Tuesday, 24 November 2020

ఎస్‌బీఐ 2000 పీవో పోస్టులు, ఎన్టీపీసీలో 70 డిప్లొమా ఇంజినీర్‌ పోస్టులు, కోస్ట్‌గార్డ్డ్‌లో నావిక్‌ పోస్టులు, ఎన్‌ఎండీసీ నైస్‌ ఫెలోషిప్‌, నిట్‌లో పీజీ, పీహెచ్‌డీ,నార్మ్‌లో పీజీ డిప్లొమా,పీఎస్‌టీఐ లో పీజీ డిప్లొమా,ఎన్‌ఎంఎల్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

ఎస్‌బీఐ 2000 పీవో పోస్టులు,


దేశంలో అతిపెద్ద బ్యాంక్‌. ఆకర్షణీయమైన జీతభత్యాలు. పదోన్నతులకు అవకాశం. కేవలం డిగ్రీ ఉత్తీర్ణత ఉంటే చాలు. మూడుదశల్లో నిర్వహించే పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. బ్యాంక్‌ పీవో నుంచి సీఎండీ వరకు పదోన్నతి పొందే అవకాశం కల భద్రమైన బ్యాంక్‌ కొలువు. ఎస్‌బీఐలో పీవో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ పరీక్ష విధానం, ఎంపిక తదితరాల పై సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం....


దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


పోస్టు: ప్రొబేషనరీ ఆఫీసర్‌


పేస్కేల్‌: ప్రారంభవేతనం రూ.27,620/- (రూ.23,700-42020) వీటితోపాటు ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.


మొత్తం ఖాళీలు: 2000


కేటగిరీల వారీగా ఖాళీలు: 

ఎస్సీ-300, ఎస్టీ-150, ఓబీసీ-540, ఈడబ్ల్యూఎస్‌-200, జనరల్‌-810 పోస్టులు ఉన్నాయి. వీటిలో పీహెచ్‌సీలకు కొత్త ఖాళీలలో 60, బ్యాక్‌లాగ్‌-63 పోస్టులు ఉన్నాయి.


అర్హతలు: 2020, డిసెంబర్‌ 31 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు రాయనున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు 2020, డిసెంబర్‌ 31 నాటికి డిగ్రీ ఉత్తీర్ణత సాధించినట్లు సర్టిఫికెట్‌/రుజువు చూపించాలి.



 

వయస్సు: 2020, ఏప్రిల్‌ 1 నాటికి 21 -30 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1999, ఏప్రిల్‌ 1 నుంచి 1990, ఏప్రిల్‌ 2 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.


ఎంపిక విధానం

మూడు దశల్లో జరుగుతుంది.

ఫేజ్‌-1 ప్రిలిమనరీ ఎగ్జామ్‌

ప్రిలిమినరీ ఎగ్జామ్‌

ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు.

పరీక్ష 100 ప్రశ్నలు, 100 మార్కులు.

పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌కు నిర్దిష్ట సమయం ఉంటుంది.

ఇంగ్లిష్‌ 30 ప్రశ్నలు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌-35, రీజనింగ్‌ ఎబిలిటీ-35 ప్రశ్నలు ఇస్తారు.

ప్రతి సెక్షన్‌కు 20 నిమిషాల చొప్పున మొత్తం మూడు సెక్షన్లకు 60 నిమిషాలు.

ప్రిలిమినరీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టుల సంఖ్యకు సుమారు 10 రెట్ల మంది అభ్యర్థులను ఫేజ్‌-2కు ఎంపిక చేస్తారు.

ఫేజ్‌-2 మెయిన్‌ ఎగ్జామ్‌

మెయిన్‌ పరీక్షలో 200 మార్కుల ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌, 50 మార్కుల డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ ఉంటుంది.

ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌ అయిన తర్వాత కంప్యూటర్‌పై డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ను టైపింగ్‌ చేసి జవాబులు రాయాలి.

డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌: 30 నిమిషాల వ్యవధిలో నిర్వహిస్తారు. దీనిలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌పై రెండు ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 50 మార్కులు. 

దీనిలో లెటర్‌ రైటింగ్‌, ఎస్సై ఉంటుంది.

నోట్‌: ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌లో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/4 వంతు మార్కులు కోతవిధిస్తారు. 

ఫేజ్‌-3: ఫేజ్‌-2లో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టుల సంఖ్యను బట్టి మూడురెట్లు మంది అభ్యర్థులను ఎంపికచేస్తారు. 

ఈ దశలో ఇంటర్వ్యూ (50 మార్కులకు) లేదా ఇంటర్వ్యూ (30 మార్కులు), గ్రూప్‌ ఎక్సర్‌సైన్‌ (20 మార్కులకు) నిర్వహిస్తారు.

ఫేజ్‌-3లో కనీస క్వాలిఫయింగ్‌ మార్కులు వస్తే తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకుంటారు.

తుదిఎంపిక: ఫేజ్‌-1లో మార్కులు తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. ఫేజ్‌-2, ఫేజ్‌-3లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో జాయిన్‌ అయ్యేదానికంటే ముందే ఆన్‌లైన్‌లో బేసిక్‌ బ్యాంకింగ్‌ నాలెడ్జ్‌ కోర్సు పూర్తిచేయాలి.

