ఎస్బీఐలో 452 మేనేజర్, స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్లు ఉద్యోగాలు,
దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 11 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 వందలకుపైగా పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో కొన్ని పోస్టులను షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేయనుంది.
మొత్తం పోస్టులు: 452
ఇందులో డిప్యూటీ మేనేజర్ (ఇంటర్నల్ ఆడిట్)-28, ఇంజినీర్ (ఫైర్)-16, మేనేజర్ (నెట్వర్కింగ్ సెక్యూరిటీ స్పెషలిస్ట్)- 12, మేనేజర్ (నెట్వర్క్ రూటింగ్ అండ్ స్విచింగ్ స్పెషలిస్ట్)-20, అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్)-40, డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్)-60, అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్)-183, డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్)-17, ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్-15, ప్రాజెక్ట్ మేనేజర్-14, అప్లికేషన్ ఆర్కిటెక్ట్-5, టెక్నికల్ లీడ్-2, మేనేజర్ (క్రెడిట్ ప్రొసీజర్స్)-2, మేనేజర్ (మార్కెటింగ్)-12, డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్)-26 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఎంబీఏ లేదా పీజీడీబీఎం లేదా సీఏ, కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా ఐటీ లేదా ఈసీఈ లేదా ఎమ్మెస్సీ (కంప్యూటర్స్) లేదా ఎమ్మెస్సీ (ఐటీ), బీటెక్ లేదా బీఈ, పీజీ చేసి ఉండాలి. ఇందులో కొన్ని పోస్టులకు అనుభవం తప్పనిసరి. అదేవిధంగా అభ్యర్థులు 21 నుంచి 40 ఏండ్లలోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్ లేదా ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: 2021, జనవరి 11
వెబ్సైట్: https://bank.sbi/web/careers or https://www.sbi.co.in/web/careers
---------------------------------------------------------------------------------------------------------------------
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 32 స్పెషలిస్ట్ ఆఫీసర్లు ఉద్యోగాలు,
దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 32 పోస్టులను భర్తీచేయనుంది. ఇందులో ఎంపికైనవారు గుజరాత్‌లోని వడోదరాలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 32
ఇందులో స్పెషలిస్ట్ ఆఫీసర్లు (ఎస్వో)-27, ఫైర్ ఆఫీసర్లు-7 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: స్పెషలిస్ట్ ఆఫీసర్‌కు డిగ్రీ పూర్తిచేసి 25 నుంచి 40 ఏండ్ల లోపు వయస్సు ఉండాలి. ఫైర్ ఆఫీసర్ పోస్టులకు బీఈ (ఫైర్), ఎన్ఎఫ్ఎస్సీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి లేదా బీటెక్‌లో ఫైర్ టెక్నాలజీ చేసి, 23 నుంచి 35 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100
దరఖాస్తులు ప్రారంభం: డిసెంబర్ 19
దరఖాస్తులకు చివరితేదీ: 2021, జనవరి 8
వెబ్సైట్: www.bankofbaroda.in/careers.htm
---------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment