Friday, 4 December 2020

ఐఓసీఎల్‌లో 493 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు, ఎయిమ్స్‌లో 139 పోస్టులు, ఇగ్నోలో నాన్‌ అకడమిక్‌ పోస్టులు.

ఐఓసీఎల్‌లో 493 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు,

 

ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 493 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఎంపికైనవారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళలో పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. తెలంగాణలో 54, ఆంధ్రప్రదేశ్‌లో 54 చొప్పున ఖాళీలు ఉన్నాయి.    

మొత్తం పోస్టులు: 493

ఇందులో జనరల్‌-239, ఈడబ్ల్యూఎస్‌-44, ఎస్సీ-72, ఎస్టీ-14, ఓబీసీ-14, పీడబ్ల్యూడీ-124 చొప్పున ఉన్నాయి.

పోస్టుల వివరాలు:

ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఫిట్టర్‌, ఎలక్ట్రిషన్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, మెషినిస్ట్‌, అకౌంటెంట్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్‌

అర్హతలు: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. 2020, అక్టోబర్‌ 31 నాటికి 18 నుంచి 24 ఏండ్లలోపువారై ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా. పరీక్ష కేంద్రాలు హైదాబాద్‌, విజయవాడలో కూడా ఉన్నాయి.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో  

దరఖాస్తులు ప్రారంభం: నవంబర్‌ 27

దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్‌ 12

రాతపరీక్ష: 2021, జనవరి 3న

వెబ్‌సైట్‌: www. iocl. com

------------------------------------------------------------------------------------------------------------

ఎయిమ్స్‌లో 139 పోస్టులు,

 

పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 139

పోస్టులు: ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 30 రోజుల్లోగా పంపాలి.

వెబ్‌సైట్‌: www.aiimskalyani.edu.in

సీఎస్‌ఐఆర్‌-సీజీసీఆర్‌ఐలో

సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్‌ గ్లాస్‌ అండ్‌ సిరామిక్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీజీసీఆర్‌ఐ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 40

పోస్టులు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, జేఆర్‌ఎఫ్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, జేఆర్‌ఎఫ్‌.

అర్హతలు, ఎంపిక తదితరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: డిసెంబర్‌ 9

వెబ్‌సైట్‌: http://www.cgcri.res.in

టెక్స్‌టైల్‌ కమిటీలో

మినిస్ట్రీ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ పరిధిలోని టెక్స్‌టైల్‌ కమిటీలో తాత్కాలిక ప్రాతిపదికన ఫెలో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

పోస్టు: ఫెలో

మొత్తం ఖాళీలు: 10

అర్హతలు, ఎంపిక తదితరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: డిసెంబర్‌ 31

వెబ్‌సైట్‌: http://textilescommittee.nic.in

నీతి ఆయోగ్‌లో

భారత ప్రభుత్వానికి చెందిన నీతి ఆయోగ్‌ అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ ద్వారా కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పోస్టు: యంగ్‌ ప్రొఫెషనల్‌

మొత్తం ఖాళీలు: 5

అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత, అనుభవం.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు పంపాలి.

వెబ్‌సైట్‌: https://niti.gov.in

-------------------------------------------------------------------------------------

ఇగ్నోలో నాన్‌ అకడమిక్‌ పోస్టులు.


 ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)లో ఖాళీగా ఉన్న నాన్‌ అకడమిక్‌ పోస్టుల భర్తీకి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 22 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ పోస్టులు 21, సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టు ఒకటి ఉన్నాయి. రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది.

అర్హత: అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ పోస్టుకు 55 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసి ఉండాలి. సెక్యూరిటీ ఆఫీసర్‌ పీజీ పూర్తిచేయడంతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. అదేవిధంగా అభ్యర్థులు 42 ఏండ్ల లోపువారై ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా. ఇగ్నో ఈ పరీక్షను నిర్వహిస్తుంది. మూడు గంటల్లో పరీక్షను పూర్తిచేయాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్‌ ఫీజు:  ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ, మహిళలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.6000, ఇతరులకు రూ.1000

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్‌ 31

అడ్మిట్‌ కార్డులు: 2021, జనవరి 11

పరీక్ష తేదీ: 2021, జనవరి 24

వెబ్‌సైట్‌: www.ignou.ac.in లేదా https://recruitment.nta.nic.in

No comments:

Post a Comment