాది రెండుసార్లు నిర్వహిస్తుంది.
మొత్తం పోస్టులు: 344. ఇందులో..
ఇండియన్ మిలటరీ అకాడమీ, డెహ్రాడూన్- 100 పోస్టులు
ఇండియన్ నావల్ అకాడమీ, ఎజిమల- 26 పోస్టులు
ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్- 32 పోస్టులు
ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ, చెన్నై (మెన్)- 196
ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ, మద్రాస్ (ఉమెన్)- 17
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 25
దరఖాస్తులకు ఉపసంహరణ: సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు
అడ్మిట్ కార్డుల డౌన్లోడ్: పరీక్షకు మూడు వారాల ముందు
వెబ్సైట్: http://upsc.gov.in
------------------------------------------------------------------------------------------------------------------
బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లో కన్సల్టెంట్స్, స్పెషలిస్ట్, అనలిస్ట్ 39 ఉద్యోగాలు,
వివిధ విభాగాల్లో ఖాళీగా పోస్టుల భర్తీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా కన్సల్టెంట్స్, స్పెషలిస్ట్, అనలిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆర్బీఐ వెల్లడించింది.
మొత్తం పోస్టులు: 39
అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తిచేసి ఉండాలి. అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 26
దరఖాస్తుల ప్రింటింగ్‌కు చివరితేదీ: సెప్టెంబర్ 6
అప్లికేషన్ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100
ఎంపిక విధానం: ప్రిలిమినరీ స్క్రీనింగ్ ద్వారా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం వారిని ఇంటర్య్వూకి పిలుస్తారు.
వెబ్సైట్: rbi.org.in
------------------------------------------------------------------------------------------------------------------
యూపీఎస్సీ సైంటిఫిక్ ఆఫీసర్, లెక్చరర్ 24 ఉద్యోగాలు,
వివిధ కేంద్రప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిఫిక్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 24 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దరఖాస్తులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయని, అధికారిక వెబ్సైట్ upsconline.nic.in; upsc.gov.inలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వెల్లడిచింది.
మొత్తం పోస్టులు: 24
ఇందులో సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు- 1, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు-14, లెక్చరర్ (ఫిజియోథెరపీ, ప్రొస్తెటిక్స్, ఆర్ధోటిక్స్, ఒకేషనల్ గైడెన్స్)- 7, సబ్-ఎడిటర్-2 పోస్టుల చొప్పున ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తిచేసి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. అభ్యర్థులు అప్లికేషన్లనో నింపిన విద్యార్హతల ద్వారా వారిని ఎంపికచేసి, ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.25, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 10
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 27
పూర్తివివరాలకు: upsconline.nic.in; upsc.gov.in
------------------------------------------------------------------------------------------------------------------
ఎయిమ్స్‌లో 3803 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు.
ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) దేశవ్యాప్తంగా వివిధ ఎయిమ్స్‌లలో ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. దీనికి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్ఓఆర్సీటీ)-2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.
మొత్తం పోస్టులు: 3803
ఇందులో ఎయిమ్స్ న్యూఢిల్లీలో 597 పోస్టులు, భువనేశ్వర్ 600, డియోగఢ్ 150, ఘోరక్పూర్ 100, జోధ్‌పూర్ 176, కల్యాణి 600, మంగళగిరి 140, పట్నా 200, రాయబరేలి 594, రాయ్‌పూర్ 246, రిషికేశ్ 300 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హత: బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి ఉండాలి. 18 నుంచి 30 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా. పరీక్ష మూడు గంటలు ఉంటుంది. ఇందులో 300 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 మార్కులు. ప్రతి తప్పు ప్రశ్నకు 1/3 వంతు మార్కులను కోతవిధిస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ.1500, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1200.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 18
పరీక్ష తేదీ: సెప్టెంబర్ 1
వెబ్సైట్: aiimsexams.org