అదేవిధంగా కనీసం మూడేండ్లు ఈ బ్యాంక్‌లో పనిచేస్తానని బాండ్‌ సమర్పించాల్సి ఉంటుంది.

సబ్జెక్టు  

ప్రశ్నల సంఖ్య

మార్కులు

కాలవ్యవధి (నిమిషాలు)

రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌

45 60 60

డాటా అనాలసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్

35 60 45

జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ 

40 40 35

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌

35 40 40

మొత్తం

155 200 3 గంటలు



ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో


దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీలకు రూ.750/-, 


ఎస్సీ,ఎస్టీ, పీహెచ్‌సీలకు ఎటువంటి ఫీజు లేదు


పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌


చివరితేదీ: డిసెంబర్‌ 4


రాష్ట్రంలో ప్రిలిమ్స్‌ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, 


కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌.


పూర్తి వివరాల కోసం  


వెబ్‌సైట్‌: https://bank.sbi/web/careers

-----------------------------------------------------------------------------------------------------------------------

ఎన్టీపీసీలో 70 డిప్లొమా ఇంజినీర్‌ పోస్టులు,

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్టీపీసీ) డిప్లొమా ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ పోస్టులకు ఎపింకైనవారు జార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ ప్రాజెక్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. రెండేండ్లు శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో ప్రతినెల రూ.24 వేల చొప్పున చెల్లిస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసినవారిని రెగ్యూలర్‌ చేస్తారు. దరఖాస్తులు అధికారిక వెబ్‌సైట్‌లో వచ్చే నెల 12 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. 

మొత్తం పోస్టులు: 70

ఇందులో మైనింగ్‌-40, మెకానికల్‌-12, ఎలక్ట్రికల్‌-10, మైన్‌ సర్వే-8 చొప్పున ఖాళీలు ఉన్నాయి. 

అర్మతలు: మైనింగ్‌ లేదా మైనింగ్‌ అండ్‌ మైన్‌ సర్వేయింగ్‌, ఎలక్ట్రికల్‌ లేదా ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌ లేదా ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌, సర్వే లేదా మైనింగ్‌ ఇంజినీరింగ్‌లో 70 శాతం మార్కులతో డిప్లొమా పూర్తిచేయాలి.

ఎంపికవిధానం: రాతపరీక్ష, టెక్నికల్‌ టెస్ట్‌ (ఆన్‌లైన్‌లో)

దరఖాస్తు ఫీజు: రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు ఎలాంటి ఫీజు లేదు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులు ప్రారంభం: నవంబర్‌ 23

అప్లికేషన్లకు చివరితేదీ: డిసెంబర్‌ 12

వెబ్‌సైట్‌: www.ntpccareer.net 
-----------------------------------------------------------------------------------------------------------------------
 కోస్ట్‌గార్డ్డ్‌లో నావిక్‌ పోస్టులు,

ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ నావిక్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పోస్టులు:  కుక్‌, స్టీవార్డ్‌

ప్రకటన:  నావిక్‌ (డొమెస్టిక్‌ బ్రాంచ్‌) - 01/2021 బ్యాచ్‌

మొత్తం ఖాళీలు:  50

అర్హతలు:  పదోతరగతి ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.

వయస్సు: 2021, ఏప్రిల్‌ 1 నాటికి 18-22 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక:  రాతపరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, మెడికల్ టెస్టుల ద్వారా

దరఖాస్తు:  ఆన్‌లైన్‌లో నవంబర్‌ 30 నుంచి ప్రారంభం   

చివరితేదీ: 2020, డిసెంబర్‌ 7

ఈ-అడ్మిట్‌ కార్డ్‌: 2020, డిసెంబర్‌ 19-25 మధ్య డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. వెబ్‌సైట్‌:  https://joinindiancoastguard.gov.in

-----------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఎండీసీ నైస్‌ ఫెలోషిప్‌.


దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, ఇన్నోవేషన్‌ స్ఫూర్తిని ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పరిచిందే నైస్‌. నైస్‌ అంటే.. ఎన్‌ఎండీసీ ఇన్నోవేషన్‌ అండ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌. ఈ ప్రోగ్రామ్‌ను ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌, ఐఐటీ హైదరాబాద్‌లోని స్టార్టప్‌ సపోర్ట్‌ సిస్టమ్‌.. ఐ-టీఐసీ ఫౌండేషన్‌లకు చెందిన ఈ ఇంక్యుబేషన్‌- ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌. ఇది ఐదేండ్ల్ల పాటు కొనసాగుతుంది. 

లక్ష్యం: ఈ ప్రోగ్రామ్‌ ద్వారా 15 అంకుర సంస్థలకు, 15 ఫెలోషిప్పులకు ఆర్థికపరంగానే కాకుండా మౌలిక సదుపాయాలు, మార్గదర్శనం లాంటి ప్రయోజనాలను అందిస్తారు.

Salient features

ఈ ప్రోగ్రామ్‌ మొత్తం బడ్జెట్‌ రూ.10 కోట్లు.

