Thursday, 5 November 2020

యూకో బ్యాంక్‌లో స్పెష‌లిస్ట్‌ క్యాడ‌ర్ ఆఫీస‌ర్ పోస్టులు, నైనిటాల్ బ్యాంక్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు, బీడీఎల్‌లో ఇంజినీరింగ్ అప్రెంటిస్‌లు నోటిఫికేషన్‌, కేంద్ర అట‌వీ, పర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ‌లో క‌న్స‌ల్టెంట్లు , సీఎస్ఐఆర్‌-సీఐఎంఎఫ్‌ఆర్‌లో టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు.

 యూకో బ్యాంక్‌లో స్పెష‌లిస్ట్‌ క్యాడ‌ర్ ఆఫీస‌ర్ పోస్టులు,


------------------------ప‌్ర‌భుత్వ‌రంగ బ్యాంక్ అయిన యూకో బ్యాంక్‌లో ఖాళీగా ఉన్న స్పెష‌లిస్ట్‌ క్యాడ‌ర్ ఆఫీస‌ర్ స్కేల్‌-1, 2 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగినవారు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. ఆన్‌లైన్ ప‌రీక్ష‌ల‌ను ఈ ఏడాది ఆఖ‌రు లేదా వ‌చ్చే ఏడాది మొద‌టి నెల‌లో నిర్వ‌హించే అవ‌కాశం ఉన్న‌ది. 


పోస్టుల సంఖ్య‌: 91


ఇందులో చార్ట‌ర్డ్ అకౌంటెట్లు లేదా సీఎఫ్ఏ-50, ఐటీ ఆఫీస‌ర్‌-20, సెక్యూరిటీ ఆఫీస‌ర్‌-9, ఇంజినీర్లు-8, స్టాటిస్టీషియ‌న్‌-2, ఎక‌న‌మిస్ట్‌-2 పోస్టుల చొప్పున ఉన్నాయి. ప‌రీక్ష తేదీ నాటికి పోస్టుల సంఖ్యలో హెచ్చుత‌గ్గులు ఉండే అవ‌కాశం ఉన్న‌ది. 


అర్హ‌త‌: సెక్యూరిటీ ఆఫీస‌ర్ పోస్టుల‌కు సంబంధిత స‌బ్జెక్టులో డిగ్రీ చేసి ఉండాలి, ఇంజినీర్స్ పోస్టుల‌కు సివిల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ లేదా ఆర్కిటెక్ట్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి, స్టాటిస్టీషియ‌న్ పోస్టుల‌కు ఎక‌న‌మిక్స్ లేదా ఎక‌నామెట్రిక్ స్టాటిస్టిక్స్‌లో పీజీ చేయాలి, ఐటీ ఆఫీస‌ర్‌కు కంప్యూట‌ర్ సైన్స్ లేదా ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ లేదా ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలీ క‌మ్యూనికేష‌న్‌లో బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ చేసి ఉండాలి. సీఎఫ్ఏ పోస్టుల‌కు సీఏ లేదా సీఎఫ్ఏ చేసి ఉండాలి, ఎక‌న‌మిస్ట్ పోస్టుల‌కు ఎక‌నమిక్స్‌లో పీజీ లేదా పీహెచ్‌డీ చేసి ఉండాలి. అదేవిధంగా అక్టోబ‌ర్ 1 నాటికి 21 నుంచి 30 ఏండ్లలోపు (సెక్యూరిటీ ఆఫీస‌ర్‌కు 40 ఏండ్ల లోపు) వ‌య‌స్సు క‌లిగి ఉండాలి. 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. 


ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఎగ్జామ్‌, ఇంట‌ర్వ్యూ


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: న‌వంబ‌ర్ 17


రాత‌ప‌రీక్ష: ఈ ఏడాది డిసెంబ‌ర్ లేదా 2021 జ‌న‌వ‌రిలో 


వెబ్‌సైట్‌: ucobank.com.


---------------------------------------

నైనిటాల్ బ్యాంక్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు,


నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చేనెల 23 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయని వెల్ల‌డించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 15 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది.


అర్హ‌త‌: ‌గుర్తింపు పొందిన విశ్వ‌విద్యాల‌యం నుంచి 50 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే మార్కెటింగ్ అండ్ సేల్స్ స్పెష‌లైజేష‌న్‌తో డిగ్రీ లేదా పీజీ చేసిన‌వారికి ప్రాధాన్య‌త ఉంటుంద‌ని తెలిపింది. అదేవిధంగా హిందీ, ఇంగ్లిష్ తెలిసి కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. సెప్టెంబ‌‌ర్ 30 నాటికి 20 నుంచి 30 ఏండ్ల‌లోపువారై ఉండాలి. 


