Wednesday, 20 January 2021

టీఎస్‌ఆర్టీసీలో అప్రెంటిస్‌లు, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీలో 180 అప్రెంటిస్‌ పోస్టులు, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్‌ పోస్టులు.

 టీఎస్‌ఆర్టీసీలో అప్రెంటిస్‌లు,


రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ టీఎస్‌ఆర్టీసీ.. 2021-22 విద్యా సంవత్సరానికిగాను ఐటీఐలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్‌నకు అవకాశం కల్పిస్తున్నది. ఐటీఐ డీజిల్‌ మెకానిక్‌, ఎలక్ట్రిషన్‌, మోటార్‌ మెకానిక్ ట్రేడులు పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 30లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎంపిక చేసిన అభ్యర్థులకు సికింద్రాబాద్‌ రీజినల్‌ పరిధిలోని 12 డిపోలలో శిక్షణ అందించనుంది. మెరిట్‌ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేసి రీజినల్‌ పరిధిలోని 12 డిపోలలో అవసరం మేరకు అంప్రెంటిషిప్‌ శిక్షణ ఇవ్వనుంది. 


అర్హత: డీజిల్‌ మెకానిక్‌, ఎలక్ట్రిషన్‌, మోటార్‌ మెకానిక్ ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో


దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 30


వెబ్‌సైట్‌: WWW.apprenticeshipindia.org  

-------------------------------------------------------------------------------------------------

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీలో 180 అప్రెంటిస్‌ పోస్టులు,

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈనెల 24 వరకు ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ పోస్టులన్నీ నార్తర్న్‌ రీజియన్‌లో ఖాళీగా ఉన్నాయి.    


మొత్తం పోస్టులు: 180


ఇందులో గ్రాడ్యుయేట్‌ లేదా డిప్లొమా అప్రెంటిస్‌లు-166, ఐటీఐ అప్రెంటిస్‌లు-14 చొప్పున ఉన్నాయి. 


అర్హతలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు సంబంధిత సబ్జెక్టులో నాలుగేండ్ల ఇంజినీరింగ్‌ లేదా మూడేండ్ల డిప్లొమా చేసి ఉండాలి. ఐటీఐ అప్రెంటిస్‌లకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసిఉండాలి. 


ఎంపిక ప్రక్రియ: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. ఎంపిక చేసినవారిని ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూకి సంబంధించిన వివరాలను అభ్యర్థుల మెయిల్‌ ఐడీకి పంపిస్తారు. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో


దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 24


వెబ్‌సైట్‌: aai.aero 


-------------------------------------------------------------------------------------------------
ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్‌ పోస్టులు.

భారతీయ వాయుసేనలో ఎయిర్‌మెన్‌ పోస్టుల భర్తీకి ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన అవివావిత యువకులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 22న ప్రారంభంకానుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా గ్రూప్‌-ఎక్స్‌ ట్రేడ్‌ (ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌ ట్రేడ్‌ మినహా), గ్రూప్‌-వై (ఏఐ సెక్యూరిటీ, మ్యుజీషియన్‌ ట్రేడ్లు మినహా) ట్రేడ్‌ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. దీనికోసం ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ స్టార్‌ ఎగ్జామ్‌ను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ఏప్రిల్‌ 18 నుంచి 22 వరకు జరుగనుంది. 

అర్హతలు: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో 10 + 2 పాసై ఉండాలి. మూడు సబ్జెక్టులతో కలిపి కనీసం 50 శాతం, ఇంగ్లిష్‌ సబ్జెక్టులో 50 శాతం వచ్చిఉండాలి. అదేవిధంగా డిప్లొమా చేసిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

గ్రూప్‌-వై ట్రేడ్‌లకు 10+2 పాసై, ఇంగ్లిష్‌లో తప్పనిసరిగా 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. అభ్యర్థులు 21 ఏండ్ల లోపువారై ఉండాలి. 

స్టయిఫండ్‌: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.14600 ఇస్తారు. ట్రైనింగ్‌ పూర్తయిన తర్వాత గ్రూప్‌ ఎక్స్‌ ట్రేడ్‌ల వారికి రూ.33,100, ఇతరులకు రూ.26,900 ఇస్తారు. 

ఎంపికవిధానం: రాతపరీక్ష ద్వారా 

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులు ప్రారంభం: జనవరి 22

దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 7

ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌: ఏప్రిల్‌ 18 నుంచి 22 వరకు

వెబ్‌సైట్‌: careerindianairforce.cdac.in

No comments:

Post a comment