ఈ ప్రోగ్రామ్‌ ద్వారా 15 స్టార్టప్స్‌కు చేయూతనిస్తారు. ఏడాదికి ఐదు చొప్పున

ప్రతి స్టార్టప్‌కు ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ రెండేండ్లు. దీనిని అవసరమైతే పొడిగిస్తారు.


 
స్టార్టప్‌ డొమైన్‌- డీప్‌ టెక్నాలజీ, ప్రత్యేకమైన డొమైన్‌ ఏదీ లేదు. 

ఎవరు అర్హులు?

కనీసం గ్రాడ్యుయేట్‌ అయి ఉండాలి. ఇంజినీరింగ్‌, మెడికల్‌/సైన్స్‌ నేపథ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

వయస్సు 18-35 ఏండ్ల మధ్య ఉండాలి.

డీప్‌ టెక్నాలజీపై సరికొత్త మౌలిక ఆలోచనలు ఉండాలి.

ఇండియన్‌ సిటిజెన్‌ అయి ఉండాలి. ఆదాయం ఆశించకుండా పూర్తి సమయం పనిచేయడానికి సంసిద్ధంగా ఉండాలి.

దరఖాస్తుదారుల్లోంచి ఎంపికైనవారికి ఈ-మెయిల్‌ ద్వారా డిసెంబర్‌ 20కల్లా సమాచారం అందిస్తారు. వారు తర్వాతి దశ ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.  

ప్రోత్సాహం

నైస్‌ ఇంక్యుబేషన్‌ ప్రోగ్రాం ద్వారా అంకుర (స్టార్టప్‌) సంస్థలు విజయవంతమైన బిజినెస్‌ ఎంటర్‌ప్రైజ్‌లుగా వృద్ధిచెందేలా సహకారం అందిస్తారు. 

ఎంపికైన అంకుర సంస్థకు రూ.25 లక్షలు, ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. 

ముఖ్యతేదీలు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: 2020, డిసెంబర్‌ 6

వెబ్‌సైట్‌: https://i-tic.iith.ac.in/nmdc-i-tic-nice-program 
-----------------------------------------------------------------------------------------------------------------------
నిట్‌లో పీజీ, పీహెచ్‌డీ

ఏపీ తాడేపల్లిగూడెంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో 2020-21 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.

ప్రోగ్రామ్స్‌: ఎంఎస్‌ (రిసెర్చ్‌), పీహెచ్‌డీ (ఫుల్‌ టైం)/ పీహెచ్‌డీ (పార్ట్‌ టైం)-డిసెంబర్‌ 2020


 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ (ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ)/ మాస్టర్స్‌ డిగ్రీ రిసెర్చ్‌ (ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ) ఉత్తీర్ణత, గేట్‌/ నెట్‌ అర్హత ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 

చివరితేదీ: నవంబర్‌ 28

వెబ్‌సైట్‌: https://www.nitandhra.ac.in
-----------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఎంఎల్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

జంషెడ్‌పూర్‌లోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ మెటలర్జికల్‌ ల్యాబొరేటరీ (ఎన్‌ఎంఎల్‌)లో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 49

పోస్టులు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్‌ జేఆర్‌ఎఫ్‌, ప్రాజెక్ట్‌ ఎస్‌ఆర్‌ఎఫ్‌, అసిస్టెంట్‌ తదితరాలు ఉన్నాయి.

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, బీటెక్‌, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ద్వారా

దఖాస్తు: ఆన్‌లైన్‌లో.. చివరితేదీ: డిసెంబర్‌ 3

వెబ్‌సైట్‌: https://www.nmlindia.org
-----------------------------------------------------------------------------------------------------------------------
పీజీ డిప్లొమాలు

బెంగళూరులోని నేషనల్‌ పవర్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌పీటీఐ)కు చెందిన పవర్‌ సిస్టమ్స్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (పీఎస్‌టీఐ)లో పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది.

కోర్సు: పీజీ డిప్లొమా ఇన్‌ ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌.

కాలవ్యవధి: 26 వారాలు.. సీట్ల సంఖ్య: 60

అర్హతలు: ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ పవర్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.

వయసు: ఎటువంటి వయోపరిమితి లేదు.

ఎంపిక: అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా చేస్తారు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో

దరఖాస్తు ఫీజు: రూ.500..   చివరితేదీ: డిసెంబర్‌ 4

వెబ్‌సైట్‌: http://www.nptibangalore.in
-----------------------------------------------------------------------------------------------------------------------
నార్మ్‌లో పీజీ డిప్లొమా

హైదరాబాద్‌లోని ఐకార్‌- నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (నార్మ్‌)లో దూరవిద్యావిధానంలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.

కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌.

కాలవ్యవధి: ఏడాది

అర్హతలు: ఏదైనా డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత, సంబంధిత పని అనుభవం ఉండాలి.

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం ఆధారంగా 

దరఖాస్తు: వెబ్‌సైట్‌లో     చివరితేదీ: డిసెంబర్‌ 15

వెబ్‌సైట్‌: https://naarm.org.in

No comments:

Post a Comment