యురేనియం కార్పొరేషన్లో 280 ఉద్యోగాలు,
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్)లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడులయ్యింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా వచ్చే నెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలని యూసీఐఎల్ కోరింది. ఎలాంటి రాత పరీక్ష లేదు. అంటే అభ్యర్థులు పదోతరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికచేయనుంది.
మొత్తం పోస్టులు: 240
ఇందులో ఫిట్టర్ 80, ఎలక్ట్రిషన్ 80, వెల్డర్ 40, టర్నర్ లేదా మెషినిస్ట్ 15, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 10, ఎంవీ మెకానిక్ 10, కార్పెంటర్ 5, ప్లంబర్ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్లో 50 శాతం మార్కులతో పాసవ్వాలి. అదేవిధంగా సంబంధిత ట్రేడ్‌లో 60 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. 2020, నవంబర్ 20 నాటికి 18 నుంచి 25 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్, ఐటీఐలో మెరిట్ ఆధారంగా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 10
వెబ్సైట్: http://uraniumcorp.in/
-----------------------------------------------------------------------------------------------------------------------
కెనరా బ్యాంకులో 220 స్పెషలిస్ట్ ఆఫీసర్లు ఉద్యోగాలు,
బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వరంగ సంస్థ అయిన కెనరా బ్యాంక్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులను ఎస్టీలకోసం స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టింది. మొత్తంగా 240 ఉద్యాగాలను భర్తీచేయనుంది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఒక్కో అభ్యర్థి ఒక్కో పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని షరతు విధించింది. ఆయా పోస్టులకు వచ్చిన దరఖాస్తులను బట్టి రాతపరీక్ష ద్వారా లేదా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను తదుపరి రౌండ్‌కు ఎంపిక చేస్తారు. మొత్తం విడు విభాగాలు భర్తీ ప్రక్రియ ఉంటుంది.
మొత్తం పోస్టులు: 220
ఇందులో బ్యాకప్ అడ్మినిస్ట్రేటర్-4, ఈఎల్టీ స్పెషలిస్ట్-5, బీఐ స్పెషలిస్ట్-5, యాంటీ వైరస్ అడ్మినిస్ట్రేటర్-5, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్-10, డాటాబేస్ అడ్మినిస్ట్రేటర్-12, డెవలపర్ లేదా ప్రోగ్రామర్-25, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్-21, ఎస్ఓసీ అనలిస్ట్-4, లా మేనేజర్లు-43, కాస్ట్ అకౌంటెంట్-1, సీఏ-20, మేనేజర్ ఫైనాన్స్-21, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్-4, ఎథికల్ హ్యాకర్స్ అండ్ పెనట్రేషన్ టెస్టర్స్-2, సైబర్ ఫోరెన్సిక్ అనలిస్ట్-2, డాటా మైనింగ్ ఎక్స్పర్ట్-2, ఓఎఫ్ఎస్ఏఏ అడ్మినిస్ట్రేటర్-2, ఓఎఫ్ఎస్ఎస్ టెక్నో ఫంక్షనల్-5, బేస్ 24 అడ్మినిస్ట్రేటర్-2, స్టోరేట్ అడ్మినిస్ట్రేటర్-4, మిడిల్‌వేర్ అడ్మినిస్ట్రేటర్-5, డాటా అనలిస్ట్-2, మేనేజర్-13, సీనియర్ మేనేజర్-1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు
డాటా అనలిస్ట్ పోస్టుకు డిగ్రీలో స్టాట్స్, మ్యాథ్స్, ఎకనమిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి.
మేనేజర్ ఫైనాన్స్ పోస్టుకు ఎంబీఏ ఫైనాన్స్ చేయాలి. సీఏ పోస్టుకు సీఏ, లా మేజర్‌కు ఎల్ఎల్బీ చేసి ఉండాలి.
మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులకు డిగ్రీ లేదా రిస్క్ మేనేజ్మెంట్ లేదా అంతర్జాతీయ బ్యాంకింగ్ లేదా ట్రెజరీ మేనేజ్మెంట్లో డిప్లొమా చేసి ఉండాలి. మూడు నుంచి ఐదేండ్ల అనుభవం, 38 ఏండ్లలోపువారై ఉండాలి.
మిగిలిన అన్ని పోస్టులకు బీఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్‌లో కంప్యూటర్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ లేదా ఐటీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లేదా ఎంసీఏ చేసి ఉండాలి. 20 నుంచి 35 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష లేదా షార్ట్‌లిస్టింగ్, గ్రూప్డిస్కన్, ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్ ఫీజు: రూ.600+జీఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100 +జీఎస్టీ
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 25
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 15
రాతపరీక్ష: 2021, జనవరి లేదా ఫిబ్రవరి
వెబ్సైట్: www.canarabank.com
-----------------------------------------------------------------------------------------------------------------------
ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ లో ఎమ్మెస్సీ (హార్టికల్చర్), పీహెచ్డీ (హార్టికల్చర్)- 2020-21,
ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ (ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ)లో 2020-21 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
కోర్సులు: ఎమ్మెస్సీ (హార్టికల్చర్), పీహెచ్డీ (హార్టికల్చర్)- 2020-21
విభాగాలు: ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరి కల్చర్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్ అండ్ ఆరోమాటిక్స్ క్రాప్స్.
అర్హతలు: సంబంధిత కోర్సును బట్టి బీఎస్సీ (హార్టికల్చర్)/ బీఎస్సీ (ఆనర్స్). పీహెచ్డీ ప్రోగ్రామ్‌కు ఎమ్మెస్సీ (హార్టికల్చర్) ఉత్తీర్ణత.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: 2020, డిసెంబర్ 4
వెబ్సైట్: http://skltshu.ac.in
-----------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్డీఓలో 21 జేఆర్ఎఫ్లు.
డీఆర్డీఓ.. డిఫెన్స్ మెటలర్జికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (డీఎంఆర్ఎల్)లో ఖాళీగా ఉన్న జేఆర్ఎఫ్, రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే ఏడాది జనవరి 2 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎలాంటి రాతపరీక్ష లేదని, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తామని ప్రకటించింది.
మొత్తం పోస్టులు: 21
ఇందులో జేఆర్ఎఫ్- 18 (మెటలర్జికల్ లేదా మెటీరియల్ సైన్స్-13, ఫిజిక్స్-1, కెమిస్ట్రీ-1, మెకానికల్-3), రిసెర్చ్ అసోసియేట్-3 (మెటలర్జికల్ లేదా మెటీరియల్ సైన్స్-1, ఫిజిక్స్-1, కెమిస్ట్రీ-1)
అర్హత: జేఆర్ఎఫ్లకు సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసిఉండాలి. మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ ఉత్తీర్ణులై, 28 ఏండ్లలోపు వయస్సు కలిగినవారై ఉండాలి. రిసెర్చ్ అసోసియేట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో ఎమ్మెస్సీ, ఎంటెక్ చేసి, 35 ఏండ్ల లోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. అధికారిక వెబ్సైట్లో నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను డౌన్‌లోడ్‌చేసుకుని, దానిని పూర్తిగానింపి అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి admin@dmrl.drdo.inకు ఈ-మెయిల్ చేయాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తులు ప్రారంభం: నంబర్ 21
దరఖాస్తులకు చివరితేదీ: 2021 జనవరి 2
వెబ్సైట్: drdo.gov.in
No comments:
Post a Comment