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. హార్డ్ కాపీకి అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికెట్ల‌ను జ‌త‌చేసి సంబంధిత చిరునామాకు పంపించాలి. 


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: న‌వంబ‌ర్ 23


వెబ్‌సైట్‌: nainitalbank.co.in

---------------------------------------------------------------

బీడీఎల్‌లో ఇంజినీరింగ్ అప్రెంటిస్‌లు నోటిఫికేషన్‌,

కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ ప‌రిధిలో ప‌నిచేసే భార‌త్ డైన‌మిక్స్ లిమిటెడ్ (బీడీఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమాచేసిన‌వారు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఇందులో మెద‌క్ జిల్లాలోని భానూర్ బీడీఎల్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి. భానూర్‌లోని ఖాళీల‌కు న‌వంబ‌ర్ 20లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.  

మొత్తం అప్రెంటిస్‌ల సంఖ్య‌: 119

ఇందులో గ‌్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు-83, టెక్నీషియ‌న్ అప్రెంటిస్‌-36 ఖాళీలు ఉన్నాయి. 

అర్హ‌త‌: బీటెక్ లేదా డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. ‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: న‌వంబ‌ర్ 2

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: న‌వంబ‌ర్ 18

వెబ్‌సైట్‌: www.mhrdnats.gov.in

---------------------------------------------------------------
కేంద్ర అట‌వీ, పర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ‌లో క‌న్స‌ల్టెంట్లు ,


కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, వాతావ‌ర‌ణ మార్పు మంత్రిత్వ శాఖ‌లో ఖాళీగా ఉన్న క‌న్స‌ల్టెంట్ పోస్ట‌లు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. నిర్ణీత న‌మూనాలో ఉన్న ద‌ర‌ఖాస్తుల‌ను వ‌చ్చే నెల 14 లోపు పంపించాల‌ని కోరింది. ఈనోటిఫికేష‌న్ ద్వారా ఐదు పో‌స్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. వేత‌నం నెల‌కు రూ.80 వేలు ఉంటుంది. ఢిల్లీలో ప‌నిచేయాల్సి ఉంటుంది. 

మొత్తం పోస్టులు: 5

ఇందులో ఫారెస్ట్రీ అండ్ వైల్డ్‌లైఫ్‌లో-2, మానిట‌రింగ్ అండ్ ఎవాల్యుయేష‌న్ విభాగంలో-1, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేష‌న్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీలో-1, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌లో-1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.  

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టులో పీజీ లేదా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. నిర్ణీత న‌మూనాలో ఉన్న ద‌ర‌ఖాస్తుల‌ను న్యూఢిల్లీలోని Ministry of Environment, Forest and Climate Change (National Authority)కు పంపించాలి.  

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: న‌వంబ‌ర్ 14

వెబ్‌సైట్‌: http://moef.gov.in/
---------------------------------------------------------------
సీఎస్ఐఆర్‌-సీఐఎంఎఫ్‌ఆర్‌లో టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు.

కేంద్ర ప్ర‌భుత్వరంగ సంస్థ సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ అండ్ ఫ్యూయెల్ రిసెర్చ్ (సీఐఎంఎఫ్‌ఆర్) ధ‌న్‌బాద్‌లో ఖాళీగా ఉన్న టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి సీఎస్ఐఆర్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి, అనుభ‌వం క‌లిగినవారు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 23 పోస్టుల‌ను భ‌ర్తీచేస్తున్న‌ది. ఉద్యోగం పొందిన‌వారు ధ‌న్‌బాద్‌లో పనిచేయాల్సి ఉంటుంది.  

మొత్తం పోస్టులు: 23

ఇందులో మైనింగ్ ఇంజినీరింగ్‌-9, కెమిక‌ల్ ఇంజినీరింగ్‌-3, కంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్‌-3, ఎల‌క్ట్రానిక్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లేదా ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌-3, సివిల్ ఇంజినీరింగ్‌-2, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్-2, మెట‌ల‌ర్జిక‌ల్ ఇంజినీరింగ్‌-1 ఖాళీ చొప్పున ఉన్నాయి. 

అర్హ‌తలు: బీటెక్‌లో మైనింగ్, కెమిక‌ల్, కంప్యూట‌ర్ సైన్స్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ లేదా ఎల‌క్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌, సివిల్, ఎన్విరాన్‌మెంట‌ల్‌, మెట‌ల‌ర్జిక‌ల్ ఇంజినీరింగ్‌లో 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులై ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తులకు చివ‌రితేదీ: డిసెంబ‌ర్ 2   

వెబ్‌సైట్‌: https://cimfr.nic.in

No comments:

Post a Comment