Thursday, 24 September 2020

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 214 పోస్టులు, ఇండియ‌న్ నేవీలో బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌, ఓఎన్‌జీసీలో ఎగ్జిక్యూటివ్‌, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు.

 బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 214 పోస్టులు,


ప‌్ర‌భుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ఖాళీగా ఉన్న క్రెడిట్ ఆఫీస‌ర్‌, రిస్క్ మేనేజ‌ర్, ఇత‌ర పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు అందుబాటులో ఉంటాయ‌ని వెల్ల‌డించింది.


మొత్తం పోస్టులు: 214


ఇందులో క్రెడిట్ ఆఫీస‌ర్‌- 79


రిస్క్ మేనేజ‌ర్‌- 9


క్రెడిట్ అన‌లిస్ట్‌- 60


ఎక‌న‌మిస్ట్ లేదా స్టాటిస్టీషియ‌న్- 96


అర్హ‌త‌లు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. సెప్టెంబ‌ర్ 1 నాటికి 20 నుంచి 38 ఏండ్ల లోపు వ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి. 


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో


అప్లికేష‌న్ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు రూ.175


ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష (ఆన్‌లైన్‌లో), ఇంటర్వ్యూ ద్వారా


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: సెప్టెంబ‌ర్ 30


వెబ్‌సైట్‌: https://bankofindia.co.in 

-----------------------------------------------------------------------------------------------------------------

ఇండియ‌న్ నేవీలో బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌,

భార‌త నౌకా ద‌ళంలో క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌లో భాగంగా నాలుగేండ్ల బీటెక్ (10+2) కోర్సులో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. జేఈఈ మెయిన్ రాసిన అవివాహిత పురుష అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ద‌ర‌ఖాస్తులు వ‌చ్చే నెల 6న ప్రారంభ‌మ‌వుతాయ‌ని వెల్ల‌డించింది. ఎంపికైన అభ్య‌ర్థుల‌ను కోర్సు పూర్త‌యిన త‌ర్వాత ఎడ్యుకేష‌న్‌, ఎగ్జిక్యూటివ్, టెక్నిక‌ల్ బ్రాంచీలకు పంపిస్తారు. 

మొత్తం పోస్టులు: 34

ఎడ్యుకేష‌న్ బ్రాంచీ-5, ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నిక‌ల్ బ్రాంచీ-29 ఖాళీలు ఉన్నాయి. 

అర్హ‌త‌: ‌ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ స‌బ్జెక్టుల‌తో 70 శాతం మార్కుల‌తో 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. జేఈఈ మెయిన్ (బీఈ లేదా బీటెక్‌) రాసి ఉండాలి. 

వ‌య‌స్సు: 2001, జూలై 2 నుంచి 2004, జ‌న‌వ‌రి 1 మ‌ధ్య పుట్టిన‌వారై ఉండాలి. 

ఎంపిక విధానం: ఎంపిక చేసిన అభ్య‌ర్థుల‌ను ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వూకి ఆహ్వానిస్తారు. ఇంట‌ర్వ్యూలు బెంగ‌ళూరు, భోపాల్ లేదా కోల్‌క‌తా లేదా విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతాయి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: అక్టోబ‌ర్ 6

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: అక్టోబ‌ర్ 20

వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in
-----------------------------------------------------------------------------------------------------------------

ఓఎన్‌జీసీలో ఎగ్జిక్యూటివ్‌, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు.

ప‌్ర‌ముఖ చ‌మురు ఉత్ప‌త్తి సంస్థ ఓఎన్‌జీసీ పెట్రో ఆడిష‌న్స్ లిమిటెడ్ (ఓపల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుల చేసింది. ఇందులో యూ అండ్ ఓ ఆప‌రేష‌న్స్‌, క్వాలిటీ ల్యాబ్స్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ మెయింటేనెన్స్‌, ఎల‌క్ట్రిక‌ల్ మెయింటేనెన్స్‌, ఎన్విరాన్‌మెంట్, మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, లీగ‌ల్, సెక్యూరిటీ సంబంధిత పోస్టులు ఉన్నాయి. పోస్టుల సంఖ్య‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. పూర్తిస్థాయి నోటిఫికేష‌న్ రేపు వెలువ‌డ‌నుంది.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: సెప్టెంబ‌ర్ 25 

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: అక్టోబ‌ర్ 10

వెబ్‌సైట్‌: www.opalindia.in

No comments:

Post a comment