Thursday, 8 October 2020

మిధానిలో 158 ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌లు, బీఈఎల్‌లో 17 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు, డీఆర్‌డీఓ డీఎస్ఐడీసీలో 16 అప్రెంటిస్‌లు, ఎస్సెస్సీ జూనియ‌ర్ ఇంజినీర్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.

 మిధానిలో 158 ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌లు,


న‌గ‌రంలోని మిశ్ర ధాతు నిగ‌మ్ లిమిటెడ్ (మిధాని) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీ భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసింది. ఐటీఐలో ఉత్తీర్ణ‌త సాధించి ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 158 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది.  


మొత్తం పోస్టులు: 158


ఇందులో ఫిట్ట‌ర్‌-50, ఎల‌క్ట్రిష‌న్-48, మెషినిస్ట్‌-20, ట‌ర్న‌ర్‌-20, వెల్డ‌ర్‌-20 చొప్పున ఖాళీలు ఉన్నాయి. 


అర్హ‌తలు: స‌ంబంధిత స‌బ్జెక్టులో ఐటీఐ స‌ర్టిఫికెట్ ఉండాలి. 


ఎంపిక విధానం: ఐటీఐలో వ‌చ్చిన మార్కుల ఆధారంగా.


నోట్‌: అభ్య‌ర్థులు www.apprenticeshipindia.org పోర్ట‌ల్‌లో త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట‌ర్ చేసుకోవాలి. 


ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో. హార్డ్ పాపీని హైద‌రాబాద్‌లోని మిధాని కార్యాల‌యానికి పంపించాలి.  


ద‌ర‌ఖాస్తుల‌కు చివరితేదీ: అక్టోబ‌ర్ 16


వెబ్‌సైట్‌: www.apprenticeshipindia.org

---------------------------------------------------------------------------------------------------------------------

బీఈఎల్‌లో 17 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు,

భార‌త్ ఎల‌క్ట్రానిక్ లిమిటెడ్ (బీఈఎల్‌) ఖాళీగా ఉన్న‌ సీనియ‌ర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆసక్తి కలిగిన అభ్య‌ర్థులు అక్టోబ‌ర్ 27 లోపు ద‌ర‌ఖాస్తు చేసువాల‌ని కోరింది. ఎంపికైన‌వారు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌లో ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని తెలిపింది. 

మొత్తం పోస్టులు: 17

అర్హ‌త‌: మూండేండ్ల డిప్లొమా లేదా దానికి స‌మాన‌మైన కోర్సు చేసి ఉండాలి. 

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ద్వారా

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. హార్డ్ కాపీల‌ను ప్రింట్ తీసి, వాటికి అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికెట్ల‌ను జ‌త‌చేసి అక్టోబ‌ర్ 27 వ‌ర‌కు సంబంధిత చిరునామాకు పంపించాలి.

అప్లికేష‌న్ ఫీజు: రూ.500 

ద‌రఖాస్తుల‌కు చివ‌రితేదీ: అక్టోబ‌ర్ 24

వెబ్‌సైట్‌: https://bel-india.in/
---------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్‌డీఓ డీఎస్ఐడీసీలో 16 అప్రెంటిస్‌లు,

డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ డాక్యుమెంటేష‌న్ సెంట‌ర్ (డీఎస్ఐడీసీ)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల భ‌ర్తీకి డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్‌డీఓ) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ విడుద‌లైన 15 రోజుల్లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. 

అప్రెంటిస్‌ల సంఖ్య‌: 16

ఇందులో లైబ్రెరీ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ సైన్స్‌-9, కంప్యూట‌ర్ సైన్స్‌-6, ఫొటోగ్ర‌ఫీ-1 చొప్పున ఖాళీగా ఉన్నాయి. 

అర్హ‌త‌:  లైబ్రెరీ సైన్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌లో డిగ్రీ, బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. ఫొటోగ్ర‌ఫీలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మార్కుల ఆధారంగా

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. ద‌ర‌ఖాస్తుల‌ను ఈ-మెయిల్ director@desidoc.drdo.in ద్వారా  పంపించాలి. 

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: అక్టోబ‌ర్ 18

వెబ్‌సైట్‌: https://drdo.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------
ఎస్సెస్సీ జూనియ‌ర్ ఇంజినీర్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.
‌కేంద్ర ప్ర‌భుత్వంలోని వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న జూనియ‌ర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భ‌ర్తీకి స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్సెస్సీ) నోటిఫికేష‌న్ విడుదల చేసింది. అర్హ‌త‌, ఆస‌క్తి, అనుభ‌వం ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు అక్టోబ‌ర్ 30 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. కాగా, ఎన్ని పోస్టులు భ‌ర్తీ చేస్తున్న‌ద‌నే విష‌యాన్ని ప్ర‌క‌టించ‌లేదు. ప‌రీక్ష స‌మ‌యానికి పోస్టుల సంఖ్య‌ను క‌మిష‌న్ వెబ్‌సైట్‌లో ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించింది. 

ఈ ఖాళీలు బార్డ‌ర్ రోడ్ ఆర్గ‌నైజేష‌న్ (బీఆర్ఓ), సెంట్ర‌ల్ ప‌బ్లిక్ వ‌ర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడ‌బ్ల్యూడీ), సెంట్ర‌ల్ వాట‌ర్ క‌మిష‌న్‌, సెంట్ర‌ల్ వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ రిసెర్చ్ స్టేష‌న్‌, డైరెక్ట‌రేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ (నావ‌ల్‌), ఫ‌ర‌క్కా బ్యారేజ్ ప్రాజెక్ట్‌, మిల‌ట‌రీ ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ (ఎంఈఎస్‌), నేష‌న‌ల్ టెక్నిక‌ల్ రిసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్ (ఎన్‌టీఆర్ఓ) వంటి విభాగాల్లో ఉన్నాయి. 

అర్హ‌త‌లు: మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, సివిల్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ లేదా సివిల్ ఇంజినీరింగ్, ఎల‌క్ట్రానిక్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా చేసి ఉండాలి. సంబంధిత రంగంలో క‌నీసం రెండేండ్లు ప‌నిచేసిన అనుభ‌వం ఉండాలి. 2021, జ‌న‌వ‌రి 1 నాటికి 32 ఏండ్ల లోపువారై ఉండాలి. 

నోట్‌: బార్డ‌ర్ రోడ్ ఆర్గ‌నైజేష‌న్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌కు పురుష అభ్య‌ర్థులు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.  

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ద్వారా (సీబీఈ)

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

అప్లికేష‌న్ ఫీజు: రూ.100, మ‌హిళ‌లు, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: అక్టోబ‌ర్ 30

ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించ‌డానికి చివ‌రితేదీ: న‌వంబ‌ర్ 1

రాత‌ప‌రీక్ష‌: 2021, మార్చి 22 నుంచి 25 వ‌ర‌కు

వెబ్‌సైట్‌: https://ssc.nic.in


No comments:

Post a Comment