Saturday, 1 August 2020

ఎయిర్‌పోర్ట్ అథారిటీలో 180 జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులు, ఉమెన్ మిల‌ట‌రీ పోలీస్‌లో సోల్జ‌ర్ జ‌న‌ర‌ల్ డ్యూటీ ఉద్యోగాలు, యూపీఎస్సీ సీఎమ్మెస్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌, ఎస్‌బీఐలో 3850 ఆఫీసర్‌ పోస్టులు.

ఎయిర్‌పోర్ట్ అథారిటీలో 180 జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులు,

జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం 180 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇందులో ఎల‌క్ట్రానిక్స్ విభాగంలో 150, ఎల‌క్ట్రిక‌ల్‌లో 15, సివిల్‌లో 15 పోస్టుల చొప్పున ఉన్నాయి. గేట్-2019 వ‌చ్చిన మార్కుల ఆధారంగా ఈ నియామ‌కాల‌ను చేప‌ట్ట‌నున్నారు. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ఆగ‌స్టు 3న ప్రారంభ‌మ‌వ‌నున్నాయి. సెప్టెంబ‌ర్ 2 వ‌ర‌కు అధికారిక వెబ్‌సైట్ aai.aeroలో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. సంబంధిత స‌బ్జెక్టులో బీఈ లేదా బీటెక్ పూర్తిచేసిన‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని ఏఏఐ వెల్ల‌డించింది.     

మొత్తం పోస్టులు: 180

ఎంపిక విధానం: గేట్-2019 మార్కుల ఆధారంగా

ద‌‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: ఆగ‌స్టు 3

అప్లికేష‌న్స్‌కు చివ‌రి తేదీ: సెప్టెంబ‌ర్ 2

వెబ్‌సైట్‌: aai.aero

-----------------------------------------------------------------------------------------------------------------------
ఉమెన్ మిల‌ట‌రీ పోలీస్‌లో సోల్జ‌ర్ జ‌న‌ర‌ల్ డ్యూటీ ఉద్యోగాలు,

ఇండియ‌న్ ఆర్మీలో సోల్జ‌ర్ జ‌న‌ర‌ల్ డ్యూటీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. దీనిద్వారా ఉమెన్ మిల‌ట‌రీ పోలీస్‌లో ఖాళీగా ఉన్న 99 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. 21 ఏండ్ల లోపు ఉన్న మ‌హిళా అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. దీనికి సంబంధించి బెంగ‌ళూరు, పుణె, షిల్లాంగ్‌, అంబాలా, ల‌క్నో, జ‌బ‌ల్‌పూర్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వ‌హించ‌నున్నారు.  ఆగస్టు 31 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు అందుబాటులో ఉంటాయ‌ని వెల్ల‌డించింది. 

మొత్తం పోస్టులు: 99

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష (కామ‌న్ ఎంట్రెన్స్ ఎగ్జామినేష‌న్‌-సీఈఈ)

అర్హ‌త‌లు: మెట్రిక్యులేష‌న్ లేదా ప‌దో త‌ర‌గ‌తి లేదా ఎస్ఎస్ఎల్సీలో 45 మార్కుల‌కు ఉత్తీర్ణుల‌వ్వాలి. సంబంధిత స‌బ్జెక్టులో 33 శాతం మార్కులు త‌ప్ప‌నిస‌రిగా వ‌చ్చి ఉండాలి. 

వ‌య‌స్సు: 17 ఏండ్ల ఆరు నెల‌లు నిండి, 21 ఏండ్ల లోపు ఉండాలి.  (1999, అక్టోబ‌ర్ 1 నుంచి 2003, ఏప్రిల్ 1 మ‌ధ్య జ‌న్మించిన‌వారై ఉండాలి)

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: ఆగ‌స్టు 31

వెబ్‌సైట్‌: joinindianarmy.nic.in

-----------------------------------------------------------------------------------------------------------------------
యూపీఎస్సీ సీఎమ్మెస్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌,


కంబైండ్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ (సీఎమ్మెస్‌) ఎగ్జామినేష‌న్‌-2020 నోటిఫికేష‌న్‌ను యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) విడుద‌ల చేసింది. వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న 559 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. దీనికి సంబంధించి ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆగ‌స్టు 18తో ముగియ‌నుంది. కంప్యూట‌ర్ ఆధారితంగా ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో రెండు పేప‌ర్లు ఉంటాయి. 

మొత్తం పోస్టులు: 559

ఇందులో..

