డీఆర్డీవో స్కాలర్షిప్స్,
డీఆర్డీవో- ఏరోనాటిక్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ (ఏఆర్&డీబీ) బాలికల కోసం స్కాలర్షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పేరు: బాలికలకు డీఆర్డీఓ స్కాలర్షిప్ స్కీం
మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 30
బీఈ/ బీటెక్-20, ఎంఈ/ ఎంటెక్-10.
విభాగాలు: ఏరోస్పేస్ ఇంజినీరింగ్/ ఏరోనాటికల్ ఇంజినీరింగ్/ స్పెస్ ఇంజినీరింగ్ అండ్ రాకెట్రీ/ ఏవియానిక్స్/ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్), ఎంఈ/ ఎంటెక్/ ఎమ్మెస్సీ(ఇంజినీరింగ్) మొదటి ఏడాది (2020-21) ప్రవేశం పొంది ఉండాలి. వ్యాలిడ్ జేఈఈ (మెయిన్ స్కోర్), గేట్ స్కోర్ కలిగి ఉండాలి.
ఎంపిక: బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్)- జేఈఈ (మెయిన్) స్కోర్ ఆధారంగా, ఎంఈ/ ఎంటెక్/ ఎమ్మెస్సీ(ఇంజినీరింగ్)- గేట్ స్కోర్ ఆధారంగా.
స్కాలర్షిప్: యూజీ కోర్సులకు ఏడాది రూ.1,20,000 లేదా ఏడాది ఫీజు ఏది తక్కువైతే దాన్ని ఇస్తారు. పీజీ కోర్సులకు నెలకు రూ. 15,550/- లేదా ఏడాదికి రూ.1,86,000/ చొప్పున గరిష్ఠంగా రెండేండ్లు ఇస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో l చివరితేదీ: నవంబర్ 15
వెబ్సైట్: https://rac.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------
టీఎస్టీడబ్ల్యూఆర్ఈఐఎస్ గురుకుల విద్యాలయాల సంస్థ ఐఐటీ శిక్షణ నోటిఫికేషన్,
తెలంగాణ సాంఘిక సంక్షే, గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్టీడబ్ల్యూఆర్ఈఐఎస్) 2020-21 విద్యాసంవత్సరానికి కింది పరీక్షకు శిక్షణకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు లాంగ్‌టర్మ్ ఐఐటీ శిక్షణ
సీట్ల సంఖ్య: 100
అర్హతలు: 2019-20 జేఈఈ మెయిన్స్‌లో 60% పర్సంటైల్ వచ్చిన ఎస్సీ విద్యార్థుల, 50% పర్సంటైల్ వచ్చిన ఎస్టీ విద్యార్థులు మాత్రమే అర్హులు.
ఎంపిక: 2019-20 జేఈఈ మెయిన్స్ పర్సంటైల్ ఆధారంగా
దరఖాస్తు: సాంఘిక సంక్షేమ గురుకుల ఐఐటీ కోచింగ్ ప్రిన్సిపాల్, లాంగ్‌టర్మ్ కో-ఆర్డినేటర్‌ను ఫోన్లో సంప్రదించవచ్చు.
చివరితేదీ: అక్టోబర్ 30
తరగతులు ప్రారంభం: నవంబర్ 1
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: http://www.tgtwgurukulam.telangana.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------
నిమ్స్ పీజీడీ-2020 నోటిఫికేషన్,
హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) 2020 సంవత్సరానికి కింది ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రోగ్రామ్: పారా మెడికల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు (పీజీడీ)-2020
మొత్తం సీట్ల సంఖ్య: 118
విభాగాలు: మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ-12, అనెస్థీషియా టెక్నాలజీ-8, కార్డిక్ పల్మనరీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ-4, కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ-12,
డయాలసిస్ టెక్నాలజీ-40, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ-10, న్యూరో టెక్నాలజీ-2, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ-4, రేడియేషన్ థెరపీ టెక్నాలజీ-4, రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ-8, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ-12, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ టెక్నాలజీ-2 సీట్లు ఉన్నాయి.
కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు.
అర్హతలు: బీఎస్సీ (ఏదైనా సైన్స్ సబ్జెక్టులు/ లైఫ్ సైన్సెస్) ఉత్తీర్ణత.
వయస్సు: 2020, డిసెంబర్ 31 నాటికి 20-30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా
పరీక్ష విధానం: మల్టిపుల్ చాయిస్ విధానంలో మొత్తం 60 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో బయలాజికల్ సైన్సెస్ నుంచి 20, ఫిజికల్ సైన్సెస్ నుంచి 20, కమ్యూనిటీ మెడిసిన్, బయోస్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్సెస్,జీకే, ఇంగ్లిష్ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు.
ప్రశ్నలు డిగ్రీస్థాయిలో ఉంటాయి. జనరల్, బీసీ అభ్యర్థులకు కనీసం 50 మార్కులు వస్తే పరీక్షలో అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు.
కోర్సు ఫీజలు: మొదటి ఏడాది మొత్తం రూ.20,800/- చెల్లించాలి. రెండో ఏడాది ఫీజు కూడా దాదాపుగా ఇంతే ఉంటుంది.
జాబ్ ట్రెయినింగ్: కోర్సు పూర్తయిన తర్వాత ఏడాది ఆన్ జాబ్ ట్రెయినింగ్ ఉంటుంది. ఈ సమయంలో కన్సాలిడేటెడ్ పే చెల్లిస్తారు. దీని అనంతరం కోర్సుకు సంబంధించిన పూర్తి సర్టిఫికెట్లను ఇస్తారు.
