సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో జూనియర్ ఓవర్‌మెన్ 75 ఉద్యోగాలు,
రాంచీలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) లో ఖాళీగా ఉన్న జూనియర్ ఓవర్‌మెన్ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదలయ్యింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 75 పోస్టులను భర్తీచేయనుంది. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపికచేస్తామని, ఆన్లైన్ దరఖాస్తులు సీసీఎల్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.
మొత్తం పోస్టులు: 75
అర్హత: ఓవర్‌మెన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. గ్యాస్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ తప్పనిసరి. అభ్యర్థులు 18 నుంచి 30 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. హార్డ్ కాపీని ప్రింట్‌తీసి అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత చిరునామాకు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా నవంబర్ 21లోపు పంపించాలి.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 12
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 11
వెబ్సైట్: www.centralcoalfields.in
-----------------------------------------------------------------------------------------------------------------------
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నోటిఫికేషన్,
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్ర శాఖలు/ సంస్థల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు: జూనియర్ ఇంజినీర్
ఖాళీలు: తర్వాత వెల్లడిస్తారు. (ఏటా కనీసం పదిహేను వందల నుంచి రెండువేల వరకు ఉంటాయి. ఏటేటా వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది)
అర్హతలు: సంబంధిత బ్రాంచీల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత. కొన్ని శాఖల్లో పోస్టులకు అనుభవం ఉండాలి.
వయస్సు: 2021, జనవరి 1 నాటికి వాటర్ కమిషన్, పబ్లిక్ వర్క్స్ పోస్టులకు 32 ఏండ్లు, మిగిలిన శాఖల్లో పోస్టులకు 30 ఏండ్లు మించరాదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష, డిస్క్రిప్టివ్ టెస్ట్ ద్వారా చేస్తారు.
పరీక్షతేదీ: పేపర్-1: 2021 మార్చి 22-25 వరకు. పేపర్-2 (కన్వెన్షనల్): తర్వాత ప్రకటిస్తారు.
పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
పరీక్ష విధానం: పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్-1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, పేపర్-2 డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది.
పేపర్-1లో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంజినీరింగ్ (సంబంధిత బ్రాంచీపై) మొత్తం 200 ప్రశ్నలు, 200 మార్కులు. పరీక్ష కాలవ్యవధి రెండుగంటలు.
పేపర్-2లో జనరల్ ఇంజినీరింగ్ సంబంధిత బ్రాంచీపై 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి రెండుగంటలు.
ఉద్యోగ అవకాశం కల్పించే సంస్థలు
బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ)
సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్
సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్
సెంట్రల్ వాటర్ కమిషన్
డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్
ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్
మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్
నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
ఫీజు: రూ.100/-
చివరితేదీ: అక్టోబర్ 30
వెబ్సైట్: https://ssc.nic.in
-----------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment