Tuesday, 24 November 2020

ఎస్‌బీఐలో 8500 అప్రెంటిస్ పోస్టులు, పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డులో 15 క‌న్స‌ల్టెంట్ పోస్టులు, బీఈఎల్‌లో 9 ప్రాజెక్ట్ ఇంజినీర్లు ఉద్యోగాలు, ఎన్ఐడీఎం 8 క‌న్స‌ల్టెంట్ పోస్టులు.

 ఎస్‌బీఐలో 8500 అప్రెంటిస్ పోస్టులు,


దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌, అనుభ‌వం ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చేనెల 10 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 8500 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఎంపిక ప్ర‌క్రియ రెండు విధాలుగా ఉంటుంది. మొద‌ట రాత‌ప‌రీక్ష నిర్వ‌హిస్తుంది. అందులో అర్హ‌త సాధించిన‌వారికి లాంగ్వేజ్ టెస్ట్ నిర్వ‌హిస్తుంది. అంటే అభ్య‌ర్థుల‌కు స్థానిక భాష‌ల‌పై ప‌ట్టు ఉండాలి. మూడేండ్ల కాల‌ప‌రిమితికి అప్రెంటిస్‌ను నియ‌మిస్తుంది. అప్రెంటిస్ కాలంలో మొద‌టి ఏడాది రూ.15 వేలు, రెండో ఏడాది రూ.16500, మూడో ఏడాది రూ.19 వేలు స్ట‌యిఫండ్‌గా చెల్లిస్తుంది. శిక్ష‌ణ అనంత‌రం వారికి స‌ర్టిఫికెట్ అందిస్తుంది. దీనిని ఎస్‌బీఐతోపాటు ఇత‌ర ప్రైవేట్ బ్యాంకులు నియామ‌కాల సంద‌ర్భంగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాయి. 


మ‌న‌కు 11 వంద‌ల పోస్టులు

దేశ‌వ్యాప్తంగా 8500 పోస్టులు ఉన్నాయి. అందులో తెలంగాణ‌లో 460, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 620 ఖాళీల చొప్పున‌ ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల‌కు స్థానిక అధికారిక‌ భాష‌లైన తెలుగు లేదా ఉర్దూపై ప‌ట్టు ఉండాలి. ‌అయితే ఏదైనా ఒక రాష్ట్రంలో మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 


మొత్తం పోస్టులు: 8500


ఇందులో జ‌న‌ర‌ల్ 3595, ఓబీసీ 1948, ఈడ‌బ్ల్యూఎస్ 844, ఎస్సీ 1388, ఎస్టీ 725 చొప్పున ఖాళీలు ఉన్నాయి. 


అర్హ‌త‌: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్య‌ర్థులు 20 నుంచి 28 ఏండ్ల లోపువారై ఉండాలి. 


ఎంపిక ఎలా?

అభ్య‌ర్థుల‌ను రాత‌ప‌రీక్ష‌, లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. రాత‌ప‌రీక్ష‌లో మొత్తం 100 బ‌హుళైచ్ఛిక‌ ప్రశ్న‌లు ఉంటాయి. ఇందులో జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, రీజ‌నింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూట‌ర్ ఆప్టిట్యూడ్ నుంచి 25 చొప్పున ప్ర‌శ్న‌లు అడుగుతారు. ప్ర‌తి ప్ర‌శ్న‌కు 1 మార్కు కేటాయించారు. ప్ర‌తి స‌బ్జెక్టును 15 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. స‌మాధానాలు త‌ప్పుగా రాస్తే 1/‌4 వంతు మార్కులు కోత‌విధిస్తారు. ఇందులో అర్హ‌త సాధించిన‌వారికి లాంగ్వేజ్ టెస్ట్ నిర్వ‌హిస్తారు. అయితే ప‌దో త‌ర‌గ‌తి లేదా ఇంట‌ర్ వ‌ర‌కు స్థానిక లేదా మాతృ భాషలో చ‌దివిన‌ట్లు మార్కు‌ల మెమో లేదా ధ్రువీక‌ర‌ణ ప‌త్రం స‌మ‌ర్పించిన‌వారికి ప‌రీక్ష నుంచి మిన‌హాయింపు ఉంటుంది. అంటే రాత‌ప‌రీక్ష‌తోనే నేరుగా ఎంపిక‌వుతారు. ‌  


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో


అప్లికేష‌న్ ఫీజు: రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు. 


ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: న‌వంబ‌ర్ 20


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: డిసెంబ‌ర్ 10


ప‌రీక్ష: 2021, జ‌న‌వ‌రిలో


వెబ్‌సైట్‌: www.sbi.co.in

---------------------------------------------------------------------------------------------------------------------

పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డులో 15 క‌న్స‌ల్టెంట్ పోస్టులు,

కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ ఆధ్వ‌ర్యంలోని సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)లో క‌న్స‌ల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 15 పోస్టుల‌ను భ‌ర్తీ చేయనుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చే నెల 18 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయి. ఎంపిక చేసిన అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు. 

మొత్తం పోస్టులు: 15

అర్హ‌త‌: ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్ లేదా ఇంజినీరింగ్ లేదా మేనేజ్‌మెంట్‌లో పీజీ చేసి ఉండాలి లేదా ఎన్విరాన్‌మెంట్ సైన్స్‌లో డిగ్రీ లేదా సివిల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ఎంపిక ప్ర‌క్రియ‌: ఇంట‌ర్వ్యూ ద్వారా. ద‌రఖాస్తులో పేర్కొన్న అర్హ‌త‌ల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌చేసి ఇంట‌ర్వ్యూకి ఆహ్వానిస్తారు. 

ద‌ర‌ఖాస్తుల ప్రారంభం: న‌వంబ‌ర్ 19

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: డిసెంబ‌ర్ 18

వెబ్‌సైట్‌: cpcb.nic.in 
---------------------------------------------------------------------------------------------------------------------

బీఈఎల్‌లో 9 ప్రాజెక్ట్ ఇంజినీర్లు ఉద్యోగాలు,

 ప‌్ర‌భుత్వ‌రంగ సంస్థ అయిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు వ‌చ్చే నెల 3లోగా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 9 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇందులో ట్ర‌యినీ ఓఎల్ ఆఫీస‌ర్ (ట్రాన్స్‌లేట‌ర్‌), ప్రాజెక్ట్ ఇంజినీర్ ఎల‌క్ట్రానిక్స్‌, మెకానిక‌ల్‌, సివిల్‌, హెచ్ఆర్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తుంది. ఎంపికైన అభ్య‌ర్థులు క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరులో ప‌నిచేయాల్సి ఉంటుంది. 

అర్హ‌త‌: ‌హిందీలో పీజీ, హెచ్ఆర్ స్పెష‌లైజేష‌న్‌తో ఎంబీఏ లేదా ఎమ్మెస్‌డ‌బ్ల్యూ చేసి ఉండాలి. బీఈ లేదా బీటెక్ లేదా నాలుగేండ్ల బీఎస్సీ ఇంజినీరింగ్‌లో ఎల‌క్ట్రానిక్స్, మెకానిక‌ల్‌, సివిల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి. 

అప్లికేష‌న్ ఫీజు: ‌ట్రాన్స్‌లేట‌ర్ పోస్టుల‌కు రూ.200, ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు.   

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ద్వారా

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: డిసెంబ‌ర్ 3

వెబ్‌సైట్‌: https://www.bel-india.in
---------------------------------------------------------------------------------------------------------------------

ఎన్ఐడీఎం 8 క‌న్స‌ల్టెంట్ పోస్టులు.


కేంద్ర హోం శాఖ ప‌రిధిలో ప‌నిచేస్తున్న‌‌ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ (ఎన్ఐడీఎం) ఖాళీగా ఉన్న క‌న్స‌ల్టెంట్‌ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తిక‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. వ‌చ్చేనెల 4లోపు నిర్ణీత న‌మూనాలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఎనిమిది పోస్టుల‌ను భర్తీ చేయ‌నుంది. ఇందులో ఎంపికైనవారు ఢిల్లీలో ప‌నిచేయాల్సి ఉంటుంది. 

పోస్టుల సంఖ్య‌: 8

ఇందులో సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్‌-2, క‌న్స‌ల్టెంట్‌-2, జూనియ‌ర్ క‌న్స‌ల్టెంట్‌-4 చొప్పున ఉన్నాయి. 

అర్హ‌త‌: సోష‌ల్ సైన్సెస్ లేదా ఎన్విరాన్‌మెంట‌ల్ లేదా ఎర్త్ సైన్సెస్ లేదా ఇంజినీరింగ్ లేదా డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ స‌బ్జెక్టుల‌తో పీజీలో 55 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించాలి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. నిర్ణీత న‌మూనాలో ఉన్న ద‌ర‌ఖాస్తుల‌ను పూర్తిగా నింపి అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికెట్ల‌ను జ‌త‌చేసి సంబంధిత చిరునామాకు పంపించాలి. సాఫ్ట్ కాపీని atcareer.nidm@gmail.comకు మెయిల్ చేయాలి. 

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ‌డిసెంబ‌ర్ 4

వెబ్‌సైట్‌: https://nidm.gov.in/ 

No comments:

Post a Comment