Wednesday, 26 August 2020

ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 107 ఉద్యోగాలు, నేష‌న‌ల్ సీడ్స్ కార్పొరేష‌న్‌లో 220 ట్ర‌యినీ పోస్టులు, ఓఎన్‌జీసీలో మెడిక‌ల్ ఆఫీస‌ర్లు ఉద్యోగాలు, నైవేలీ లిగ్నైట్ కార్పొరేష‌న్‌లో అప్రెంటిస్‌లు.

 ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 107 ఉద్యోగాలు,


డెహ్రాడూన్‌లోని అట‌వీ ప‌రిశోధ‌నా సంస్థ (ఎఫ్ఆర్ఐ) వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హులైన‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 107 పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నుంది. ఇందులో లైబ్రెరీ ఇన్ఫ‌ర్మేష‌న్ అసిస్టెంట్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫ‌ర్‌, మ‌ల్టీటాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్‌) పోస్టులు ఉన్నాయి. సెప్టెంబ‌ర్ 17 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని, అధికారిక వెబ్‌సైట్ frirecruitment.icfre.gov.inలో ద‌ర‌ఖాస్తులు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. 


మొత్తం పోస్టులు: 107


ఇందులో టెక్నిక‌ల్ అసిస్టెంట్‌-62, మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌-40, స్టెనోగ్రాఫ‌ర్‌-4, లైబ్రెరీ ఇన్ఫ‌ర్మేష‌న్‌ అసిస్టెంట్-1 చొప్పున ఖాళీలు ఉన్నాయి. 


అర్హ‌త‌లు: ‌లైబ్రెరీ అసిస్టెంట్ పోస్టుకు లైబ్రెరీ సైన్స్‌లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 


టెక్నిక‌ల్ అసిస్టెంట్‌కు సైన్స్ స‌బ్జెక్టుల‌తో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 


స్టెనోగ్రాఫ‌ర్ పోస్టుకు ఇంట‌ర్ పాసై ఉండాలి, అదేవిధంగా ఇంగ్లిష్ లేదా హిందీలో నిమిషానికి 80 ప‌దాలు టైప్‌చేసే సామ‌ర్థ్యం, కంప్యూట‌ర్ అప్లికేష‌న్ కోర్సు స‌ర్టిఫికెట్ ఉండాలి. 


మ‌ల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టుల‌కు ప‌దోత‌ర‌గ‌తి పాసై ఉండాలి. 


వ‌య‌స్సు: టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టుకు 21 నుంచి 30 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న‌వారై ఉండాలి. మిగిలిన పోస్టుల‌కు 18 నుంచి 27 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉండాలి. 


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ‌సెప్టెంబ‌ర్ 17‌ 


వెబ్‌సైట్‌: frirecruitment.icfre.gov.in

---------------------------------------------------------------------------------------------------------------------

నేష‌న‌ల్ సీడ్స్ కార్పొరేష‌న్‌లో 220 ట్ర‌యినీ పోస్టులు,


నేష‌న‌ల్ సీడ్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎన్ఎస్‌సీఎల్‌)లో వివిధ విభాగాల్లో ట్ర‌యినీ పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన ద‌ర‌ఖాస్తుల గ‌డువును పొడిగించింది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్ indiaseeds.com ద్వారా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 220 ట్ర‌యినీ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. 


మొత్తం ట్ర‌యినీలు: 220


పోస్టుల వారీగా వివ‌రాలు


అసిస్టెంట్ (లీగ‌ల్‌): 3


మేనేజ్‌మెంట్ ట్ర‌యినీ: 39 (ప్రొడ‌క్ష‌న్‌-16, హార్టీక‌ల్చ‌ర్‌-1, మార్కెటింగ్-7, హెచ్ఆర్‌-2, అగ్రిక‌ల్చ‌ర్ ఇంజినీర్‌-4, సివిల్ ఇంజినీర్‌-1, క్వాలిటీ కంట్రోల్‌-2, మెటీరియ‌ల్ మేనేజ్‌మెంట్-3)


సీనియ‌ర్ ట్ర‌యినీ-59 (అగ్రిక‌ల్చ‌ర్‌-29, ప్లాంట్ ప్రొటెక్ష‌న్‌-3, హార్టిక‌ల్చ‌ర్‌-1, మార్కెటింగ్‌-10, హెర్‌-5, క్వాలిటీ కంట్రోల్‌-1, అకౌంట్స్‌-5)


