Thursday, 24 September 2020

మిధానిలో 23 అసిస్టెంట్ పోస్టులు అక్టోబ‌ర్ 3న వాక్‌-ఇన్‌, ఎయిమ్స్ రిషీకేశ్‌లో 31 ఇంజినీర్ ఉద్యోగాలు, నైప‌ర్ హైద‌రాబాద్‌లో 19 ఫ్యాక‌ల్టీ ఉద్యోగాలు, ఈపీఎఫ్ఓలో 27 అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ఉద్యోగాలు.

 మిధానిలో 23 అసిస్టెంట్ పోస్టులు  అక్టోబ‌ర్ 3న వాక్‌-ఇన్‌,


ప‌్ర‌భుత్వ‌రంగ సంస్థ మిశ్ర ధాతు నిగ‌మ్ లిమిటెడ్ (మిధాని) ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. వీటికి సంబంధించి ఇంట‌ర్వూలు వ‌చ్చేనెల 3న జ‌రుగుతాయ‌ని, ఆస‌క్తి, అనుభ‌వం క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. 


పోస్టుపేరు: అసిస్టెంట్‌


మొత్తం పోస్టులు: 23


అర్హ‌త‌: 60 శాతం మార్కుల‌తో ‌మెట‌ల‌ర్జిక‌ల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తిచేయాలి. ఏడాది అనుభ‌వంతోపాటు, 35 ఏండ్లలోపు వ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి. 


ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా


ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. ఇంట‌ర్వ్యూ రోజున సంబంధిత స‌ర్టిఫికెట్ల‌తో హాజ‌రుకావాల్సి ఉంటుంది. 


ఇంట‌ర్వ్యూ తేదీ: అక్టోబ‌ర్ 3న‌


పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: midhani-india.in

-----------------------------------------------------------------------------------------------------------------

ఎయిమ్స్ రిషీకేశ్‌లో 31 ఇంజినీర్ ఉద్యోగాలు,

రిషీకేశ్‌లోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఖాళీగా ఉన్న గ్రూప్‌-ఏ, బీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు అక్టోబ‌ర్ 17లోపు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 31 పోస్టుల‌ను భ‌ర్తీ చేయనుంది.

మొత్తం పోస్టులు: 31

ఇందులో అసిస్టెంట్ ఇంజినీర్- 5 (సివిల్-3, ఎల‌క్ట్రిక‌ల్-1, ఎయిర్ కండిష‌నింగ్ అండ్ రిఫ్రిజిరేష‌న్‌-1), జూనియ‌ర్ ఇంజినీర్‌-14 (సివిల్-6, ఎల‌క్ట్రిక‌ల్-4, ఎయిర్ కండిష‌నింగ్ అండ్ రిఫ్రిజిరేష‌న్‌-4), సీనియ‌ర్ మెకానిక్‌-6, మెకానిక్‌-6 చొప్పున ఖాళీలు ఉన్నాయి. 

అర్హ‌త‌లు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. సంబంధిత రంగంలో అనుభ‌వం ఉండాలి. 20 నుంచి 35 ఏండ్లలోపు వ‌య‌స్సు క‌లిగి ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ఎంపిక విధానం:  రాత‌ప‌రీక్ష లేదా స్కిల్‌టెస్ట్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: అక్టోబ‌ర్ 17    

వెబ్‌సైట్‌: www.aiimsrishikesh.edu 
-----------------------------------------------------------------------------------------------------------------
నైప‌ర్ హైద‌రాబాద్‌లో  19 ఫ్యాక‌ల్టీ ఉద్యోగాలు,

న‌గ‌రంలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్ (నైప‌ర్‌) వివిధ డిపార్ట్‌మెంట్ల‌లో ఖాళీగా ఉన్న ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 19 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. నిర్ధేశిత న‌మూనాలో ఉన్న ద‌ర‌ఖాస్తుల‌ను వ‌చ్చే నెల 4లోపు పంపించాల‌ని వెల్ల‌డించింది. 

మొత్తం పోస్టులు: 19

ఇందులో మెడిక‌ల్ కెమిస్ట్రీ-2, ఫార్మాస్యూటిక‌ల్ అనాలిసిస్‌-3, ఫార్మాస్యుటిక్స్‌-2, ఫార్మ‌కాల‌జీ అండ్ ట్యాక్సికాల‌జీ-4, ఫార్మాస్యూటిక‌ల్ టెక్నాల‌జీ-2, ఫార్మ‌కోఇన్ఫ‌ర్మాటిక్స్‌- 2, రెగ్యులేట‌రీ అఫైర్స్‌-2, ఫార్మాస్యూటిక‌ల్ మేనేజ్‌మెంట్‌-2 చొప్పున ప్రొఫెస‌ర్, అస్టిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.    

అర్హ‌త‌లు: ఒక్కోపోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. సంబంధిత విభాగంలో అనుభవం త‌ప్ప‌నిస‌రి. అభ్య‌ర్థులు 50 ఏండ్లలోపు వ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: అక్టోబ‌ర్ 4

వెబ్‌సైట్‌: : www.niperhyd.ac.in / www.niperhyd.edu.in
-----------------------------------------------------------------------------------------------------------------

ఈపీఎఫ్ఓలో 27 అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ఉద్యోగాలు.

ఉద్యోగుల భ‌విష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ డైరెక్ట‌ర్ (విజిలెన్స్‌) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ పోస్టులు తెలంగాణ‌, ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌, ప‌శ్చిమ‌బెంగాల్‌లోని జోన‌ల్ కార్యాల‌యాల్లో ఉన్నాయి. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 27 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. 

మొత్తం పోస్టులు: 27

ఇందులో హైద‌రాబాద్ (సౌత్‌జోన్)-5, ఢిల్లీ (ప్ర‌ధాన‌కార్యాల‌యం)-5, ఢిల్లీ (నార్త్ జోన్‌)-6, ముంబై (వెస్ట్ జోన్‌)-5, కోల్‌క‌తా (ఈస్ట్‌జోన్‌)-6 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌లు: ఈపీఎఫ్ఓ ఆర్గ‌నైజేష‌న్ లేదా కేంద్ర ప్ర‌భుత్వం లేదా రాష్ట్ర ప్ర‌భుత్వం లేదా కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో ప‌నిచేస్తున్న ప్ర‌భుత్వ ఉద్యోగులై ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆఫ్‌లైన్‌. నిర్ణీత న‌మూనాలో ఉన్న ద‌ర‌ఖాస్తుల‌ను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తిగా నింపి దానికి అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికెట్ల‌ను జ‌త‌చేసి సంబంధిత అడ్ర‌స్‌కు పంపించాలి. 

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: న‌వంబ‌ర్ 2

వెబ్‌సైట్‌: https://www.epfindia.gov.in/site_en/Recruitments.php

No comments:

Post a comment