సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్స్‌లో 1565 అప్రెంటిస్‌లు,
ప్రభుత్వరంగ మినీరత్న కంపెనీ సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఇందులో ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, కోపా, మెషినిస్ట్, టర్నర్ వంటి పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 1565
ఇందులో ఎలక్ట్రిషన్-630, ఫిట్టర్-425, మెకానిక్-175, వెల్డర్-80, కోపా-50, మెషినిస్ట్-50, టర్నర్-50, సెక్రటేరియట్ అసిస్టెంట్-50, ఎమ్మెల్టీ-30, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటేనెన్స్-25 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి తప్పనిసరిగా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. సిస్టమ్ మెయింటేనెన్స్ పోస్టుకు ఐటీఐలో ఐటీ లేదా ఐటీసీటీఎస్ఎం లేదా ఐటీఈఎస్ ట్రేడ్ చేసి ఉండాలి. అదేవిధంగా 18 నుంచి 30 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 5
వెబ్సైట్: centralcoalfields.in
----------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీఎల్‌లో 675 అప్రెంటిస్‌లు,
నవరత్న కంపెనీ అయిన ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ nlcindia.com ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 675 అప్రెంటిస్‌లను భర్తీచేయనుంది. దరఖాస్తులు ఈనెల 11న ప్రారంభం కానున్నాయి.
మొత్తం పోస్టులు: 675
విభాగాల వారీగా
ఫిట్టర్- 90
టర్నర్-35
మోటార్ వెహికిల్ మెకానిక్- 95
ఎలక్ట్రిషన్- 90
వైర్‌మెన్- 90
డీజిల్ మెకానిక్- 5
ట్రాక్టర్ మెకానిక్- 5
కార్పెంటర్- 5
ప్లంబర్- 5
స్టెనోగ్రాఫర్- 15
వెల్డర్- 90
పాసా- 30
అకౌంటెంట్- 40
డాటా ఎంట్రీ ఆపరేటర్- 40
హెచ్ ఆర్ అసిస్టెంట్- 40
అర్హత: అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ లేదా బీస్సీ కంప్యూర్స్, బీసీఏ, బీబీఏ పూర్తిచేసి ఉండాలి. 14 నుంచి 20 ఏండ్ల లోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: మెరిట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 11
అప్లికేషన్లకు చివరితేదీ: సెప్టెంబర్ 20
వెబ్సైట్: www.nlcindia.com
----------------------------------------------------------------------------------------------------------------------
ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ 1557 పోస్టులు,
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో మొత్తం 1557 పోస్టులను భర్తీ చేయనుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సిస్ బ్యాక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లో ఈ పోస్టులున్నాయి. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది.
మొత్తం పోస్టులు- 1557
ఇందులో తెలంగాణలో- 20, ఆంధ్రప్రదేశ్‌లో- 10 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు- ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ పరిజ్ఞానం, కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేట్ చేయడం తప్పనిసరి. కంప్యూటర్ ఆపరేషన్స్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి. హైస్కూల్ లేదా కాలేజీలో కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ చదివి ఉండాలి. 20 నుంచి 28 ఏండ్ల లోపువారై ఉండాలి.
దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 2
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 23
అప్లికేషన్ ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు రూ.100.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా
ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామ్: డిసెంబర్ 5, 12, 13
ప్రిలిమ్స్ ఫలితాల విడుదల: డిసెంబర్ 31
మెయిన్స్ కాల్ లెటర్స్: జనవరి 12
మెయిన్స్ ఆన్లైన్ ఎగ్జామ్: 2021 జనవరి 24
ప్రొవిజనల్ అలాట్మెంట్: 2021 ఏప్రిల్ 1
వెబ్సైట్: www.ibps.in
----------------------------------------------------------------------------------------------------------------------
బీఐఎస్‌లో 171 ఉద్యోగాలు నోటిఫికేషన్.
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (బీఐఎస్) వివిధ విభాగాల్లో ఖాలీగా ఉన్న గ్రూప్-ఏ, బీ, సీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 171 పోస్టులను భర్తీచేయనుంది. అర్హత, ఆసక్తి కలిగినవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.
మొత్తం పోస్టులు: 171
అసిస్టెంట్ డైరెక్టర్- 4 (లీగల్-1, ఫైనాన్స్-1, మార్కెటింగ్-1, లైబ్రెరీ-1)
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-17, పర్సనల్ అసిస్టెంట్-16, జూనియర్ ట్రాన్స్‌లేటర్ (హిందీ)-1, లైబ్రెరీ అసిస్టెంట్-1, స్టెనోగ్రాఫర్-17, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్-79, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్-36
అర్హత: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. తప్పనిసరిగా డిగ్రీపూర్తిచేసి ఉండాలి. 27 నుంచి 35 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, టైప్టెస్ట్, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, షార్ట్‌హ్యాండ్ టెస్ట్, టైపింగ్ స్పీడ్ టెస్ట్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలలకు ఫీజులేదు)
అప్లికేషన్లకు చివరితేదీ: సెప్టెంబర్ 26
ఆన్లైన్ ఎగ్జామ్: నవంబర్ 8
వెబ్సైట్: www.bis.gov.in