Sunday, 6 September 2020

ఎన్‌హెచ్‌పీసీలో ట్రెయినీ 86 పోస్టులు, నైనిటాల్ బ్యాంకులో పీఓ, క్ల‌ర్క్ 155 పోస్టులు, స‌శ‌స్త్ర సీమాబ‌ల్‌లో 1500 కానిస్టేబుల్ పోస్టులు, ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో జియోఫిజిస్ట్‌, ఫైర్ ఆఫీస‌ర్లు, జిప్‌మ‌ర్‌లో 13 సీనియ‌ర్ రెసిడెంట్ ఆఫీస‌ర్లు ఉద్యోగాలు.

ఎన్‌హెచ్‌పీసీలో ట్రెయినీ 86  పోస్టులు,

మినీర‌త్న కంపెనీ అయిన నేష‌న‌ల్ హైడ్రోఎల‌క్ట్రానిక్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ (ఎన్‌హెచ్‌పీసీఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రెయినీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 86 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. గేట్‌-2020, యూజీసీ నెట్‌, క్లాట్ (పీజీ), సీఏ లేదా సీఎంఏలో సాధించిన స్కోర్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌చేయ‌నుంది. 

పోస్టు పేరు: ట‌్రెయినీ ఇంజినీర్‌

మొత్తం పోస్టులు: 86 

ఇందులో సివిల్‌-30, ఫైనాన్స్‌-22, మెకానిక‌ల్‌-21, లా-8, హెచ్ఆర్‌-5 చొప్పున పోస్టులు ఉన్నాయి. 

అర్హ‌త‌: 60 శాతం మార్క‌లతో సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి ఉండాలి. మిగిలిన పోస్టుల‌కు హూమ‌న్ రిసోర్స్ స్పెష‌లైజేష‌న్‌తో పీజీ లేదా పీజీ డిప్లొమా లేదా ఎంబీఏ చేసి ఉండాలి, అదేవిధంగా మూడు లేదా ఐదేండ్ల లా, సీఏ లేదా సీఎంఏ పూర్తిచేసి ఉండాలి. 2020, అక్టోబ‌ర్ 1 నాటికి 30 ఏండ్ల లోపువారై ఉండాలి. 

ఎంపిక విధానం: గేట్‌-2020, యూజీసీ నెట్‌, క్లాట్ (పీజీ), సీఏ లేదా సీఎంఏలో సాధించిన స్కోర్ ఆధారంగా

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: ఆగ‌స్టు 29

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: సెప్టెంబ‌ర్ 28 

వెబ్‌సైట్‌: www.nhpcindia.com

-----------------------------------------------------------------------------------------------------------------------
నైనిటాల్ బ్యాంకులో పీఓ, క్ల‌ర్క్ 155 పోస్టులు,

దేశంలో రెండో అతిపెద్ద ప్ర‌భుత్వ‌రంగ‌ బ్యాంక్ అయిన బ్యాంక్ బ‌రోడా అనుబంధ నైనిటాల్‌ బ్యాంకులో ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌, క్ల‌ర్క్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆస‌క్తి కలిగినవారు అధికారిక వెబ్‌సైట్ అయిన nainitalbank.co.in ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 155 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఈ బ్యాంకు ఉత్త‌ర‌ఖండ్ కేంద్రంగా ప‌నిచేస్తున్న‌ది.  

పోస్టుల పేరు: ప‌్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌, క్ల‌ర్క్‌

పోస్టుల సంఖ్య‌: 155 (ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్-75, క్ల‌ర్క్‌-80)

అర్హ‌త‌: పీఓకు 50 మార్కుల‌తో డిగ్రీలేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 21 నుంచి 30 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి. క్ల‌ర్క్ పోస్టుకు 45 శాతం మార్కుల‌తో డిగ్రీ లేదా పీజీ పూర్తిచేసి 21 నుంచి 38 ఏండ్లలోపువారై ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారం. రాత‌ప‌రీక్ష‌ను ఆన్‌లైన్‌లో నిర్వ‌హిస్తారు. 

అప్లికేష‌న్ ఫీజు: పీఓ పోస్టుకు రూ.2000. క్ల‌ర్క్ పోస్టుకు రూ.1500

ఆన్‌లైన్ అప్లికేష‌న్స్‌కు చివ‌రితేదీ: ‌సెప్టెంబ‌ర్ 15

వెబ్‌సైట్‌: nainitalbank.co.in
-----------------------------------------------------------------------------------------------------------------------

 స‌శ‌స్త్ర సీమాబ‌ల్‌లో 1500 కానిస్టేబుల్ పోస్టులు,


స‌శ‌స్త్ర సీమాబ‌ల్ (ఎస్ఎస్‌బీ)లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి  ‌కేంద్ర హోంశాఖ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ప‌దో త‌ర‌గ‌తి పూర్తిచేసిన‌వారు ఈ నెల్ 27 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ధ‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 1552 కానిస్టేబుల్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. 


మొత్తం పోస్టులు: 1552


ఇందులో కానిస్టేబుల్ (డ్రైవ‌ర్‌-పురుషులు మాత్ర‌మే)-574, కానిస్టేబుల్ ల్యాబొరేట‌రీ అసిస్టెంట్‌-21, వెట‌ర్న‌రీ-161, ఆయా (మ‌హిళ‌లు మాత్ర‌మే)-5, కార్పెంట‌ర్‌-3, ప్లంబ‌ర్‌-1, పెయింట‌ర్‌-12, టైల‌ర్‌-20, కోబ్ల‌ర్‌-20, గార్డెన‌ర్‌-9, కుక్ (పురుషులు)-232, కుక్ (మ‌హిళ‌లు)-26, మాష‌ర్‌మ్యాన్- 92, వాష‌ర్‌మ్యాన్-28 (మ‌హిళ‌లు), బార్బ‌ర్ (పురుషులు)-75, బాబ‌ర్ (మ‌హిళ‌లు)-12, స‌ఫాయివాలా (పురుషులు)-89, స‌ఫాయివాలా (మ‌హిళ‌లు)-28, వాట‌ర్ క్యారియ‌ర్ (పురుషులు)-101, వాట‌ర్ క్యారియ‌ర్ (మ‌హిళ‌లు)-12, వెయిట‌ర్‌-1


అర్హ‌త‌లు: ఒక్కో పోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. త‌ప్ప‌నిస‌రిగా ప‌దోత‌ర‌గ‌తి పాసై ఉండాలి. ప్లంబ‌ర్‌, కార్పెంట‌ర్‌, పెయింట‌ర్ ఇత‌ర పోస్టుల‌కు రెండేండ్ల అనుభ‌వంతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఏడాది కోర్సు స‌ర్టిఫికెట్ లేదా రెండేండ్ల ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. 


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో‌


ఎంపిక విధానం: శ‌రీర దారుఢ్య ప‌రీక్ష‌(పీఈటీ), రాత ప‌రీక్ష, డాక్యుమెంట్-స్కిల్ టెస్ట్‌, మెడిల‌క్ ఎగ్జామ్ ద్వారా


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: సెప్టెంబ‌ర్ 27

-----------------------------------------------------------------------------------------------------------------------

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో జియోఫిజిస్ట్‌, ఫైర్ ఆఫీస‌ర్లు,


ప్రభుత్వ‌రంగ సంస్థ‌ ఆయిల్ ఇండియా లిమిటెడ్ వివిధ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న జియోఫిజిస్ట్‌, ఫైర్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతున్న‌ది. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఈ పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నుంది. ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా సంబంధిత స‌ర్టిఫికెట్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా తీసుకువెళ్లాలి. 


మొత్తం పోస్టులు: 16 


ఇందులో జియోఫిజిస్ట్‌-14, ఫైర్‌స‌ర్వీస్ ఆఫీస‌ర్‌-1, ఆప‌రేట‌ర్ (హెచ్ఎంవీ)-1 పోస్టు ఉన్నాయి. 


అర్హ‌త‌లు: జియోఫిజిస్ట్ పోస్టుకు జియోఫిజిక్స్‌లో పీజీ లేదా అప్ల‌యిడ్ జియోఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ, ఫైర్‌స‌ర్వీస్ ఆఫీస‌ర్ కోసం ఫైర్ ఇంజినీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ చేయాలి, ఆప‌రేట‌ర్ పోస్టు కోసం ఇంట‌ర్ పూర్తిచేసి హెవీ వెహిక‌ల్ న‌డ‌ప‌డంలో నాలుగేండ్ల అనుభ‌వం ఉన్న‌వారై ఉండాలి. ‌


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా


ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ద్వారా


ఇంట‌ర్వ్యూ చిరునామా: కేజీ బేసిన్‌, 11-4-7, 


నూకాల‌మ్మ ఆల‌య వీధి, రామారావ్‌పేట‌, కాకినాడ‌-ఏపీ  


ఇంట‌ర్వ్యూ తేదీ: జియోఫిజిస్ట్‌- సెప్టెంబ‌ర్ 21, ఫైర్‌స‌ర్వీస్ ఆఫీస‌ర్‌-సెప్టెంబ‌ర్ 22


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ‌సెప్టెంబ‌ర్ 18


వెబ్‌సైట్‌: oil-india.com

-----------------------------------------------------------------------------------------------------------------------

జిప్‌మ‌ర్‌లో 13 సీనియ‌ర్ రెసిడెంట్ ఆఫీస‌ర్లు ఉద్యోగాలు.


జ‌వ‌హర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్ (జిప్‌మ‌ర్‌)లో ఖాళీగా ఉన్న ‌సీనియ‌ర్ రెసిడెంట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆసక్తి క‌లిగిన అభ్య‌ర్థులు సెప్టెంబ‌ర్ 14 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది.


మొత్తం పోస్టులు: 13


ఇందులో అన‌స్థీషియాల‌జీ-2, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ-2, నియోన‌టాల‌జీ-1, పాథాల‌జీ-1, ప‌ల్మ‌న‌రీ మెడిసిన్-3, రేడియో డ‌యాగ్న‌సిస్‌-4 పోస్టుల చొప్పున ఉన్నాయి. 


అర్హ‌త‌లు: ఎంసీఐ గుర్తిపు పొందిన కాలేజీల నుంచి ఎండీ లేదా ఎమ్మెస్‌, డీఎన్‌బీ పూర్తిచేసి ఉండాలి. 


ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ద్వారా. ద‌ర‌ఖాస్తులు ఎక్కువ‌గా వ‌చ్చిన‌ట్ల‌యితే, వారి అర్హ‌త‌ల‌ను బ‌ట్టి అభ్య‌ర్థుల‌ను షార్ట్ లిస్ట్ చేసి ఇంట‌ర్వ్యూకి ఆహ్వానిస్తారు. 


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో


ద‌ర‌ఖాస్తులకు చివ‌రితేదీ: ‌సెప్టెంబ‌ర్ 14


ఇంట‌ర్వ్యూ తేదీ: సెప్టెంబ‌ర్ 16


వెబ్‌సైట్‌: main.jipmer.edu.in

1 comment: