Wednesday, 26 August 2020

యానిమ‌ల్ హ‌స్బెండ‌రీ కార్పొరేష‌న్‌లో 3348 ఉద్యోగాలు, స్పెషల్‌ డిఫెన్స్‌లో 534 ఉద్యోగాలు, యూపీఎస్సీ గ్రేడ్‌-3 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టులు.

 యానిమ‌ల్ హ‌స్బెండ‌రీ కార్పొరేష‌న్‌లో 3348 ఉద్యోగాలు,


భార‌తీయ ప‌శుపోష‌న్ నిగ‌మ్ లిమిటెడ్ (యానిమ‌ల్ హ‌స్బెండ‌రీ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌)-బీపీఎన్ఎల్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 3348 పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నుంది. ఇందులో సేల్స్ అసిస్టెంట్, సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, సేల్స్ మేనేజర్ వంటి పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఆగస్టు 31 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది.  


మొత్తం పోస్టులు- 3348


ఇందులో సేల్స్ అసిస్టెంట్- 2700, సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్- 540, సేల్స్ మేనేజర్- 108 చొప్పున ఖాళీలు ఉన్నాయి.  


అర్హత: సేల్స్ అసిస్టెంట్ పోస్టుకు 10వ తరగతి, సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుకు ఇంటర్మీడియట్, సేల్స్ మేనేజర్ పోస్టుకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.


వయస్సు: సేల్స్ అసిస్టెంట్, సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులకు 21 నుంచి 40 ఏండ్లు, సేల్స్ మేనేజర్ పోస్టుకు 25 నుంచి 45 ఏండ్లు ఉండాలి. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో


ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా 


దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్ 31 


వెబ్‌సైట్‌: www.bharatiyapashupalan.com

-----------------------------------------------------------------------------------------------------------------------

స్పెషల్‌ డిఫెన్స్‌లో 534 ఉద్యోగాలు,


స్పెషల్‌ డిఫెన్స్‌ పర్సనల్‌ ఫోరం కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 534

విభాగాలవారీగా ఖాళీలు: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌-37, వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌-35, గ్రాంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌-49, మెడికల్‌ ఆఫీసర్‌-10, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌-58, సెక్యూరిటీ అసిస్టెంట్‌-44, బారియర్‌ గార్డ్‌-77, ల్యాబ్‌ టెక్నీషియన్‌-5, ఫైర్‌మెన్‌-15, ఎలక్ట్రీషియన్‌-39, వాల్వ్‌మెన్‌/ప్లంబర్‌-21, డ్రైవర్‌-35, కుక్‌-37, టేబుల్‌ బాయ్‌-35, సఫాయి కర్మచారి-37 ఉన్నాయి.

వేర్వేరు పోస్టులకు వేర్వేరు అర్హతలు, వయస్సు ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు. 

ఎంపిక: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌, వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌, మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది. ఎల్‌డీసీ రాతపరీక్ష, టైపింగ్‌, ఇతర పోస్టులకు రాతపరీక్ష, ట్రేడ్‌టెస్ట్‌, ఇంటర్వ్యూ ఉంటాయి. 

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో


చివరితేదీ: సెప్టెంబర్‌ 25


వెబ్‌సైట్‌: http://www.specialdefence.com


నోట్‌: స్పెషల్‌ డిఫెన్స్‌ పర్సనల్‌ ఫోరాన్ని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, పారామిలిటరీ దళాల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థ. 

-----------------------------------------------------------------------------------------------------------------------

యూపీఎస్సీ గ్రేడ్‌-3 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టులు.

వివిధ కేంద్ర ప్ర‌భుత్వం శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా గ్రేడ్‌-3 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. వీటికి సంబంధించిన ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు నేటి నుంచి ప్రారంభ‌మ‌య్యాయి. సెప్టెంబ‌ర్ 10 వ‌ర‌కు అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in ద్వారా అప్ల‌య్ చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. 

మొత్తం పోస్టులు: 35

ఇందులో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌-24, రిసెర్చ్ ఆఫీస‌ర్‌-1, సీనియ‌ర్ సైంటిఫిక్ ఆఫీస‌ర్‌-3, జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్-7 చొప్పున పోస్టులు ఉన్నాయి. 

అర్హ‌త‌లు: అసిస్టెంట్ ఫ్రొఫెస‌ర్ పోస్టుకు ఎంబీబీఎస్‌తోపాటు న‌్యూరాల‌జీలో పీజీ చేసి, మూడేండ్ల టీచింగ్ అనుభ‌వం ఉండాలి. 

రిసెర్చ్ ఆఫీస‌ర్‌కు ఆంథ్రోపాల‌జీలో ఎండీ చేసి ఉండాలి, సోష‌ల్ రిసెర్చ్‌లో మూడేండ్ల అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి. 

సీనియ‌ర్ సైంటిఫిక్ ఆఫీస‌ర్‌కు సైకాల‌జీ లేదా క్రిమినాల‌జీలో ఎండీ, సంబంధిత రంగంలో మూడేండ్ల అనుభ‌వం ఉండాలి.

జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుకు హోమియోప‌తిలో డిగీ్ర చేసిఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: ‌సెప్టెంబ‌ర్ 10

పూర్తి వివ‌రాల‌కు: upsconline.nic.in

1 comment: