Monday, 28 September 2020

హైదరాబాద్‌లోని ఎంఎన్‌జేలో 36 పోస్టులు, డీఆర్‌డీఓలో 90 అప్రెంటిస్‌లు, యూపీఎస్సీ నోటిఫికేష‌న్‌ 42 ఉద్యోగాలు, సీఈఎల్‌లో 8 మేనేజ‌ర్‌, అకౌంట్స్ ఆఫీస‌ర్ పోస్టులు.

 హైదరాబాద్‌లోని ఎంఎన్‌జేలో 36 పోస్టులు,


హైదరాబాద్‌లోని మెహదీ నవాజ్‌ జంగ్‌ (ఎంఎన్‌జే) ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ అండ్‌ రీజినల్‌ క్యాన్సర్‌ సెంటర్‌లో రెగ్యులర్‌/కాంట్రాక్ట్‌ ప్రాతిపది కన కింది పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్‌ & హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఎంహెచ్‌ఆర్‌సీబీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


మొత్తం ఖాళీలు: 36

పోస్టులు-ఖాళీలు: ప్రొఫెసర్‌-4, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-3, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-20, మెడికల్‌ ఆఫీసర్‌-2, లెక్చరర్‌-1, సీనియర్‌ రెసిడెంట్‌-6. విభాగాలు: న్యూక్లియర్‌ మెడిసిన్‌, మాలిక్యులర్‌ ఆంకాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ, పాథాలజీ తదితరాలు ఉన్నాయి.


అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ, ఎండీ/ ఎంఎస్‌/ ఎంసీహెచ్‌/ డీఎం/ డీఎన్‌బీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత, టీచింగ్‌/పరిశోధన అనుభవం.


ఎంపిక: అనుభవం, రిసెర్చ్‌ రికార్డ్‌ ఆధారంగా


దరఖాస్తు: ఆన్‌లైన్‌లో


చివరితేదీ: అక్టోబర్‌ 23


వెబ్‌సైట్‌: https://mhsrb.telangana.gov.in

--------------------------------------------------------------------------------------------------

డీఆర్‌డీఓలో 90  అప్రెంటిస్‌లు,

‌కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ ఆధ్వ‌ర్యంలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్‌డీఓ) డా. అబ్దుల్ క‌లాం మిసైల్ కాంప్లెక్స్‌లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఐటీఐ పూర్తి చేసిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ప‌దిరోజుల్లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని వెల్ల‌డించింది. 


అప్రెంటిస్‌ల సంఖ్య‌: 90


ఇందులో ఫిట్ట‌ర్‌-25, ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌-20, ఎల‌క్ట్రీషియ‌న్‌-15, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్‌-10, ట‌ర్న‌ర్‌-10, మెషినిస్ట్‌-5, వెల్ల‌డ‌ర్‌-5 ఖాళీలు ఉన్నాయి. 


అర్హ‌త‌లు: స‌ంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. 2018, 2019, 2020లో ఐటీఐ పూర్తిచేసిన‌వారు మాత్ర‌మే అర్హులు. 


స్ట‌యిఫండ్‌: రూ.7,700 నుంచి రూ.8050


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో


వెబ్‌సైట్‌: www.apprenticeshipindia.org


--------------------------------------------------------------------------------------------------

యూపీఎస్సీ నోటిఫికేష‌న్‌ 42 ఉద్యోగాలు,

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. ఈ నోటిఫికేష‌న్ అసిస్టెంట్ ఇంజినీర్‌, ఫోర్‌మెన్‌, సీనియ‌ర్ సైంటిఫిక్ అసిస్టెంట్‌ ఇత‌ర పోస్టులు ఉన్నాయి.   

మొత్తం పోస్టులు: 52

ఇందులో అసిస్టెంట్ ఇంజినీర్‌-2, ఫోర్‌మెన్ (కంప్యూట‌ర్ సైన్స్‌)-2, సీనియ‌ర్ సైంటిఫిక్ అసిస్టెంట్-15 (కంప్యూట‌ర్‌-3, ఎల‌క్ట్రిక‌ల్‌-2, మెకానిక‌ల్‌-10), అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌- 23 (కెమిక‌ల్ హెమ‌టాల‌జీ-10, ఇమ్యునో హెమ‌టాల‌జీ-5, మెడిక‌ల్ ఆంకాల‌జీ-2, నియోన‌టాల‌జీ-6)

అర్హ‌త‌లు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. 

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో  

అప్లికేష‌న్ ఫీజు: ‌రూ.25, మ‌హిళ‌లు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: అక్టోబ‌ర్ 15 

వెబ్‌సైట్‌: upsc.gov.in  
--------------------------------------------------------------------------------------------------
సీఈఎల్‌లో 8 మేనేజ‌ర్‌, అకౌంట్స్ ఆఫీస‌ర్ పోస్టులు.

ప్ర‌భుత్వ‌రంగ సంస్థ అయిన సెంట్ర‌ల్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (సీఈఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌చేసింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా సీనియ‌ర్ మేనేజ‌ర్‌, అకౌంట్స్ ఆఫీస‌ర్‌, డిప్యూటీ ఇంజినీర్ వంటి పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నుంది. న‌వంబ‌ర్ 6 లోపు ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని వెల్ల‌డించింది. 

మొత్తం పోస్టులు: 8

ఇందులో సీనియ‌ర్ మేనేజ‌ర్‌-1, మేనేజ‌ర్‌-3, అసిస్టెంట్ టెక్నిక‌ల్ మేనేజ‌ర్‌-2, డిప్యూటీ ఇంజినీర్‌-1, అకౌంట్స్ ఆఫీస‌ర్‌-1 చొప్పున‌ ఖాళీలు ఉన్నాయి. 

అర్హ‌త‌లు: సంబంధిత స‌బ్జెక్టులో బీఈ లేదా బీటెక్, సీఏ లేదా ఐసీడ‌బ్ల్యూఏ, ఎల్ఎల్‌బీ, ప‌ర్స‌న‌ల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా చేసి ఉండాలి. 

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

అప్లికేష‌న్ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థులు ఎలాంటి పీజు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: అక్టోబ‌ర్ 6

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: న‌వంబ‌ర్ 6

వెబ్‌సైట్‌: www.celindia.co.in 

No comments:

Post a comment