Monday, 17 August 2020

ఇండియ‌న్ ఆర్మీలో టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్‌, నీరీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు, హైదరాబాద్‌ ఎన్‌ఐఎన్‌లో ఉద్యోగాలు, బీఎస్సీ టెక్స్‌టైల్స్‌ అండ్‌ ఎంబీఏ ప్రవేశాలు.

 ఇండియ‌న్ ఆర్మీలో టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్‌,


ఇంట‌ర్ అర్హ‌త‌తో ఇండియ‌న్‌ ఆర్మీలోకి ప్ర‌వేశించాల‌నుకునేవారికి స‌ద‌వ‌కాశం. 10+2 అర్హ‌త‌తో టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్ (టీఈఎస్ 44) నోటిఫికేష‌న్‌ను ఇండియ‌న్ ఆర్మీ విడుద‌ల‌చేసింది. మ్యాథ్స్‌, ఫిజిక్స్ కెమిస్ట్రీ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్‌లో 70 శాతం మార్కులు సాధించిన‌‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఆన్‌లైన్ అప్లికేష‌న్లు సెప్టెంబ‌ర్ 9 వ‌ర‌కు చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. కోర్సు విజ‌య‌వంతంగా పూర్తిచేసిన‌వారికి లెఫ్టినెంట్ హోదా క‌ల్పిస్తారు. అవివాహిత పురుష అభ్య‌ర్థులు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. అభ్య‌ర్థులు 2001, జూలై 2 నుంచి 2004, జూలై 1 మ‌ధ్య జ‌న్మించిన‌వారై ఉండాల‌ని పేర్కొంది.


అభ్య‌ర్థుల‌కు స‌ర్వీస్ సెలెక్ష‌న్ బోర్డు (ఎస్ఎస్‌బీ) నిర్వ‌హించే ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌చేస్తారు. ఎంఓడీ ప‌రీక్ష‌లో వ‌చ్చిన మార్కుల ఆధారంగా అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు. ఇంట‌ర్వ్యూని అల‌హాబాద్‌, భోపాల్‌, బెంగ‌ళూరు, క‌పుర్త‌లాలో ఐదు రోజుల‌పాటు నిర్వ‌హిస్తారు. ఇందులో అభ్య‌ర్థుల మాన‌సిక‌, శారీర‌క సామ‌ర్థ్యాన్ని ప‌రీక్షిస్తారు. దీని ఆధారంగా కోర్సుకు ఎంపిక‌చేస్తారు. ‌


కోర్సు మొత్తం ఐదేండ్ల కాల‌ప‌రిమితి క‌లిగి ఉంటుంది. ఇందులో ఏడాదిపాటు గ‌యాలోని ట్రెయినింగ్ అకాడ‌మీలో ప్రాథ‌మిక మిల‌ట‌రీ శిక్ష‌ణ అంది‌స్తారు. సీఎంఈ పుణె లేదా ఎంసీటీఈ మ‌హౌ లేదా ఎంసీఈఎంఈ సికింద్రాబాద్‌లో మూడేండ్ల‌పాటు ప్రీ క‌మిష‌న్ ట్రెయినింగ్ ఉంటుంది. అదేవిధంగా ఏడాదిపాటు క‌మిష‌న్ శిక్ష‌ణ అందిస్తారు. ప‌రీక్ష‌ను విజ‌యవంతంగా పూర్తిచేసిన‌వారికి ఇంజినీరింగ్ డిగ్రీ అందిస్తారు.

--------------------------------------------------------------------------------------------------------------------

నీరీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు,


హైద‌రాబాద్‌లోని తార్నాక కేంద్రంగా ప‌నిచేస్తున్న నేష‌న‌ల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (నీరీ) వివిధ ప్రాజెక్టుల్లో భాగంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తికి అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆవ్వానిస్తున్న‌ది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 10 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. దర‌ఖాస్తుల‌ను ఈనెల 24వ తేదీలోపు పంపించాల‌ని వెల్ల‌డించింది. 


మొత్తం పోస్టులు: 10


ఇందులో ప‌్రాజెక్టు అసిస్టెంట్-8 పోస్టులు, ప్రాజెక్ట్ అసిస్టెంట్-1- 2 పోస్టులు ఉన్నాయి. 


అర్హ‌త‌లు: ప‌్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల‌కు బీఎస్సీ బాట‌నీ లేదా జువాల‌జీ లేదా బ‌యోటెక్నాల‌జీ లేదా కెమిస్ట్రీ లేదా ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ లేదా ఎన్విరాన్‌మెంట్ సైన్స్ లేదా జియాల‌జీ లేదా అగ్రిక‌ల్చ‌ర్ కోర్సులో ఉత్తీర్ణు‌లై ఉండాలి. 50 ఏండ్ల వ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి. 


ప్రాజెక్ట్ అసిస్టెంట్-1 పోస్టుల‌కు ఎన్విరాన్‌మెంట్ సైన్స్‌, ఇంజినీరింగ్ లేదా ఎన్విరాన్‌మెంట్ బ‌యోటెక్నాల‌జీ లేదా కెమిస్ట్రీ లేదా అన‌లిటిక‌ల్ కెమిస్ట్రీ లేదా మెట‌ల‌ర్జీ లేదా అట్మాస్పియ‌రిక్ సైన్సెస్ లేదా మెరైన్ సైన్సెస్ లేదా కెమిక‌ల్ ఇంజినీరింగ్ లేదా ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్ లేదా అగ్రిక‌ల్చ‌ర్ స‌బ్జెక్టుల‌తో ఎమ్మెస్సీ లేదా బీఈ లేదా బీటెక్ పూర్తిచేసి ఉండాలి. 35 ఏండ్ల లోపువారై ఉండాలి. 


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌


అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికెట్ల‌ను జ‌త‌చేసిన బ‌యోడేటాను ఈ-మెయిల్ hzcparecruit@gmail.comకు పంపించాలి. 


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ఆగ‌స్టు 24  


పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్ www.neeri.res.in

--------------------------------------------------------------------------------------------------------------------

హైదరాబాద్‌ ఎన్‌ఐఎన్‌లో ఉద్యోగాలు,


హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


పోస్టులవారీగా ఖాళీలు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-3, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌-1


----------అర్హతలు: పోస్టును బట్టి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.


ఎంపిక: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ/ పర్సనల్‌ డిస్కషన్‌ ద్వారా


దరఖాస్తు: ఈ-మెయిల్‌ ద్వారా


చివరితేదీ: ఆగస్టు 21


పోస్టులు: కన్సల్టెంట్‌-1, రిసెర్చ్‌ అసోసియేట్‌-1.


అర్హత: సంబంధిత సబ్జెక్టులో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.


దరఖాస్తు: ఈ-మెయిల్‌ ద్వారా


చివరితేదీ: ఆగస్టు 20


పోస్టు: మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌-1


అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. అనుభవం.


ఎంపిక: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా


దరఖాస్తు: ఈ-మెయిల్‌ ద్వారా


చివరితేదీ: ఆగస్టు 19


వెబ్‌సైట్‌: https://www.nin.res.in

----------------------------------------------------------------------------------------------------------

బీఎస్సీ టెక్స్‌టైల్స్‌ అండ్‌ ఎంబీఏ ప్రవేశాలు.


కోయంబత్తూర్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో కింది కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.


కోర్సులు: బీఎస్సీ టెక్స్‌టైల్స్‌ అండ్‌ ఎంబీఏ


ఎంపిక: ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా


వెబ్‌సైట్‌: www.svpitm.ac.in

No comments:

Post a comment