డిప్లొమా ట్ర‌యినీ- 7 (అగ్రిక‌ల్చ‌ర్ ఇంజినీరింగ్‌-4, ఎల‌క్రిక‌ల్‌-3)


ట్ర‌యినీ- 104 (అగ్రిక‌ల్చ‌ర్‌-18, మార్కెటింగ్‌-17, అగ్రిక‌ల్చ‌ర్ స్టోర్స్‌-6, ప‌ర్చేజ్‌-2, టెక్నీషియ‌న్‌-27, స్టోర్స్ ఇంజినీరింగ్‌-9, స్టెనోగ్రాఫ‌ర్‌-13, క్వాలిటీ కంట్రోల్‌-3, డాటా ఎంట్రీ ఆప‌రేట‌ర్-3, అకౌంట్స్‌-6)


ట్ర‌యినీ మేట్‌-3 


అర్హ‌త‌లు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. లీగ‌ల్ అసిస్టెంట్ పోస్టుకు 30 ఏండ్ల‌లోపు, ట్ర‌యినీ మేట్‌కు 25 ఏండ్ల‌లోపు, మిగిలిన పోస్టుల‌కు 27 ఏండ్ల లోపు ఉండాలి. 


ప‌నిచేయాల్సిన ప్ర‌దేశాలు: న‌్యూఢిల్లీలోని కార్పొరేట్ ఆఫీస్‌, దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాల‌యాలు


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ఆగ‌స్టు 31


వెబ్‌సైట్‌: indiaseeds.com

---------------------------------------------------------------------------------------------------------------------

ఓఎన్‌జీసీలో మెడిక‌ల్ ఆఫీస‌ర్లు ఉద్యోగాలు,

మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ఆయిల్ అండ్ నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. సెప్టెంబ‌ర్ 8 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌‌ని తెలిపింది. ఇందులో ఫీల్డ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు ఉన్నాయి. 

మొత్తం పోస్టులు: 19

జ‌న‌ర‌ల్ డ్యూటీ ఆఫీస‌ర్‌- 6 పోస్టులు, ఫీల్డ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌-12, మెడిక‌ల్ ఆఫీస‌ర్-1 పోస్టు ఉన్నాయి. 

అర్హ‌త‌లు: ఎంబీబీఎస్ పూర్తిచేసి, ఇండియ‌న్ మెడిక‌ల్ కౌన్సిల్‌లో త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట‌రై ఉండాలి. 

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మార్కులు, ఇంట‌ర్వ్యూ ఆధారంగా. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా. నిర్ణీత న‌మూనాలో ద‌ర‌ఖాస్తును పూర్తిగా నింపి ఈ-మెయిల్‌కు పంపాల్సి ఉంటుంది. 

ప‌నిచేయాల్సిన ప్ర‌దేశం: గుజ‌రాత్‌లోని భరూచ్ జిల్లా అంక‌లేశ్వ‌ర్‌లో 

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ‌సెప్టెంబ‌ర్ 8

ఈ-మెయిల్‌: khatri_ashok@ongc.co.in
---------------------------------------------------------------------------------------------------------------------
నైవేలీ లిగ్నైట్ కార్పొరేష‌న్‌లో అప్రెంటిస్‌లు.

ప‌్ర‌భుత్వరంగ సంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎన్ఎల్‌సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న‌ అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హులైన‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 75 అప్రెంటిస్ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. 

మొత్తం అప్రెంటిస్‌లు: 75

ఇందులో ఫిట్ట‌ర్ ఫ్రెష‌ర్‌- 20 ఖాళీలు, ఎల‌క్ట్రిష‌న్‌- 20, వెల్డ‌ర్‌- 20, మెడిక‌ల్ ల్యాబ్ టెక్నీషియ‌న్ (పాథాల‌జీ)- 10, మెడిక‌ల్ ల్యాబ్ టెక్నీషియ‌న్ (రేడియాల‌జీ)- 5 చొప్పున ఉన్నాయి. 

అర్హ‌త‌లు: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై, సంబంధిత ట్రేడ్‌లో రెండేండ్ల‌ ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. 

స్త‌యిఫండ్‌: నెల‌కు రూ.8,766 నుంచి రూ.10,019

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: ఆగ‌స్టు 25

ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ల‌కు చివ‌రి తేదీ: సెప్టెంబ‌ర్ 10  

వెబ్‌సైట్‌: www.nlcindia.com

No comments:

Post a comment