స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో స్పెషలిస్ట్ కేడర్ ఉద్యోగాలు,
ఎస్బీఐలో
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో
స్పెషలిస్ట్ కేడర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు: మేనేజర్ (రిటైల్ ప్రొడక్ట్స్)
మొత్తం ఖాళీలు: 5 అర్హతలు, ఎంపిక తదితరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 12
వెబ్సైట్: http://www.sbi.co.in
ఆర్బీఐలో 241 పోస్టులు
దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ కార్యాలయాల్లో సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు: సెక్యూరిటీ గార్డ్
మొత్తం ఖాళీలు: 241
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత, మిలిటరీ సర్వీస్ ముందు లేదా తరువాత రిక్రూట్మెంట్ జోన్ బయట నుంచి క్వాలిఫైయింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన మాజీ సైనికులు కూడా అర్హులు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 12
వెబ్సైట్: https://www.rbi.org.in
ఎస్ఈసీఐలో న్యూఢిల్లీలోని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్
ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 26
పోస్టులు: మేనేజర్ (బిజినెస్ డెవలప్మెంట్), సీనియర్ ఆఫీసర్, సీనియర్ ఇంజినీర్ (ఐటీ), సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ తదితరాలు.
దరఖాస్తు: ఆన్లైన్లో ఫిబ్రవరి 10 నుంచి
చివరితేదీ: మార్చి 9
వెబ్సైట్: https://www.seci.co.in
----------------------------------------------------------------------------------------------------------------------------
యూపీఎస్సీ 241 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్,
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వచ్చే నెల 11 వరకు ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 241
ఇందులో డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్-116, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్-80, అసిస్టెంట్ ప్రొఫెసర్ (స్పెషల్ గ్రేడ్ 3)-45, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్-6, లెక్చరర్-1, అసిస్టెంట్ డైరెక్టర్-1 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. అభ్యర్థులు 30 ఏండ్లు (జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్), 35 ఏండ్లు (అసిస్టెంట్ డైరెక్టర్, లెక్చరర్), 40 ఏండ్లు (గ్రేడ్ 3 పోస్టులకు) లోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 11
వెబ్సైట్: http://www.upsconline.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------
త్రివిధ దళాల్లో ఉద్యోగాలు,
రక్షణ దళాలు.. దేశ రక్షణలో కీలకపాత్ర పోషించే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో ఇటీవల వందలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. త్వరలో మరికొన్ని రానున్నాయి. వీటితోపాటు రాష్ట్రంలో మార్చి నెలలో ఆర్మీ ర్యాలీ నిర్వహించున్నారు. మంచి శరీరదారుఢ్యం కలిగి ఇంటర్, డిగ్రీ, పీజీ చదివిన విద్యార్థులకు ఇదొక సువర్ణ అవకాశం. ఆయా ప్రకటనల వివరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం...
ఆర్మీలో జేసీఓ పోస్టులు
ఇండియన్ ఆర్మీ ఆర్ఆర్టీ 91, 92, 93, 94, 95 కోర్సుల ద్వారా జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు (రిలీజియస్ టీచర్ల) నియామకప్రకటనను ఆర్మీ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 194
పోస్టు: పండిట్- 171 ఖాళీలు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు హిందు అభ్యర్థులు సంస్కృతంలో ఆచార్య అర్హత ఉండాలి.
పోస్టు: పండిట్ (గోర్ఖా-గోర్ఖా రెజిమెంట్స్ కోసం)- 9 ఖాళీలు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు హిందూ అభ్యర్థులు సంస్కృతంలో ఆచార్య అర్హత ఉండాలి.
పోస్టు: గ్రంథి- 5 ఖాళీలు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సిక్కు అభ్యర్థులకు పంజాబీలో గ్యానీ అర్హత ఉండాలి.
పోస్టు: మౌల్వి (సున్నీ)- 5 ఖాళీలు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ముస్లిం అభ్యర్థులకు అరబిక్‌లో మౌల్వీ అలీం/ ఉర్దూలో అదిబ్ అలీం అర్హత ఉండాలి.
పోస్టు: మౌల్వి (షియా) లద్ధాఖ్ స్కౌట్స్-1 ఖాళీ
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ముస్లింలకు అరబిక్‌లో మౌల్వీ అలీం/ ఉర్దూలో అదిబ్ అలీం అర్హత ఉండాలి.
