Thursday, 8 October 2020

ఆర్మీ స్కూల్స్‌లో 8 వేల టీచర్‌ పోస్టులు, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డ‌ర్స్‌లో 36 సూప‌ర్‌వైజ‌ర్ పోస్టులు, ఐఎఫ్‌బీలో 7 స్టెనోగ్రాఫర్‌, ఎల్‌డీసీ పోస్టులు.

 ఆర్మీ స్కూల్స్‌లో 8 వేల టీచర్‌ పోస్టులు,


దేశవ్యాప్తంగా వివిధ కంటోన్మెంట్లు, మిలటరీ స్టేషన్లలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యు్కేషన్‌ సొసైటీ (ఏడబ్ల్యూఈఎస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆస్తకి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 8 వేల టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ పోస్టులను భర్తీచేయనుంది. ఆన్‌లైన్‌లో అక్టోబర్‌ 20లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తామని వెల్లడించింది. అయితే ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని సంబంధిత పాఠశాలలు వెల్లడిస్తాయని తెలిపింది. దేశంలోని 137 ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌ (ఏపీఎస్‌)లో వీరిని నియమిస్తామని ప్రకటించింది. 


మొత్తం పోస్టులు: 8000


అర్మతలు: పీజీటీకి బీఈడీతోపాటు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత, టీజీటీ పోస్టులకు బీఈడీతోపాటు డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత, పీఆర్‌టీ పోస్టులకు బీఈడీ లేదా రెండేండ్ల డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసి ఉండాల. అభ్యర్థులు 40 ఏండ్లలోపువారై ఉండాలి. అనుభవం ఉన్నవారికైతే 57 ఏండ్ల వయస్సు ఉండాలి. స్క్రీనింగ్‌ టెస్టుకు సీటెట్‌ లేదా టెట్‌లో అర్హత సాధించాల్సిన అవసరం లేదు. 


ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, టీచింగ్‌ స్కిల్స్‌ ఎవాల్యుయేషన్‌


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌


అప్లికేషన్‌ ఫీజు: రూ.500


దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్‌ 1


దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 20


అడ్మిట్‌ కార్డులు: నవంబర్‌ మొదటి వారంలో


పరీక్ష తేదీ: నవంబర్‌ 21, 22


ఫలితాల విడుదల: డిసెంబర్‌ మొదటి వారంలో


వెబ్‌సైట్‌: http://aps-csb.in

---------------------------------------------------------------------------------------------------------------------

గార్డెన్ రీచ్ షిప్‌బిల్డ‌ర్స్‌లో 36 సూప‌ర్‌వైజ‌ర్ పోస్టులు,

కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ ఆధ్వ‌ర్యంలోని మినీర‌త్న కంపెనీ అయిన గార్డెన్ రీచ్ షిప్‌బిల్డ‌ర్స్‌ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ) ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఈ నెల 27 లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. 

మొత్తం పోస్టులు: 36

ఇందులో సూప‌ర్‌వైజ‌ర్-24 (అడ్మిన్‌, హెచ్ఆర్‌-3, ఫైనాన్స్‌-1, ఫార్మ‌సీ-4, సెక్యూరిటీ-3, నావ‌ల్ ఆర్కిటెక్చ‌ర్‌-1, మెకానిక‌ల్‌-5, ఎల‌క్ట్రిక‌ల్‌-3, సివిల్‌-3), డిజైన్ సూప‌ర్‌వైజ‌ర్స్‌-12 (మెకానిక‌ల్‌-4, ఎల‌క్ట్రిక‌ల్‌-3, ఎల‌క్ట్రానిక్స్‌-1, సివిల్‌-4) చొప్పున పోస్టులు ఉన్నాయి. 

అర్హ‌త‌లు: స‌ంబంధిత స‌బ్జెక్టులో డిగ్రీతోపాటు డిప్లొమాలో 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణుల‌వాల్సి ఉంది. టెక్నిక‌ల్ పోస్టుల‌కు సంబంధిత స‌బ్జెక్టులో డిప్లొమా చేసి ఉండాలి.  

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌. హార్డ్‌కాపీని ప్రింట్ తీసి, అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికెట్ల‌ను జ‌త‌చేసి సంబంధిత చిరునామాకు పంపించాలి. 

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష లేదా ఇంట‌ర్వ్యూ ద్వారా  ‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: అక్టోబ‌ర్ 27 

వెబ్‌సైట్‌: www.grse.in or https://jobapply.in/grse2020
---------------------------------------------------------------------------------------------------------------------
ఐఎఫ్‌బీలో 7 స్టెనోగ్రాఫర్‌, ఎల్‌డీసీ పోస్టులు.


నగరంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ బయోడైవర్సిటీ (ఐఎఫ్‌బీ)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ (ఐసీఎఫ్‌ఆర్‌ఈ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను వచ్చేనెల 24 లోపు పంపించాలని కోరింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా స్టెనోగ్రాఫర్‌, ఎల్‌డీసీ‌, ఎంటీఎస్‌ పోస్టులను భర్తీచేయనుంది. 

మొత్తం పోస్టులు: 7

ఇందులో  గ్రేడ్‌-2 స్టెనోగ్రాఫర్‌- 1, లోయర్‌ డివిజన్‌ క్లర్క్-1‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌-5 చొప్పున ఖాళీలు ఉన్నాయి. 

అర్హతలు: స్టెనోగ్రాఫర్‌ పోస్టుకు ఇంటర్‌ పాసై ఉండాలి. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో సర్టిఫికెట్‌ కోర్సు చేసి, హిందీ లేదా ఇంగ్లిష్‌లో నిమిషానికి 80 పదాలు టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి. ఎల్‌డీసీ పోస్టుకు ఇంటర్‌ పాసై ఇంగ్లిష్‌లో నిమిషానికి 30 పదాలు టైప్‌ చేయగలగాలి. ఎంటీఎస్‌ పోస్టుకు పదోతరగతి పాసై ఉండాలి. 27 ఏండ్లలోపువారై ఉండాలి. 

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. నిర్ణీత నమూనాలో ఉన్న అప్లికేషన్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని, పూర్తిగా నింపి అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్‌ 24

వెబ్‌సైట్‌: websites www.icfre.gov.in or www.ifb.icfre.gov.in

No comments:

Post a Comment