Wednesday, 16 September 2020

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌లో 535 ఎస్ఓ ఉద్యోగాలు, యూపీఎస్సీ 204 పోస్టుల‌తో నోటిఫికేష‌న్‌, డీఆర్‌డీఓలో 4 రిసెర్చ్ అసోసియేట్లు ఉద్యోగాలు, సెయిల్ దుర్గాపూర్ ప్లాంట్‌‌లో 82 న‌ర్సు ఉద్యోగాలు.

 పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌లో 535 ఎస్ఓ ఉద్యోగాలు,


దేశంలో అతిపెద్ద ప్ర‌భుత్వరంగ బ్యాంకుల్లో ఒక‌టైన పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (పీఎన్‌బీ)‌ మేనేజ‌ర్‌, సీనియ‌ర్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ద‌ర‌ఖాస్తులు ఈనెల 29 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని వెల్ల‌డించింది. 


పోస్టు పేరు: మేనేజ‌ర్‌, సీనియ‌ర్ మేనేజ‌ర్‌


మొత్తం పోస్టులు: 535


ఇందులో మేనేజ‌ర్ (రిస్క్)‌- 160, మేనేజ‌ర్ (క్రెడిట్) -200, మేనేజ‌ర్ (ట్రెజ‌రీ)-30, మేనేజ‌ర్ (లా)-25, మేనేజ‌ర్ (ఆర్కిటెక్ట్‌)-2, మేనేజ‌ర్ (సివిల్‌)-8, మేనేజ‌ర్ (ఎక‌న‌మిక్‌)-10, మేనేజ‌ర్ (హెచ్ఆర్‌)-10, సీనియ‌ర్ మేనేజ‌ర్ (రిస్క్‌)-40, సీనియ‌ర్ మేనేజ‌ర్ (క్రెడిట్‌)-50 పోస్టుల చొప్పున ఉన్నాయి. 


అర్హ‌త‌లు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. మేనేజ‌ర్ పోస్టుల‌కు 25 నుంచి 35 ఏండ్ల‌లోపు వ‌య‌స్సు, సీనియ‌ర్ మేనేజ‌ర్ పోస్టుల‌కు 25 నుంచి 37 ఏండ్ల లోపు వ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి. 


ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప‌రీక్ష లేదా ఇంట‌ర్వ్యూ. ద‌ర‌ఖాస్తుల్లో పేర్కొన్న అర్హ‌త‌ల ఆధారంగా అర్హులైన‌వారిని ఇంట‌ర్వ్యూ లేదా రాత ప‌రీక్ష‌కు పిలుస్తారు. 


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో


అప్లికేష‌న్ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూబీడీ అభ్య‌ర్థుల‌కు రూ.175


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌ర‌తేదీ: సెప్టెంబ‌ర్ 29


రాత‌ప‌రీక్ష లేదా ఇంట‌ర్వ్యూ: అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్‌లో


వెబ్‌సైట్‌: pnbindia.in

------------------------------------------------------------------------------------------------------------

యూపీఎస్సీ 204 పోస్టుల‌తో నోటిఫికేష‌న్‌,

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెష‌లిస్ట్ గ్రేడ్‌-3 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, లైవ్‌స్టాక్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి యూనియ‌న్ ప‌బ్బిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హులైన‌, ఆస‌క్తి క‌లిగివారు ఆన్‌లైన్ ద‌రాఖ‌స్తు చేసుకోవాల‌ని కోరింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్ర‌య అక్టోబ‌ర్ 1న ముగుస్తుంద‌ని తెలిపింది.


మొత్తం పోస్టులు: 204


ఇందులో లైవ్‌స్టాక్ ఆఫీస‌ర్-3, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్- 176 (అన‌స్థీసియాల‌జీ-63, ఎపిడ‌మాల‌జీ-1, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ-54, మైక్రోబ‌యాల‌జీ-15, నెఫ్రాల‌జీ-12, పాథాల‌జీ-17, పీడియాట్రిక్ నెఫ్రాల‌జీ-3, ఫార్మ‌కాల‌జీ-11), అసిస్టెంట్ డైరెక్ట‌ర్ సెన్స‌స్ ఆప‌రేష‌న్స్ (టెక్నిక‌ల్‌)-25, అసిస్టెంట్ ఇంజినీర్‌-1 చొప్పున ఖాళీలు ఉన్నాయి. 