పోస్టు: పాడ్రే- 2 ఖాళీలు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు స్థానిక బిషప్‌గా ఆమోదం పొంది ప్రస్తుతం ఆ పనిలో కొనసాగుతూ ఉండాలి.
పోస్టు: బోధ్ సన్యాసి (మహాయాన) లద్ధాఖ్ స్కౌట్స్ కోసం-1
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు బోధ్ సన్యాసిగా గుర్తింపు పొంది, కాన్సా/ లోపాన్/ రబ్‌జాంలో పీహెచ్డీ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు: సివిలియన్, ఇన్-సర్వీస్ అభ్యర్థులకు సంబంధించి వయస్సు 2021, అక్టోబర్ 1 నాటికి 25-34 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1987 అక్టోబర్ 1- 1996 సెప్టెంబర్ 30 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ స్టాండర్డ్ అండ్ ఫిట్నెస్ టెస్ట్, వైద్యపరీక్షల ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: ఫిబ్రవరి 9
పరీక్షతేదీ: జూన్ 27
వెబ్సైట్: http://joinindianarmy.nic.in
ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ
ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది.
పోస్టు: ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ
మొత్తం ఖాళీలు: 55. వీటిలో 50 పురుషులకు, 5 మహిళలకు కేటాయించారు. ఈ రెండు విభాగాల్లోనూ 6 (పురుషులు 5, మహిళలు
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు అకడమిక్ సంవత్సరాలు ఎన్సీసీ సీనియర్ డివిజన్ వింగ్‌లో కొనసాగి ఉండాలి.
వయస్సు: జనవరి 1 నాటికి 19 నుంచి 25 ఏండ్లలోపు ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్లో..
చివరితేదీ: జనవరి 28 (మధ్యాహ్నం 3 వరకు)
వెబ్సైట్: http://www.joinindianarmy.nic.in
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)లో ఎయిర్‌మెన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు: ఎయిర్ మెన్
విభాగాలు: గ్రూప్-ఎక్స్ (ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ ట్రేడ్ మినహాయించి), గ్రూప్-వై (ఐఏఎఫ్(ఎస్) & మ్యూజీషియన్ ట్రేడ్ మినహాయించి), గ్రూప్-వై (మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్)
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత. పూర్తి వివరాలు సైట్లో చూడవచ్చు.
వయస్సు: 21 ఏండ్లు మించరాదు.
ఎంపిక: శరీర దారుఢ్య పరీక్ష, వైద్యపరీక్ష, ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: ఫిబ్రవరి 7
వెబ్సైట్: https://indianairforce.nic.in
సికింద్రాబాద్‌లో ఆర్మీ ర్యాలీ
హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో రాష్ట్ర అభ్యర్థుల కోసం ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు.
పోస్టులు: సోల్జర్- టెక్నికల్, టెక్నికల్ (ఏవియేషన్/అమ్యునిషన్ ఎగ్జామినర్), టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ, ట్రేడ్స్‌మెన్, క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్.
అర్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. ఎనిమిదోతరగతి నుంచి ఇంటర్ చదివిన వారికి అవకాశం ఉంది.
ఎంపిక: ఫిజికల్ ఫిట్‌నెస్ట్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, వైద్యపరీక్షలు, కామన్ రిటన్ ఎగ్జామ్ ద్వారా
ర్యాలీ తేదీలు: మార్చి 5 నుంచి మార్చి 24 వరకు
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: ఫిబ్రవరి 17
వెబ్సైట్: http://joinindianarmy.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------
మంగళగిరి ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.
ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వచ్చే నెలాఖరు వరకు ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 116 పోస్టులను భర్తీచేయనుంది. ఇందులో వివిధ డిపార్ట్మెంట్లలోని ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ వంటి పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 116
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసి, టీచింగ్ విభాగంలో 14 ఏండ్ల అనుభవం ఉండాలి. 58 ఏండ్లలోపువారై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్. హార్డ్ కాపీని అవసరమైన సర్టిఫికెట్లు జతచేసి సంబంధిత అడ్రస్‌కు పంపించాలి.
అడ్రస్: Assistant Controller of Examination, Exam Cell, Room No – 116, First Floor, Dharmashala Building, AIIMS Mangalagiri, Guntur, Andhra Pradesh, Pin – 522503.
అప్లికేషన్ ఫీజు: రూ.3000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2500, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: జనవరి 29
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 28
వెబ్సైట్: www.aiimsmangalagiri.edu.in