ఇంటెలిజెన్స్ బ్యూరోలో 2 వేల ఏసీఐఓ పోస్టులు,
కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఏసీఐఓ) పోస్టుల భర్తీకి కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2 వేల పోస్టులను భర్తీ చేయనుంది. ఇవన్నీ గ్రేడ్-2 లేదా ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉన్న జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్-సీ (నాన్ గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్) పోస్టులు. అభ్యర్థులను మూడు దఫాలుగా పరీక్షించిన తర్వాత ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 2000
ఇందులో జనరల్ 989, ఓబీసీ 417, ఈడబ్ల్యూఎస్ 113, ఎస్సీ 360, ఎస్టీ 121 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: డిగ్రీ పూర్తి చేసి 18 నుంచి 27 ఏండ్ల లోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష (ఆన్లైన్), డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
రాతపరీక్షలో టైర్-1, టైర్-2 ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారిని ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.
టైర్-1లో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, న్యూమరికల్ లేదా లాజికల్ లేదా అనలిటికల్, రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. గంట వ్యవధిలో పరీక్ష పూర్తిచేయాలి.
టైర్-2లో డిస్క్రిప్టివ్ టైప్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఎస్ఏ టైప్ ప్రశ్నలు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, ప్రెసిస్ రైటింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఎస్ఏకి 30 మార్కులు, మిగిలినవాటికి 20 మార్కులు మొత్తం 50 మార్కులకు ఉంటుంది. మొత్తం 60 నిమిషాల్లో పరీక్ష రాయాలి.
ఇంటర్వ్యూలో సైకోమెట్రిక్ లేదా ఆప్టిట్యూడ్ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఇది 100 మార్కులకు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు రూ.500
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని 9 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
దరఖాస్తులు ప్రారంభం: డిసెంబర్ 19
దరఖాస్తులకు చివరితేదీ: 2021, జనవరి 9
వెబ్సైట్: www.mha.gov.in or www.ncs.gov.in
-----------------------------------------------------------------------------------------------------------------------
ఎన్ఐఆర్డీలో 510 పోస్టులు,
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (ఎన్ఐఆర్డీ) మోడల్ గ్రామపంచాయతీలను నెలకొల్పే ప్రాజెక్టులో భాగంగా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు, యంగ్ ఫెలోస్, క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, అనుభవం, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈనెల 29 వరకు దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోసహా దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు కాలవ్యవధి రెండేండ్లపాటు ఉంటుంది. అయితే అభ్యర్థుల పనితీరు నచ్చినట్లయితే వారిని కొనసాగించే అవకాశం ఉంటుంది.
మొత్తం పోస్టులు: 510
ఇందులో స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ 10, యంగ్ ఫెలో 250, క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్ 250 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: స్టేట్ కోఆర్డినేటర్ కోసం.. ఎకనమిక్స్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ మేనేజ్మెంట్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, సోషల్ వర్క్, డెవలప్మెంట్ స్టడీస్, హిస్టరీతో సోషల్ సైన్సెస్‌లో పీజీ చేసినవారు అర్హులు.
యంగ్ ఫెలోస్‌కు సోషల్ సైన్సెస్‌లో పీజీ లేదా డిప్లొమా, క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్ పోస్టుకు ఇంటర్ చేసి ఉండాలి. అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 29
వెబ్సైట్: http://nirdpr.org.in/
-----------------------------------------------------------------------------------------------------------------------
బార్క్‌లో 156 డిప్లొమా ఇంజినీర్లు ఉద్యోగాలు,
బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్లో (బార్క్) స్టయిఫండరీ కేటగిరీలో ట్రైనీల భర్తీకి న్యూక్లియర్ రీసైకిల్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, 12వ తరగతి, పదో తరగతి పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 156 పోస్టులను భర్తీచేయనుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు తారాపూర్ లేదా కల్పకంలో శిక్షణనిస్తామని వెల్లడించింది. వచ్చేనెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. బీఎస్సీ కెమిస్ట్రీ పూర్తిచేసినవారికి నాలుగు పోస్టులు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.
మొత్తం పోస్టులు: 156
అర్హత: డిప్లొమాలో ఇంజినీరింగ్ పూర్తిచేసినవారితోపాటు 12వ తరగతి ఉత్తీర్ణులైనవారు, పదో తరగతి పాసై సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికెట్ కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 18 నుంచి 24 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్య, అడ్వాన్స్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: 2021, జనవరి 31
వెబ్సైట్: http://www.barc.gov.in
-----------------------------------------------------------------------------------------------------------------------
ఏఎఫ్ క్యాట్-2021 ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్.
భారత వాయుసేన... దేశరక్షణలో అత్యంత కీలకమైన దళం. దీనిలో ఆకాశమంత అవకాశాలు. ఏటా వేలాది ఉద్యోగాలను భర్తీ చేస్తుంటారు. డిగ్రీ పూర్తయిన వారికి భద్రమైన కొలువుతోపాటు ఆకర్షణీయమైన జీతభత్యాలు, సౌకర్యాలతో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఏఎఫ్‌క్యాట్ 01/2021 (కోర్సు ప్రారంభం జనవరి 2022) వివరాలు నిపుణ పాఠకుల కోసం....
ఏఎఫ్ క్యాట్
ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్. ఏటా రెండుసార్లు ఈ టెస్ట్ ద్వారా కమిషన్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్) విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. పర్మినెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్ ప్రాతిపదికన ఈ పోస్టు లను భర్తీ చేస్తారు.
మొత్తం ఖాళీలు-235
బ్రాంచీలవారీగా ఖాళీలు
ఏఎఫ్ క్యాట్ ఎంట్రీబ్రాంచీ: ఫ్లయింగ్
ఖాళీలు: షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ)- 69
బ్రాంచీ: గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)
ఖాళీలు: ఏఈ (ఎల్)- పర్మినెంట్ కమిషన్ (పీసీ)- 40, ఎస్ఎస్సీ- 17
ఏఈ (ఎం)- పీసీ-12, ఎస్ఎస్సీ- 17.
బ్రాంచీ: గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్)
ఖాళీలు: అడ్మిన్- పీసీ-12, ఎస్ఎస్సీ-19
అకౌంట్స్ పీసీ-6, ఎస్ఎస్సీ-10
లాజిస్టిక్స్ పీసీ-9, ఎస్ఎస్సీ-14
ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ
బ్రాంచీ: ఫ్లయింగ్
ఖాళీలు: సీడీఎస్ఈ ఖాళీల్లో 10 శాతం పీసీ కింద, ఏఎఫ్ క్యాట్‌లో 10 శాతం ఖాళీలను ఎస్ఎస్సీ కింద భర్తీ చేస్తారు.
నోట్: పీసీ అంటే పర్మినెంట్ కమిషన్, ఎస్ఎస్సీ అంటే షార్ట్ టర్మ్ కమిషన్.
ఎవరు అర్హులు?
కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, బీఈ/బీటెక్, బీకాంతోపాటు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, ఎన్సీసీ-సీ సర్టిఫికెట్ ఉండాలి. అకౌంట్స్ పోస్టులు బీకాం డిగ్రీ, లాజిస్టిక్స్‌కు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఫ్లయింగ్ బ్రాంచీకి 2022, జనవరి 1 నాటికి 20-24 ఏండ్ల మధ్య, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచీకి 20-26 ఏండ్ల మధ్య ఉండాలి.
నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
అవివాహిత పురుష/మహిళా అభ్యర్థులు అయి ఉండాలి.
శారీరక ప్రమాణాలు
కనీసం 167.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఫ్లయింగ్ బ్రాంచీకి కనీసం 162.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ ఛాతీ, బరువు ఉండాలి.
1.6 కి.మీ దూరాన్ని 9 నిమిషాల్లో పరుగెత్తాలి. 100 మీటర్ల దూరాన్ని 16 సెకండ్లు, నిమిషంలో 20 పుషప్స్ తదితర సామర్థ్యం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం
ఆన్లైన్ ఎగ్జామ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) అభ్యర్థులు తప్పనిసరిగా ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్‌కు హాజరు కావాలి.
పరీక్ష విధానం
మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి.
రెండు గంటల కాలవ్యవధి
మొత్తం 300 మార్కులు
దీనిలో జనరల్ అవేర్నెస్, వెర్బల్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, మిలిటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్.ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్: దీనిలో మెకానికల్, కంప్యూటర్‌సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులు ఉంటాయి.
మొత్తం ప్రశ్నలు 50. మొత్తం మార్కులు 150
నోట్: ఏఎఫ్ క్యాట్, ఈకేటీ పరీక్షలు ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఇస్తారు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు కోత విధిస్తారు.
పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్‌లో ఉన్నాయి.
ఆన్లైన్ పరీక్షలో అర్హత సాధించినవారికి ఎయిర్‌ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ (ఏఎఫ్‌ఎస్‌బీ) రెండుదశల్లో వివిధ పరీక్షలు నిర్వహిస్తుంది. తర్వాత ఇంటర్వ్యూ, వైద్యపరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తుంది.
పరీక్ష తేదీలు: తేదీలను త్వరలో వెబ్సైట్లో ప్రకటిస్తారు.
ట్రెయినింగ్
2022 జనవరి నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, దుండిగల్ (హైదరాబాద్)లో శిక్షణ ఇస్తారు. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచీకి 74 వారాలు, నాన్ టెక్నికల్ బ్రాంచీకి 52 వారాల శిక్షణ ఇస్తారు.
పే అలవెన్స్‌లు: ఫ్లయింగ్ ఆఫీసర్- లెవల్ 10 కింద నెలకు రూ.56,100-1,77,500/-, ఎంఎస్పీ రూ.15,500, శిక్షణ సమయంలో రూ.56,500 స్టయిఫండ్ ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: 2020, డిసెంబర్ 30
వెబ్సైట్: www. careerindianairforce.cdac.in or www. afcat.cdac.in’