అర్హ‌త‌లు: అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు ఎంబీబీఎస్ పూర్తిచేసి, సీనియ‌ర్ రెసిడెంట్ లేదా ట్యూట‌ర్‌గా మూడేండ్ల అనుభ‌వం ఉండాలి. లైవ్‌స్టాక్ ఆఫీస‌ర్‌కు వెట‌ర్న‌రీ సైన్స్ , యానిమ‌ల్ హ‌స్బెండ‌రీ స‌బ్జెక్టుతో డిగీ పూర్తిచేసి మూడేండ్ల అనుభ‌వం ఉండాలి. సెన్స‌స్ ఆప‌రేష‌న్స్ పోస్టుకు స్టాటిస్టిక్స్‌లో పీజీ చేసి సంబంధిత రంగంలో మూడేండ్ల అనుభ‌వం ఉన్న‌వారై ఉండాలి. 


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో


ఎంపిక విధానం:  రాత ప‌రీక్ష లేదా ఇంట‌ర్వ్యూ


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: అక్టోబ‌ర్ 1


పూర్తివివ‌రాల‌కు వెబ్‌సైట్‌:  upsc.gov.in


------------------------------------------------------------------------------------------------------------

డీఆర్‌డీఓలో  రిసెర్చ్ అసోసియేట్లు ఉద్యోగాలు,

ర‌క్ష‌ణ శాఖ ఆధ్వ‌ర్యంలో ప‌నిచేసే డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్‌డీఓ) రిసెర్చ్ అసోసియేట్ (ఆర్ఏ) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు సెప్టెంబ‌ర్ 28 లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. 


మొత్తం రిసెర్చ్ అసోసియేట్‌లు- 4


అర్హ‌త‌లు: ‌ఫిజిక్స్ లేదా లేజ‌ర్ ఫిజిక్స్‌తో ఎమ్మెస్సీ చేసి ఉండాలి. కంప్యూట‌ర్ సైన్స్‌, డాటా సైన్స్‌, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌లో పీహెచ్‌డీ చేసి ఉండాలి. 35 ఏండ్ల లోపు ఉండాలి.   


దర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: సెప్టెంబ‌ర్ 28


ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ


వెబ్‌సైట్‌: https://rcilab.in 


------------------------------------------------------------------------------------------------------------

సెయిల్ దుర్గాపూర్ ప్లాంట్‌‌లో 82 న‌ర్సు ఉద్యోగాలు.


దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్‌లో ప్రొఫిషియెన్సీ ట్రయినింగ్‌లో భాగంగా న‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి స‌్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్‌) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి క‌లిగిన‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఎంపికైన‌వారు దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్‌లోని 6 వంద‌ల ప‌డ‌క‌ల ద‌వాఖాన‌లో 18 నెల‌ల‌పాటు ప‌నిచేయాల్సి ఉంటుంది. 


మొత్తం ఖాళీలు: 82


పోస్టుపేరు: న‌ర్స్‌


అర్హ‌త‌లు: బీఎస్సీ న‌ర్సింగ్ పూర్తిచేయాలి లేదా జ‌న‌ర‌ల్ న‌ర్సింగ్‌లో డిప్లొమా, మిడ్‌వైఫ‌రీ చేసి ఉండాలి. 18 నుంచి 30 ఏండ్ల‌లోపు వ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి. 


శిక్ష‌ణ కాలం: 18 నెల‌లు


స్ట‌యిఫండ్‌: నెల‌కు రూ.8000


ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో. సంబంధిత స‌ర్టిఫికెట్ల‌ను పీడీఎఫ్ రూపంలో ఈ-మెయిల్ dspintake@saildsp.co.inకు పంపించాలి. 


ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: సెప్టెంబ‌ర్ 26  


వెబ్‌సైట్‌: https://www.sailcareers.com

No comments:

Post a comment