Tuesday, 24 November 2020

బీఈఎల్‌లో 1059 ప్రాజెక్ట్ ఆఫీస‌ర్‌, ట్ర‌యినీ ఇంజినీర్ పోస్టులు, ఎన్బీసీసీలో 100 ఇంజినీర్ పోస్టులు, ఐసీఎమ్మార్‌లో 80 అసిస్టెంట్ పోస్టులు, యూపీఎస్సీ 35 ఉద్యోగాలు .

బీఈఎల్‌లో 1059 ప్రాజెక్ట్ ఆఫీస‌ర్‌, ట్ర‌యినీ ఇంజినీర్ పోస్టులు,


దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులు, యూనిట్ల‌లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్ర‌యినీ ఇంజినీర్‌, ఇత‌ర పోస్టుల భ‌ర్తీకి ప‌్ర‌భుత్వరంగ సంస్థ అయిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ (బీఈఎల్) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేష‌న్లు అందుబాటులో ఉన్నాయ‌ని వెల్ల‌డించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా వెయ్యికిపైగా పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నుంది.   


ఈ పోస్టులు పంచ‌కుల‌, బెంగళూరు ఎక్స్‌పోర్ట్ మాన్యుఫాక్చ‌రింగ్ ఎస్‌బీయూ, ఐపీఎస్ఎస్ ప్రాజెక్ట్, బెంగ‌ళూరు యూనిట్ల‌లో ఖాళీగా ఉన్నాయి.  


మొత్తం పోస్టులు: 1059


బెంగ‌ళూరు యూనిట్‌లో ఖాళీగా ఉన్న పోస్టులు.. ప్రాజెక్ట్ ఇంజినీర్- 118 (ఎల‌క్ట్రానిక్స్‌-80, మెకానిక‌ల్‌-24, కంప్యూట‌ర్ సైన్స్‌-6, ఎల‌క్ట్రిక‌ల్‌-6, సివిల్‌-2), ప్రాజెక్ట్ ఆఫీస‌ర్‌-5, ట్ర‌యినీ ఇంజినీర్‌-418 (ఎల‌క్ట్రానిక్స్‌-254, మెకానిక‌ల్‌-137, కంప్యూట‌ర్ సైన్స్‌-11, ఎల‌క్ట్రిక‌ల్‌-10, సివిల్‌-2, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌-1, ఆర్కిటెక్చ‌ర్‌-1, కెమిక‌ల్‌-2), ట్రయినీ ఆఫీస‌ర్ (ఫైనాన్స్‌)-8 ఖాళీలు ఉన్నాయి. 


ఎక్స్‌పోర్ట్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ ఎస్బీయూలో.. ట్రయినీ ఇంజినీర్‌- 100, ప్రాజెక్ట్ ఇంజినీర్‌-125 పోస్టులు


ఐపీఎస్ఎస్ ప్రాజెక్ట్‌, బెంగ‌ళూరు యూనిట్‌లో.. ట్ర‌యినీ ఇంజినీర్‌-160 పోస్టులు


పంచ‌కుల యూనిట్, ప్రాజెక్టుల్లో.. ట్రయినీ ఇంజినీర్-33 (ఎల‌క్ట్రానిక్స్‌-15, మెకానిక‌ల్‌-18), ట్ర‌యినీ ఆఫీస‌ర్-2 (ఫైనాన్స్‌), ట్రయినీ ఇంజినీర్‌-2-60 పోస్టులు, ప్రాజెక్ట్ ఇంజినీర్- 29 (ఎల‌క్ట్రానిక్స్‌-25, సివిల్‌-2, ఎల‌క్ట్రిక‌ల్‌-2), ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ (హెచ్ఆర్‌)-1 చొప్పున ఖాళీలు ఉన్నాయి. 


అర్హ‌త‌లు: బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ లేదా బీఆర్క్‌లో సంబంధిత స‌బ్జెక్టులో ఇంజినీరింగ్ చేసి ఉండాలి. ఫైనాన్స్ పోస్టుల‌కు ఎంబీఏ పూర్తిచేసి ఉండాలి. హెచ్ఆర్ పోస్టుల‌కు ఎంబీఏ లేదా ఎమ్మెస్‌డ‌బ్ల్యూ చేసి ఉండాలి. 


ఎంపిక విధానం: ‌రాత‌ప‌రీక్ష ద్వారా 


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో


అప్లికేష‌న్ ఫీజు: ట‌్రయినీ ఆఫీస‌ర్‌, ఇంజినీర్ పోస్టుల‌కు రూ.200, ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ పోస్ట‌ల‌కు రూ.500, ఎస్టీ, ఎస్సీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు. 


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: న‌వంబ‌ర్ 21, 25


వెబ్‌సైట్‌: bel-india.in

-----------------------------------------------------------------------------------------------------------------------

ఎన్బీసీసీలో 100 ఇంజినీర్ పోస్టులు,


న‌వ‌ర‌త్న హోదా క‌లిగిన‌ కేంద్ర ప్ర‌భుత్వ‌రంగ సంస్థ నేష‌న‌ల్ బిల్డింగ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కార్పొరేష‌న్ (ఎన్బీసీసీ) లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థుల నుంచి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను కోరుతున్న‌ది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చేనెల 15 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 100 సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్ పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నుంది. అభ్య‌ర్థుల‌ను రాత‌ప‌రీక్ష లేదా ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌చేయ‌నుంది. 


మొత్ం పోస్టులు: 100


ఇందులో సివిల్ ఇంజినీర్-80 (జ‌న‌ర‌ల్‌-34, ఓబీసీ-20, ఎస్సీ-13, ఎస్టీ-6, ఈడ‌బ్ల్యూఎస్‌-7)‌, ఎల‌క్రిక‌ల్ ఇంజినీర్-20 (జ‌న‌ర‌ల్‌-10, ఓబీసీ-5, ఎస్సీ-3, ఎస్టీ-1, ఈడ‌బ్ల్యూఎస్‌-1) చొప్పున ఉన్నాయి. 


అర్హ‌త‌: బీఈ లేదా బీటెక్‌లో సివిల్, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించాలి. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి. 


ఎంపిక ప్ర‌క్రియ‌: రాత‌ప‌రీక్ష లేదా ఇంట‌ర్వ్యూ 


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. హార్డ్‌కాపీని ప్రింట్ తీసి, అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికెట్ల‌ను జ‌త‌చేసి సంబంధిత చిరునామాకు పంపించాలి. 


అప్లికేష‌న్ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు. 


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: డిసెంబ‌ర్ 15


వెబ్‌సైట్‌: www.nbccindia.com

-----------------------------------------------------------------------------------------------------------------------

ఐసీఎమ్మార్‌లో 80 అసిస్టెంట్ పోస్టులు,


భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌)లో ఖాళీగా ఉన్న గ్రూప్ బీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆస‌క్తి, ఆర్హ‌త‌ క‌లిగిన భ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 80 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ద‌ర‌ఖాస్తులు వ‌చ్చేనెల 3 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది.  


మొత్తం పోస్టులు: 80


అర్హ‌త‌: గుర్తింపు పొందిన విశ్వ‌విద్యాల‌యం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 30 ఏండ్ల లోపు వయ‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి. 


ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ ఆధారిత రాత‌ప‌రీక్ష‌


దర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో


అప్లికేష‌న్ ఫీజు: ‌రూ.1500, ఎస్సీ, ఎస్టీ, మ‌హిళ‌లు, ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు రూ.1200, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు.  


అప్లికేష‌న్ల‌కు చివ‌రితేదీ: డిసెంబ‌ర్ 3


అడ్మిట్ కార్డుల విడుద‌ల‌: డిసెంబ‌ర్ 21‌


ప‌రీక్ష తేదీ: 2021, జ‌న‌వ‌రి 3


వెబ్‌సైట్‌: www.icmr.gov.in 

-----------------------------------------------------------------------------------------------------------------------

యూపీఎస్సీ 35 ఉద్యోగాలు .



కేంద్ర ప్ర‌భుత్వంలోని వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఈరోజు నుంచి ప్రారంభ‌మ‌య్యింది. అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 35 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇందులో ప‌బ్లిక్ హెల్త్ స్పెష‌లిస్ట్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, ట్యూట‌ర్‌, మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, స్టాఫ్ న‌ర్స్‌, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ వంటి పోస్టులు ఉన్నాయి. 

మొత్తం ఖాళీలు-35

ఇందులో గ్రేడ్‌-3 ప‌బ్లిక్ హెల్త్ స్పెష‌లిస్ట్‌-17, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌-1, మెడిక‌ల్ ఆఫీస‌ర్‌-2, స్టాఫ్ న‌ర్స్‌-2, అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌-13 చొప్పున ఖాళీలు ఉన్నాయి. 

అర్హ‌త‌: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత సూప‌ర్ స్పెషాలిటీలో డిప్లొమా లేదా పీజీ చేసి ఉండాలి. న‌ర్సింగ్‌లో పీజీ, ఇంట‌ర్ లేదా డిప్లొమా, డిగ్రీ పాసై ఉండాలి. సంబంధిత రంగంలో అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి.   

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ద్వారా ‌

ద‌ర‌ఖాస్తుల ప్రారంభం: న‌వంబ‌ర్ 14

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ‌డిసెంబ‌ర్ 3

వెబ్‌సైట్‌: upsc.gov.in

No comments:

Post a Comment