ఆన్లైన్లో
చివరితేదీ: నవంబర్ 4
హార్డ్‌కాపీలు పంపడానికి చివరితేదీ: నవంబర్ 7
https://nims.edu.in
----------------------------------------------------------------------------------------------------------------------
లిటిల్ సోల్జర్స్ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్-2021 నోటిఫికేషన్.
దేశ రక్షణలోని త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను స్కూల్ లెవల్ నుంచే తయారుచేయాలనే లక్ష్యంతో కేంద్రం సైనిక స్కూళ్లను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణను సైనిక్ స్కూల్స్ సొసైటీ (ఎస్ఎస్ఎస్) నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూళ్లలో ఆరు, తొమ్మిదో తరగతి ప్రవేశాల ప్రవేశపరీక్ష ప్రకటన విడుదలైంది. ఈ వివరాలు నిపుణ పాఠకుల కోసం...
ప్రవేశాలు కల్పించే తరగతులు
ఆరు, తొమ్మిదో తరగతిలలో ప్రవేశాలు కల్పిస్తారు.
స్కూల్ ప్రత్యేకతలు
సైనిక్ స్కూల్లో ప్రవేశాలు పొందినవారికి సామాజిక, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరికీ నాణ్యమైన విద్యను, వసతిని ఉచితంగా అందిస్తారు.
పూర్తిస్థాయిలో క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంతోపాటు, దేశభక్తిని పెంపొందించే విధంగా ఇక్కడి బోధన ఉంటుంది.
త్రివిధ దళాల్లోకి ప్రవేశించడానికి అవసరమైన నైపుణ్యాలను పాఠశాల దశ నుంచే నేర్పిస్తారు.
ఎంపిక: జాతీయస్థాయిలో నిర్వహించే ఆల్ ఇండియా సైనిక్ సూల్స్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏఐఎస్ఎస్ఈఈ) ద్వారా.
సైనిక్ స్కూల్స్‌లో ప్రవేశాల కోసం పరీక్షను నిర్వహించే బాధ్యతను కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి అప్పగించింది. ఎన్టీఏ రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌లిస్ట్‌ను తయారుచేస్తుంది.
పరీక్ష విధానం
ఎంట్రన్స్ టెస్ట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు.
ఆరోతరగతి
ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఇస్తారు.
మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష కాలవ్యవధి 150 నిమిషాలు.
మ్యాథ్స్-50X3=150 మార్కులు,
ఇంటెలిజెన్సీ-25X2=50 మార్కులు, లాంగ్వేజ్-25X2=50 మార్కులు, జనరల్ నాలెడ్జ్-25X2=50 మార్కులు.
పరీక్ష ఇంగ్లిష్, తెలుగుతోపాటు మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఎవరు ఏ భాషలో రాయాలనుకుంటే ఆ భాషలో పరీక్ష రాయవచ్చు.
తొమ్మిదో తరగతి
దీనిలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఇస్తారు.
మొత్తం 400 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్షలో మ్యాథ్స్-200, ఇంటెలిజెన్స్-50, ఇంగ్లిష్-50, జనరల్ సైన్స్-50, సోషల్ సైన్స్-50 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.
నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
పరీక్ష కేవలం ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే నిర్వహిస్తారు.
నోట్: తెలంగాణ రాష్ర్టానికి చెందిన విద్యార్థులను ఆంధ్రప్రదేశ్‌లోని స్కూల్స్‌కు హోమ్ స్టేట్ కింద పరిగణనలోకి తీసుకుంటారు.
సీట్ల కేటాయింపు
ఏ రాష్ట్రంలోనైతే సైనిక స్కూల్ ఉంటుందో అక్కడ అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో ఆ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు 67%, ఇతర రాష్ర్టాలవారికి 33% సీట్లు కేటాయిస్తారు. అందులో ఎస్సీ-15%, ఎస్టీ-7.5%, ఇతర కులాలకు చెందిన
విద్యార్థులకు 27% రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50.50% సీట్లలో 25% మాజీ డిఫెన్స్ ఉద్యోగుల పిల్లలకు, మిగతా 25% ఇతర రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కేటాయించవచ్చు. ఈ కోటాలో ఒకే రాష్ర్టానికి మూడు కంటే ఎక్కువ సీట్లు కేటాయించడానికి వీలు లేదు.
నోట్: సాధారణంగా ప్రశ్నలు కనీస అర్హత తరగతి స్థాయిలో ఉంటాయి. నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ ప్రకారం ఆ తరగతుల్లోని అంశాలను చదివితే సరిపోతుంది. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నల సరళి అర్థమవుతుంది.
ఎవరు అర్హులు?
ఆరో తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థుల వయస్సు మార్చి 31, 2021 నాటికి 10-12 ఏండ్ల మధ్యలో ఉండాలి. అంటే ఏప్రిల్ 1, 2009 నుంచి మార్చి 31, 2011 మధ్యలో జన్మించినవారు అర్హులు. వయస్సు ధ్రువీకరణపత్రాన్ని సమర్పించాలి. బాలికలు కూడా ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
తొమ్మిదో తరగతిలోకి ప్రవేశాల కోసం మార్చి 31, 2021 నాటికి 13-15 ఏండ్ల మధ్యలో ఉండాలి. అంటే 2006, ఏప్రిల్ 1 నుంచి 2008 మార్చి 31 మధ్యలో జన్మించిన వారికే అర్హత లభిస్తుంది. ఎనిమిదో తరగతి పాసై ఉండాలి. అభ్యర్థులు ప్రవేశపరీక్షలో ఒక్కో సజ్జెక్టులో కనిష్ఠంగా 25% మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించాలి. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక దారుఢ్యపరీక్ష, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు
No comments:
Post a Comment