సెంట్ర‌ల్ హెల్త్ స‌ర్వీస్‌లో జూనియ‌ర్ స్కేల్ పోస్టులు- 182

రైల్వేస్‌లో అసిస్టెంట్ డివిజ‌న‌ల్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు- 300

ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీస్ హెల్త్ స‌ర్వీస్‌లో అసిస్టెంట్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు- 66

న్యూఢిల్లీ మున్సిప‌ల్ కౌన్సిల్‌లో జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌- 4

ఈస్‌, నార్త్‌, సౌత్ ఢిల్లీ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ల‌లో- 7 పోస్టులు ఉన్నాయి. 

అర్హ‌త‌: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. పూర్తి వివ‌రాలు వెబ్‌సైట్‌లో చూడ‌వ‌చ్చు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ఎంపిక విధానం: ‌రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ద్వారా

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.200 (మ‌హిళ‌లు, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూబీడీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు)  

ప‌రీక్షకేంద్రాలు: హైద‌రాబాద్, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం స‌హా 41 కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: ఆగ‌స్టు 18

ఆన్‌లైన్ అప్లికేష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌: ఆగ‌స్టు 25 నుంచి 31 వ‌ర‌కు

వెబ్‌సైట్‌: upsconline.nic.in 
-----------------------------------------------------------------------------------------------------------------------
ఎస్‌బీఐలో 3850 ఆఫీసర్‌ పోస్టులు.





షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 

(ఎస్‌బీఐ) దేశంలో అతిపెద్ద బ్యాంక్‌. 

ఏటా వేలాది కొలువులను ఈ బ్యాంక్‌ భర్తీ చేస్తుంది. బ్యాంక్‌ కొలువులు అంటే భద్రమైన కొలువులు అనే పేరుంది. దీంతోపాటు స్థానికంగా ఉండవచ్చు. ఆకర్షణీయమైన జీతభత్యాలు, అలవెన్స్‌లు ఉంటాయి. మిగిలిన బ్యాంకుల కంటే ఎస్‌బీఐలో మరిన్ని సదుపాయాలు ఉంటాయి. ప్రస్తుతం ఆఫీసర్‌స్థాయి ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టుల వివరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం..

మొత్తం ఖాళీలు:  3850

-హైదరాబాద్‌ (తెలంగాణ)- 550. వీటిలో ఎస్సీ-82, ఎస్టీ-41, ఓబీసీ-148, ఈడబ్ల్యూఎస్‌-55, జనరల్‌-224 ఖాళీలు ఉన్నాయి.

-అహ్మదాబాద్‌ సర్కిల్‌-750, బెంగళూరు సర్కిల్‌-750, భోపాల్‌- (ఎంపీ- 296, ఛత్తీస్‌గఢ్‌-104, చెన్నై-550, జైపూర్‌-300, మహారాష్ట్ర (ముంబై కాకుండా)-517, గోవా-33 ఖాళీలు ఉన్నాయి.

-పోస్టు: ఆఫీసర్‌ (సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌)

-పేస్కేల్‌: జేఎంజీఎస్‌-1 ప్రకారం రూ.23,700-42,020/-

-అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత


వయస్సు: 2020, ఆగస్టు 1 నాటికి 30 ఏండ్లు మించరాదు. అంటే 1990, ఆగస్టు 2 తర్వాత జన్మించి ఉండాలి. రిజర్వ్‌డ్‌ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

-అనుభవం: 2020, ఆగస్టు 1 నాటికి కనీసం రెండేండ్లపాటు ఆఫీసర్‌గా ఏదైనా షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ లేదా రీజినల్‌ రూరల్‌ బ్యాంక్‌లో పనిచేసి ఉండాలి. అదేవిధంగా స్థానిక భాషను పది లేదా పన్నెండో తరగతిలో చదివినట్లు సర్టిఫికెట్‌ దాఖలు చేయాలి.

-ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ. అవసరమైతే రాతపరీక్ష నిర్వహించే విచక్షణ బ్యాంక్‌కు ఉంటుంది.

-బ్యాంక్‌ నిర్ణయించిన నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్నవారిని షార్ట్‌లిస్ట్‌ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

-ఎంపికైనవారిని సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ (సీబీవో)గా ఉద్యోగావకాశం కల్పిస్తారు. వీరికి ఆరునెలల ప్రొబేషనరీ పీరియడ్‌ ఉంటుంది. వీరికి జనరల్‌ కేడర్‌ ఆఫీసర్‌కు వర్తించే అన్ని పదోన్నతులు వర్తిస్తాయి.

ముఖ్యతేదీలు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: ఆగస్టు 16

ఫీజు: జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీలకు రూ.750/- 

ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు ఎటువంటి ఫీజు లేదు.

వెబ్‌సైట్‌: https://www.sbi.co.in/web/careers/

current-openings 

5 comments: