Thursday, 5 November 2020

ఐబీపీఎస్ ఎస్‌వో నోటిఫికేష‌న్‌ 645 ఉద్యోగాలు, సీడాక్ ముంబైలో 60 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు, ఎన్‌సీఎల్‌లో 45 టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు, బీఈఎల్‌లో 125 ప్రాజెక్ట్‌, ట్ర‌యినీ ఇంజినీర్స పోస్టులు, న‌వోద‌య విద్యాల‌యాల్లో 6 త‌ర‌గ‌తి ప్ర‌వేశాలు.

 ఐబీపీఎస్ ఎస్‌వో నోటిఫికేష‌న్‌ 645  ఉద్యోగాలు,


ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సో‌న‌ల్ (ఐబీపీఎస్‌) వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న‌ స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ (ఎస్‌వో) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 645 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇందులో ఐటీ ఆఫీస‌ర్‌, అగ్రిక‌ల్చుర‌ల్ ఆఫీస‌ర్‌, రాజ్‌భాష‌ అధికారి, లా ఆఫీస‌ర్‌, హెచ్ఆర్‌, మార్కెటింగ్ ఆఫీస‌ర్‌, నియామ‌క ప్ర‌క్రియ‌ను మూడు ద‌శ‌ల్లో నిర్వ‌హిస్తుంది. ప్రిలిమిన‌రీ, మెయిన్స్ ప‌రీక్షల్లో వ‌చ్చిన మార్కుల ఆధారంగా ఇంట‌ర్వ్యూకి అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌చేస్తుంది. దీనికోసం జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తుంది. 


ఈ బ్యాంకుల్లో ఖాళీలు..

ఈ నియామ‌క ప్ర‌క్రియ‌లో మొత్తం 11 బ్యాంకులు పాల్గొంటున్నాయి. అవి.. సెంట్ర‌ల్ బ్యాంక్‌, ఇండియ‌న్ ఓవ‌ర్‌సిస్ బ్యాంక్‌, సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియ‌న్ బ్యాంక్‌, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర‌లో ఈ ఖాళీలు ఉన్నాయి. 


మొత్తం ఖాళీలు: 645


ఇందులో ఐటీ ఆఫీస‌ర్‌-20 ఖాళీలు, అగ్రిక‌ల్చుర‌ల్ ఫీల్డ్ ఆఫీస‌ర్‌-485, మార్కెటింగ్ ఆఫీస‌ర్‌-60, లా ఆఫీస‌ర్‌-50, హెచ్ఆర్ లేదా ప‌ర్స‌న‌ల్ ఆఫీస‌ర్‌-7, రాజ్‌భాష‌ అధికారి-25 ఖాళీలు ఉన్నాయి. 


అర్హ‌త‌లు..

 ఐటీ ఆఫీస‌ర్‌- ఇంజినీరింగ్ చేసి ఉండాలి లేదా కంప్యూట‌ర్ సైన్స్ లేదా కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌లో డిగ్రీ చేసి ఉండాలి. 


అగ్రిక‌ల్చ‌ర్ ఫీల్డ్ ఆఫీస‌ర్‌- అగ్రిక‌ల్చ‌ర్‌లో నాలుగేండ్ల డిగ్రీ చేసి ఉండాలి. రాజ్‌భాష అధికారి పోస్టుకు ఇంగ్లిష్, హిందీ స‌బ్జెక్టుల‌తో డిగ్రీ చేసి పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 


లా ఆఫీస‌ర్ పోస్టుల‌కు- ఎల్ఎల్‌బీ చేసి ఉండాలి.


హెచ్ఆర్‌-  ప‌ర్స‌న‌ల్ మేనేజ్‌మెంట్ లేదా ఇండ‌స్ట్రియ‌ల్ రిలేష‌న్స్‌లో పీజీ చేసి ఉండాలి. 


మార్కెటింగ్ ఆఫీస‌ర్‌- ఎంబీఏ మార్కెటింగ్ లేదా ఎమ్మెమ్మెస్ మార్కెటింగ్ చేసి ఉండాలి. 20 నుంచి 30 ఏండ్ల లోపువారై ఉండాలి (అన్ని పోస్టుల‌కు).


ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ


ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌


అప్లికేష‌న్ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు రూ.175


ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: న‌వంబ‌ర్ 2


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: న‌వంబ‌ర్ 23


అడ్మిట్‌కార్డుల విడుద‌ల‌: ‌డిసెంబ‌ర్‌లో


ప్రిలిమిన‌రీ ఎగ్జామ్‌: ‌డిసెంబ‌ర్ 26, 27


ప్రిలిమినరీ ప‌రీక్ష ఫ‌లితాలు: 2021 జ‌న‌వ‌రి


మెయిన్స్ అడ్మిట్ కార్డులు: 2021 జ‌న‌వ‌రి


మెయిన్స్ ప‌రీక్ష‌: 2021 జ‌న‌వ‌రి 24


మెయిన్స్ ఫ‌లితాలు: 2021 ఫిబ్ర‌వ‌రి‌


ఇంట‌ర్వ్యూ అడ్మిట్ కార్డులు: 2021 ఫిబ్ర‌వ‌రి


ఇంట‌ర్వ్యూ: 2021 ఏప్రిల్‌


వెబ్‌సైట్‌: www.ibps.in

---------------------------------------------------------------------------------------------

సీడాక్ ముంబైలో 60 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు,


మహారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని సెంట‌ర్ ఫర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్‌)లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది.


మొత్తం పోస్టులు: 60


ఇందులో డాటాబేస్ ఇంజినీర్‌, టెస్ట్ ఇంజినీర్‌, ఐటీ ఇంజినీర్‌, డిజాస్ట‌ర్ రిక‌వ‌రీ ఇంజినీర్‌, డాటాబేస్ స్పెష‌లిస్ట్‌, సాఫ్ట్‌వేర్ డిజైన్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ పోస్టులు ఉన్నాయి. 


అర్హ‌త‌లు: బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏలో మొద‌టి శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో క‌నీసం రెండేండ్ల అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి. 


ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ద్వారా. విద్యార్హ‌త‌, అనుభ‌వం ఆధారంగా ఎంపిక చేసిన అభ్య‌ర్థులను ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో   


ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్య్లూడీ, ఈడ‌బ్ల్యూఎస్, మ‌హిళా అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు.   


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: న‌వంబ‌ర్ 15


వెబ్‌సైట్‌: www.cimfr.nic.in, www.cdac.in

---------------------------------------------------------------------------------------------

ఎన్‌సీఎల్‌లో 45 టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు,

వివిధ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నేష‌న‌ల్ కెమిక‌ల్ ల్యాబొరేట‌రీ (ఎన్‌సీఎల్‌) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌, ఆస‌క్తి, అనుభ‌వం ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. ఉద్యోగం పొందిన‌వారు పుణెలో ప‌నిచేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌ను ప్రింట్ తీసి సంబంధిత చిరునామాకు వ‌చ్చేనెల 31లోపు పంపించాలి.

మొత్తం పోస్టులు: 45

ఇందులో సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌-3, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్-12, టెక్నిక‌ల్ అసిస్టెంట్‌-10, టెక్నీషియ‌న్-20 చొప్పున ఖాళీలు ఉన్నాయి. 

అర్హ‌త‌: ‌త‌ప్ప‌నిస‌రిగా ప‌దోత‌ర‌గ‌తి పాసై ఉండాలి. అదేవిధంగా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసిన‌వారు ద‌రఖాస్తు చేసుకోవ‌చ్చు.  

అప్లికేష‌న్ విధానం: ఆన్‌లైన్‌లో

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ద్వారా‌

ద‌రఖాస్తులు ప్రారంభం: న‌వంబ‌ర్ 2

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: డిసెంబ‌ర్ 2 ‌

వెబ్‌సైట్‌: http://recruit.ncl.res.in
---------------------------------------------------------------------------------------------
బీఈఎల్‌లో 125 ప్రాజెక్ట్‌, ట్ర‌యినీ ఇంజినీర్స పోస్టులు,

ప‌్ర‌భుత్వరంగ సంస్థ భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 125 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇందులో ప్రాజెక్ట్ ఇంజినీర్‌-1, ట్ర‌యినీ ఇంజినీర్‌, ఇత‌ర పోస్టులు ఉన్నాయి. ఈనెల 25లోపు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని సూచించింది. 

మొత్తం పోస్టులు: 125

ఇందులో ట్ర‌యినీ ఇంజినీర్‌- 95 (ఎల‌క్ట్రానిక్స్‌-15, మెకానిక‌ల్‌-18, ఫైనాన్స్‌-2, ట్ర‌యినీ ఇంజినీర్స్-2-60), ప్రాజెక్ట్ ఇంజినీర్- 30 (ఎల‌క్ట్రానిక్స్‌-25, సివిల్‌-2, ఎల‌క్ట్రిక‌ల్‌-2, హ్యూమ‌న్ రిసోర్స్‌-1) 

అర్హ‌త‌: ఎల‌క్ట్రానిక్స్‌, సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌లో బీఈ లేదా బీటెక్ లేదా ఎస్సీ పూర్తి చేసిఉండాలి. ఎంబీఏ ఫైనాన్స్‌, హెచ్ఆర్ చేసి ఉండాలి. న‌వంబ‌ర్ 1 నాటికి 25 నుంచి 28 ఏండ్ల‌లోపు వ‌య‌స్సు ఉన్న‌వారై ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. హార్డ్‌కాపీని ప్రింట్ తీసి అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికెట్ల‌ను జ‌త‌చేసి సంబంధిత చిరునామాకు పంపించాలి. 

ద‌ర‌ఖాస్తు ఫీజు: ట‌్ర‌యినీ ఇంజినీర్ పోస్టుల‌కు రూ.200, ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు. 

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: న‌వంబ‌ర్ 25

వెబ్‌సైట్‌: https://bel-india.in
---------------------------------------------------------------------------------------------

న‌వోద‌య విద్యాల‌యాల్లో 6 త‌ర‌గ‌తి ప్ర‌వేశాలు.

దేశ‌వ్యాప్తంగా ఉన్న జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో (జేఎన్‌వీ) వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రానికిగాను ఆరో త‌ర‌గ‌తి ప్ర‌వేశ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ప్ర‌వేశ‌ప‌రీక్ష (జేఎన్‌వీఎస్‌టీ)‌కు సంబంధించి ఈరోజు నుంచి ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని జేఎన్‌వీఎస్ వెల్ల‌డించింది. అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inలో డిసెంబ‌ర్ 15 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. ఈ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ను వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 10న ఉద‌యం 11.30 గంట‌ల‌కు దేశంలోని అన్ని జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో నిర్వ‌హించ‌నున్నారు. ప‌రీక్ష ఫ‌లితాల‌ను 2021, జూన్ నెల‌లో ప్ర‌క‌టిస్తారు. 

ఎవ‌రు అర్హులు
జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌య పాఠ‌శాల‌లు ఉన్న జిల్లా ప‌రిధిలోని విద్యార్థులు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులు 2008, మే 1 నుంచి 2012, ఏప్రిల్ 30 మ‌ధ్య జ‌న్మించిన‌వారై ఉండాలి. ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన పాఠ‌శాల‌ల్లో ప్ర‌స్తుత విద్యాసంవ‌త్స‌రంలో ఐదోతర‌గ‌తి చదువుతున్న‌వారై ఉండాలి.  

ప‌రీక్ష విధానం
రాత‌ప‌రీక్ష కాల‌వ్య‌వ‌ధి మొత్తం 2 గంట‌లు (ఉద‌యం 11.30 నుంచి మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కు) ఉంటుంది. ఇందులో మూడు సెక్ష‌న్లు ఉంటాయి. మొత్తం 80 ప్ర‌శ్న‌లు 100 మార్కుల‌కు ఉంటాయి. 

మెంట‌ల్ ఎబిలిటీ టెస్ట్ -  40 ప్ర‌శ్న‌లు - 50 మార్కులు - 60 నిమిషాలు 
ఆర్థ‌మెటిక్ టెస్ట్ - 20 ప్ర‌శ్న‌లు - 25 మార్కులు - 30 నిమిషాలు
లాంగ్వేజ్ టెస్ట్ - 20 ప్ర‌శ్న‌లు - 25 మార్కులు - 30 నిమిషాలు
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: న‌వంబ‌ర్ 5

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: డిసెంబ‌ర్ 15

రాత‌పరీక్ష‌: 2021ఏప్రిల్ 10

ప‌రీక్ష ఫ‌లితాలు: 2021 జూన్‌లో

వెబ్‌సైట్‌: navodaya.gov.in   


No comments:

Post a Comment