Monday, 17 August 2020

బీఈఎల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు, రైల్వేలో 432 అప్రెంటిస్ పోస్టులు,హెచ్ఏఎల్‌లో 2 వేల అప్రెంటిస్‌, విజిటింగ్ ఫ్యాక‌ల్టీ ఉద్యోగాలు

 బీఈఎల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు

కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ ప‌రిధిలోని భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్‌) మెడిక‌ల్ డివైజెస్ విభాగంలో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వార 60 ఉద్యోగాల‌ను భ‌ర్తీచేయ‌నుంది. ఆన్‌లైన్ అప్లికేష‌న్లు ఈనెల 26 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయని, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. 


మొత్తం ఖాళీలు: 60


ఇందులో జ‌ర‌ల్-23 పోస్టులు, ఈడ‌బ్ల్యూఎస్-6, ఓబీసీ-17, ఎస్సీ-9, ఎస్టీ-5 చొప్పున పోస్టులు ఉన్నాయి. 


అర్హ‌త‌: ఎల‌క్ట్రానిక్స్ లేదా ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ లేదా ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలిక‌మ్యూనికేష‌న్ లేదా క‌మ్యూనికేష‌న్ లేదా మెకానిక‌ల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ లేదా ఇన్‌స్ట్రుమెంటేష‌న్ లేదా మెడిక‌ల్ ఎల‌క్ట్రానిక్స్ లేదా మెడిక‌ల్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌లో బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్ మొద‌టి శ్రేణిలో ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి. 28 ఏండ్ల లోపువారై ఉండాలి. ప్ర‌భుత్వ నిబంధ‌నల ప్ర‌కారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు వ‌యోప‌రిమితిలో సడ‌లింపు ఉంటుంది. 


ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ. విద్యార్హ‌త‌, అనుభ‌వం ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఎంపికైన వారిని ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు. 


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో


అప్లికేష‌న్ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు. 


పూర్తి వివ‌రాల‌కు ఈ-మెయిల్ hrcompsem@bel.co.in లేదా 080 -22195606 నంబ‌ర్‌లో సంప్ర‌థించ‌వచ్చు. 



వెబ్‌సైట్‌: http://bel-india.in

---------------------------------------------------------------------------------------------------------------------

రైల్వేలో 432 అప్రెంటిస్ పోస్టులు,

బిలాస్‌పూర్ కేంద్రంగా ప‌నిచేస్తున్న సౌత్ ఈస్ట్ సెంట్ర‌ల్ రైల్వేలో 432 అప్రెంటిస్ సీట్ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. అర్హులైన‌, ఆస‌క్తి క‌లిగి అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. ద‌ర‌ఖాస్తులు అధికారిక వెబ్‌సైట్ apprenticeshipindia.org.లో అందుబాటులో ఉన్నాయ‌ని, ఆగ‌స్టు 30 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. 


మొత్తం అప్రెంటిస్‌లు: 432


ఇందులో కోపా-102, స్టెనోగ్రాఫ‌ర్ (హిందీ, ఇంగ్లిష్‌)-56, ఫిట్ట‌ర్‌- 91, ఎల‌క్ట్రీషియ‌న్‌‌-56, వైర్‌మెన్‌56, ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌-7, ఆర్ఏసీ మెకానిక్‌-7, వెల్డ‌ర్‌- 45, ప్లంబ‌ర్‌-11, మేస‌న్‌-11, పెయింట‌ర్‌- 6, కార్పెంట‌ర్-11, మెషినిస్ట్‌-6, ట‌ర్న‌ర్‌-11, షీట్‌మెట‌ల్ వ‌ర్క‌ర్‌-11 చొప్పున ఉన్నాయి. 


అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తోపాటు, స‌ంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. 2020 జూలై 1 నాటికి 15 నుంచి 24 ఏండ్ల లోపువారై ఉండాలి. 


ఎంపిక‌విధానం: మెరిట్ ఆధారంగా


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ఆగ‌స్టు 30


వెబ్‌సైట్‌: https://apprenticeshipindia.org


---------------------------------------------------------------------------------------------------------------------

హెచ్ఏఎల్‌లో 2 వేల అప్రెంటిస్‌, విజిటింగ్ ఫ్యాక‌ల్టీ ఉద్యోగాలు


హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్‌)లో ట్రేడ్ అప్రెంటిస్‌, విజిటింగ్ ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి టెక్నిక‌ల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెచ్ఏఎల్ నోటిఫికేష‌న్ విడుదల చేసింది. ఆస‌క్తి,  అనుభ‌వం ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 2 వేల పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నుంది. ద‌ర‌ఖాస్తులు అధికారిక వెబ్‌సైట్‌ tti@hal-india.co.in ఉన్నాయ‌ని తెలిపింది. 


మొత్తం పోస్టులు: 2000


అర్హ‌త‌లు: విజిటింగ్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు సంబంధిత స‌బ్జెక్టులో ఎన్ఏసీ లేదా డిప్లొమా లేదా డిగ్రీ పూర్తిచేసి, క‌నీసం బోధ‌నా రంగంలో ప‌దేండ్ల అనుభ‌వం ఉండాలి. 


ట్రేడ్ అప్రెంటిస్‌ల‌కు గుర్తింపుపొందిన యూనివ‌ర్సిటీ నుంచి డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణుల‌వ్వాలి. కోర్సు ముగిసిన త‌ర్వాత రెండేండ్ల అనుభ‌వం ఉండాలి. 


ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ: ఆన్‌లైన్‌


ద‌ర‌ఖాస్తుల‌కు చివరితేదీ: సెప్టెంబ‌ర్ 5


వెబ్‌సైట్‌: tti@hal-india.co.in

No comments:

Post a comment