డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) మహిళల కోసం స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని ప్రకటించింది.
-మొత్తం స్కాలర్షిప్స్: 30
-(గ్రాడ్యుయేట్- 20, పోస్ట్ గ్రాడ్యుయేట్-10)
-ఎవరి కోసం: అంతరిక్షం సహా వైమానిక రంగాల్లో మహిళలను ప్రోత్సహించే ఉద్దేశంతో దీన్ని రూపొందించారు. ఈ స్కీమ్‌కి ఏరోనాటిక్స్ రిసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ బోర్డు సహకారం అందిస్తుంది.
-విభాగాలు: ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంజనీరింగ్ అండ్ రాకెట్రీ, ఏవియానిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్.
-అర్హతలు: గ్రాడ్యుయేట్ లెవల్‌కు జేఈఈ (మెయిన్)లో అర్హత స్కోరు సహా బీఈ/బీటెక్ / బీఎస్సీ (ఇంజినీరింగ్) కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవల్‌కు గేట్ అర్హత స్కోర్‌తో సహా ఎంఈ/ఎంటెక్/ ఎమ్మెస్సీ (ఇంజినీరింగ్) కోర్సులో చేరి ఉండాలి. డిగ్రీలో 60 శాతం మార్కులు తప్పనిసరి. డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో చేరినవారు, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ అభ్యర్థులు కూడా ఈ స్కీమ్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఎంపిక విధానం: గ్రాడ్యుయేట్ లెవల్‌కు జేఈఈ (మెయిన్) స్కోరు ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవల్‌కు గేట్ స్కోర్ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
స్కాలర్షిప్:
-గ్రాడ్యుయేషన్ లెవల్లో నాలుగేళ్లపాటు ఏడాదికి రూ.1,20,000 ఇస్తారు.
-పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవల్లో రెండేళ్లపాటు నెలకు రూ.15,500 ఇస్తారు.
-నోట్: డ్యూయెల్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ చేసేవారికి మొదటి నాలుగేళ్లు మాత్రమే గ్రాడ్యుయేట్ లెవల్ స్కాలర్షిప్ ఇస్తారు. దీంతోపాటు డీఆర్డీఓ, ఏఆర్డీబీ సంస్థల్లో కోర్సుకు సంబంధించిన ప్రాజెక్టు పనులు చేసుకొనే సౌకర్యం కల్పిస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 30
వెబ్సైట్: www.drdo.gov.in
-----------------------------------------------------------------------------------------------------------------------
ఓయూ దూరవిద్య నోటిఫికేషన్ విడుదల,
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దూరవిద్యా విధానంలో డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు పీజీ డిప్లొమా కోర్సులు చేయాలనుకునేవారి కోసం దూరవిద్య ప్రవేశాలకు ప్రొ. జీ రామ్‌రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో బీఏ, బీకామ్, బీబీఏ, ఎంబీఏ, ఎసీఏ, ఎంఏ, ఎమ్మెస్సీ, డిప్లొమా కోర్సులు ఉన్నాయి. వీటికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 1న ప్రారంభమవుతుందని, అక్టోబర్ 31 వరకు అప్లయ్ చేసుకోవచ్చని తెలిపింది.
కోర్సులు, అర్హతలు
ఎంబీఏ (రెండేండ్లు), ఎంబీఏ (మూడేండ్లు)
అర్హత: డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అదేవిధంగా టీఎస్ఐసెట్ లేదా ఏపీఐసెట్‌లో అర్హత సాధించి ఉండాలి. లేదా పీజీఆర్ఆర్సీడీఈ నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ
ఎంఏ- ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్ కోర్సులు ఉన్నాయి.
ఎంఏ లాంగ్వేజెస్- ఉర్దూ, హిందీ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్
ఎంఏ- ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, చరిత్ర, సైకాలజీ
అర్హతలు: సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
ఎంకామ్, ఎమ్మెస్సీ (మ్యాథమెటిక్స్), ఎమ్మెస్సీ (స్టాటిస్టిక్స్)
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
బీఏ
అర్హతలు: ఇంటర్లో పాసై ఉండాలి.
బీఏ- మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్
అర్హతలు: ఇంటర్లో మ్యాథ్స్ ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా చదివి ఉండాలి.
బీకామ్ (జనరల్)- ఇంటర్ పూర్తిచేసి ఉండాలి.
పీజీ డిప్లొమా- మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, బయో ఇన్ఫర్మాటిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్
అర్హతలు: డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
బయోఇన్ఫర్మాటిక్స్ కోర్సు కోసం బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఫార్మసీ, బీవీఎస్సీ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎమ్మెస్, బీఈ కోర్సులో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 1 నుంచి
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 31
వెబ్సైట్: www.oucde.net
-----------------------------------------------------------------------------------------------------------------------
క్యాట్-2020 నోటిఫికేషన్ విడుదల.
దేశంలోని 6 వందలకు పైగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశాలకోసం నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2020 నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఐఐఎంలలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఐఐఎం-ఇండోర్ ప్రకటించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు 5న ప్రారంభమై, సెప్టెంబర్ 16 వరకు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక క్యాట్‌ను ఐఐఎం ఇండోర్ నిర్వహించనుంది. ప్రవేశ పరీక్ష నవంబర్ 29న జరగనుంది. అడ్మిట్ కార్డులను అక్టోబర్ 28 నుంచి పరీక్ష తేదీవరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు క్యాట్‌కు సంబంధించిన వివరాలకోసం అధికారిక వెబ్సైట్ iimcat.ac.inలో ఎప్పటికప్పుడు చెక్‌చేసుకోవాలని తెలిపింది.
క్యాట్ పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్, డాటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష మొత్తం మూడు గంటలపాటు ఉంటుంది. ప్రతి ఏడాది ఈ ప్రవేశపరీక్షను 2 లక్షలకుపైగా విద్యార్థులు రాస్తారు. మొత్తం 156 నగరాల్లో ఈ ప్రవేశపరీక్షను నిర్వహిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 5
అప్లికేషన్స్‌కు చివరి తేదీ: సెప్టెంబర్ 16
అడ్మిట్‌కార్డ్ డౌన్లోడ్: అక్టోబర్ 28
పరీక్ష తేదీ: నవంబర్ 29
వెబ్సైట్: iimcat.ac.in
No comments:
Post a comment